శశిలేఖ (పత్రిక)
| సంపాదకులు | నేలటూరి పార్థసారథి అయ్యంగారు |
|---|---|
| తరచుదనం | వారపత్రిక ద్వైవారపత్రిక దినపత్రిక |
| స్థాపకులు | గట్టుపల్లి శేషాచార్యులు |
| మొదటి సంచిక | 1894 |
| ఆఖరి సంచిక | 1956 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
శశిలేఖ తెలుగు ప్రాంతాల ఏకీకరణకు పోరాడిన తొలి పత్రిక. 1894 జూన్‌లో గట్టుపల్లి శేషాచార్యులు మద్రాను నుంచి దీన్ని ప్రారంభించాడు. ఇది వారపత్రికగా మొదలై, కొంతకాలం ద్వైవారపత్రికగా నడిచి, ఆ తరువాత దినపత్రికగా మారింది. నేలటూరు పార్ధసారథి అయ్యంగారు దీనికి సంపాదకుడు. బోయరు యుద్ధసమయంలో దీనికి మంచి ఆదరణ లభించింది. తెలుగు పాఠకులకు యుద్ధవార్తలను అందించింది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి బాసటగా నిలిచింది.[1] ఆ రోజుల్లో ఇంగ్లీషులో వెలువడుతూండే మద్రాసు స్టాండర్డ్ పత్రికకు ఇది తెలుగు కాపీ అని భావించేవారు.[2] ద్వైవార పత్రికగా ఉండగా దీని సర్క్యులేషను 550 కాపీలు.[3] ఈ పత్రిక 1956 వరకు నడిచి ఆగిపోయింది.[4]
శశిలేఖ గ్రాంథిక భాషకు అనుకూలంగా ఉండేది. కన్యాశుల్కం నాటకాన్ని గ్రాంథిక భాషలో రాయనందుకు అది గర్హించింది.[5]
ఈ పత్రిక గురించి దాన్ని సమకాలికురాలైన వైజయంతి పత్రిక 1894 జూలై సంచికలో ఇలా రాసింది: “శశిలేఖ నాబరగు నాంధ్ర వార్తాపత్రిక యీ చెన్నపురిన వారమున కొక్కసారి ప్రకటితంబగుచున్నది. సర్వజన సమాదరణీయంబులగు విశేషంబులును ఘనత చెందిన హిందువుల చరిత్రంబులును జనులకు దెలియ దగిన వృత్తాంతబులుం యిప్పత్రిక చెలువొందుచున్నది.”[6]
మూలాలు
[మార్చు]- ↑ డా.జె., చెన్నయ్య (2011). వ్యాసమాలిక. హైద్రాబాదు: తెలుగు విద్యార్థి ప్రచురణలు. p. 63.
{{cite book}}: CS1 maint: date and year (link) - ↑ డా.జె., చెన్నయ్య (2003). తెలుగు దినపత్రికలు భాషాసాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్. p. 70.
- ↑ కాళిదాసు, పురుషోత్తం (2007). ఇంగ్లిష్ జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య. నెల్లూరు: సొసైటీ ఫర్ సోషల్ చేంజ్. p. 110.
- ↑ డా. జి.వి., పూర్ణచందు (2018). తెలుగు కోసం. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ప్రచురణ. p. 344.
- ↑ కాళిదాసు, పురుషోత్తం (2007). ఇంగ్లిష్ జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య. నెల్లూరు: సొసైటీ ఫర్ సోషల్ చేంజ్. p. 101.
- ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు కాడమీ. p. 23.