Jump to content

శశి పంజా

వికీపీడియా నుండి
శశి పంజా
కోల్‌కతా పుస్తక ప్రదర్శన 2025లో శశి పంజా
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
Assumed office
2022 జులై 28
ముఖ్యమంత్రిమమతా బెనర్జీ
అంతకు ముందు వారుపార్థ ఛటర్జీ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
Assumed office
2013 డిసెంబరు 26
ముఖ్యమంత్రిమమతా బెనర్జీ
అంతకు ముందు వారుసబిత్రి మిత్రా
వ్యక్తిగత వివరాలు
జననం (1962-10-04) 1962 అక్టోబరు 4 (age 62)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
రాజకీయ పార్టీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిప్రసున్ కుమార్ పంజా
సంతానంపూజ, నమ్రత
కళాశాలఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్

డాక్టర్ శశి పంజా, పశ్చిమ బెంగాల్ కు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె మమతా బెనర్జీ మూడవ మంత్రి వర్గంలో పరిశ్రమలు, వాణిజ్యం, మహిళా, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, తదితర శాఖల క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్నది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన తెలుగు కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి పిల్లలమర్రి టి కృష్ణయ్య హిందుస్తాన్ మోటార్స్ లో చీఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ గా పనిచేస్తూ కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KMDA) పరిధిలోని హింద్‌మోటర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆమె కోల్కతాలోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి ఎంబీబీఎస్ చేసింది. ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు అజిత్ కుమార్ పంజా కుమారుడు ప్రసూన్ కుమార్ పంజాను వివాహం చేసుకుంది.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

శశి పంజా 2010లో కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా ఎన్నికయింది.[4]

ఆమె 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో శ్యాంపుకూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయింది, అదే నియోజకవర్గం నుండి 2016, 2021లలో తిరిగి ఎన్నికయింది.[5]

ఆమె పశ్చిమ బెంగాల్ మంత్రుల మండలిలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నది. డిసెంబరు 2013లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతను స్వీకరించింది.[6] మే 2014లో ఆమెకు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.[7]

2021లో ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 21వ మంత్రుల మండలి భాగంగా మహిళా, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖలతో మమతా బెనర్జీ నాయకత్వంలోని క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Sashi Panja:HM's own girl". Drishtikon, 17 May 2011. 16 May 2011. Retrieved 17 July 2014.
  2. "Election Watch Reporter". My neta. Retrieved 17 July 2014.
  3. "লোকসভার নিরিখে এগিয়ে BJP, খেলা ঘোরাতে পারবেন অজিত পাঁজার পুত্রবধূ?".
  4. "Know Your MLA". The Telegraph. 17 May 2011. Archived from the original on 25 July 2014. Retrieved 17 July 2014.
  5. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 17 July 2014.
  6. "Three new ministers take oath at Raj Bhavan, state cabinet reshuffled". All India Trinamool Congress, 26 December 2013. Archived from the original on 26 జూలై 2014. Retrieved 17 July 2014.
  7. "Bratya shifted to tourism, Partha new education minister, Mitra to see IT also". The Statesman. 28 May 2014. Archived from the original on 27 July 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=శశి_పంజా&oldid=4556924" నుండి వెలికితీశారు