శశి భూషణ్
| శశి భూషణ్ | |
|---|---|
2006లో శశి భూషణ్ కు పద్మ భూషణ్ ను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం. | |
| జననం | 1924 నవంబరు 11 లష్కర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
| మరణం | 2011 సెప్టెంబరు 30 (వయసు: 86) న్యూఢిల్లీ, భారతదేశం |
| వృత్తి | స్వాతంత్ర్య కార్యకర్త రాజకీయ నాయకుడు సామాజిక కార్యకర్త |
| పురస్కారాలు | పద్మ భూషణ్ పురస్కారం |
శశి భూషణ్ (1924 - 2011), ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత.[1] ఆయన రాష్ట్రీయ ఏక్తా సమితి, ఆల్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్గనైజేషన్, పంజాబ్ ఏక్తా సమితి, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషలిస్ట్ ఎడ్యుకేషన్ వంటి అనేక సంస్థలను స్థాపించాడు. మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ నియోజకవర్గానికి 1967, 1971 ల మధ్య, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి 1971, 1977ల మధ్య ప్రాతినిధ్యం వహించాడు.[2][3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]1924 నవంబరు 11న ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారత సంస్థానమైన గ్వాలియర్ లష్కర్ లో శశి భూషణ్ జన్మించాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.[5]
రాజకీయ జీవితం
[మార్చు]భారత స్వాతంత్ర్యం తరువాత, ఆయన భారత జాతీయ కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని కొనసాగించి, 1971 భారత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి అప్పటి జనసంఘ్ అధ్యక్షుడు బలరాజ్ మధోక్ పై విజయం సాధించాడు.[6] ఆయన ఫిరోజ్ గాంధీః ఎ పొలిటికల్ బయోగ్రఫీ రచయత, ఇది ఇందిరా గాంధీ భర్త జీవితం గురించి తెలిసిన ఏకైక పుస్తకం.[7][8] ఆయన 5వ లోక్‌సభకు ఖర్గోన్ నియోజకవర్గం నుండి, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి సభ్యుడిగా ఉన్నాడు.
గుర్తింపు
[మార్చు]ప్రజా వ్యవహారాలకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2006లో ఆయనకు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[9] 1970లో ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎడ్యుకేషన్ కు 2007లో భారత రాష్ట్రపతి జాతీయ మత సామరస్య పురస్కారాన్ని ప్రదానం చేసాడు.[10]
మరణం
[మార్చు]ఆయన 2011 సెప్టెంబరు 30న, 86 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఆయనకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[11]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Political career". Shashi Bhushan Sansad. 2016. Retrieved 13 June 2016.
- ↑ "All India Freedom Fighters' Organisation" (PDF). Lexis Nexis. 2016. p. 6. Retrieved 13 June 2016.
- ↑ "Shashi Bhushan, Former MP No More". India Wires. 30 September 2011. Archived from the original on 6 ఆగస్టు 2016. Retrieved 13 June 2016.
- ↑ "About Shri Shashi Bhushan". India Mart. 2016. Retrieved 13 June 2016.
- ↑ "Biography". Shashi Bhushan Sansad. 2016. Archived from the original on 24 మార్చి 2016. Retrieved 13 June 2016.
- ↑ "Former MP Shashi Bhushan Dead – Outlook India". Outlook India. 30 September 2011. Retrieved 13 June 2016.
- ↑ "Feroze Gandhi: A Political Biography". Indian Institute of Technology, Kanpur. 2016. Retrieved 13 June 2016.
- ↑ Feroze Gandhi. Frank Bros. & Co. 2008. pp. 2–. ISBN 978-81-8409-494-7.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 19 అక్టోబర్ 2017. Retrieved 3 January 2016.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "National Communal Harmony Award" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 8 అక్టోబర్ 2016. Retrieved 13 June 2016.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Former MP Shashi Bhushan dead – ReDiff". ReDiff News. 30 September 2011. Retrieved 13 June 2016.