అక్షాంశ రేఖాంశాలు: 34°26′45″N 119°34′49″W / 34.445806°N 119.580194°W / 34.445806; -119.580194

శాంటా బార్బరా వేదాంత దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంటా బార్బరా వేదాంత దేవాలయం
శాంటా బార్బరా వేదాంత దేవాలయం
మతం
అనుబంధంరామకృష్ణ ఆర్డర్ ఆఫ్ ఇండియా
Regionశాంటా బార్బరా కౌంటీ
ప్రదేశం
ప్రదేశంమోంటెసిటో, కాలిఫోర్నియా
రాష్ట్రంకాలిఫోర్నియా
భౌగోళిక అంశాలు34°26′45″N 119°34′49″W / 34.445806°N 119.580194°W / 34.445806; -119.580194
వాస్తుశాస్త్రం.
నిర్మాణశిల్పిలూతా మరియా రిగ్స్
శైలితొలి దక్షిణ భారత చెక్క, జపనీస్, చైనీస్ నిర్మాణ శైలులు[1]
పూర్తైనది1956
Website
Vedanta Temple, Santa Barbara

శాంటా బార్బరా వేదాంత దేవాలయం, అమెరికాలోని శాంటా బార్బరా నగరంలో ఉన్న హిందూ దేవాలయం. 1956లో నిర్మించబడిన ఈ దేవాలయం, శాంటా బార్బరా నగరానికి ఎగువన ఉన్న పర్వత ప్రాంతాల మధ్యలో శాంటా యెనెజ్ పర్వతాల శిఖరాల దిగువన ఉన్న 45 ఎకరాల స్థలంలో ఉంది. ఈ దేవాలయం పసిఫిక్ మహాసముద్రం, కాలిఫోర్నియాలోని ఛానల్ దీవులను చూసే స్పష్టమైన వీక్షణను కలిగి ఉంది.[2]

వేదాంత సొసైటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో భాగంగా ఉన్న, రామకృష్ణ ఆర్డర్ ఆఫ్ ఇండియా పశ్చిమ శాఖ ఇది.

చరిత్ర

[మార్చు]

1944లో జూనియర్ లిన్సీడ్ ఆయిల్ మాగ్నెట్ స్పెన్సర్ కెల్లాగ్ (1876-1944)[3] అనేవ్యక్తి వేదాంత సొసైటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు తన ఎస్టేట్‌లోని 30 ఎకరాల భూమిని విరాళంగా అందించాడు.[4]

నిర్మాణం

[మార్చు]

దేవాలయం లోపలి గర్భగుడిలో నల్లని పాలరాతి బలిపీఠం ఉంది. పైన 44" x 50" సైజులో పద్మాసనంలో కూర్చొని ఉన్న పరమహంస, యోగి శ్రీ రామకృష్ణ కాన్వాస్ పెయింటింగ్ ఉంది. దీనిని 1962లో ట్రాబుకో కాన్యన్ మొనాస్టరీ సన్యాసి స్వామి తదాత్మానంద (1932-2008) చిత్రించాడు.[5] స్వామి ప్రభవానందచే "కళాత్మక మేధావి"గా వర్ణించబడిన స్వామి తదాత్మానంద పోడియం కుడి వైపున గొర్రెపిల్లను పట్టుకొని ఉన్న యేసుక్రీస్తు నిలువెత్తు బొమ్మను, గౌతమ బుద్ధుని నిలువెత్తు బొమ్మను చిత్రించాడు. ప్రతి పెయింటింగ్‌ను 1965లో ఆలయంలో ఏర్పాటు చేశారు.[6]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Lutah Maria Riggs papers, Lutah Maria Riggs: Vedanta Temple (Montecito, Calif.)". Santa Barbara, California: Architecture and Design Collection. Art, Design & Architecture Museum; University of California, Santa Barbara. 1955. Archived from the original on 2021-12-31. Retrieved 2022-03-23.
  2. "Vedanta Temple, Santa Barbara". Vedanta Society of Southern California. 2016. Retrieved 2022-03-23.
  3. "Spencer Kellogg, Jr". Los Angeles, California: Geni. 12 Dec 2018. Retrieved 2022-03-23.
  4. "History of the Santa Barbara Vedanta Temple". Santa Barbara, California: The Bookstore at the Vedanta Temple. 2021. Retrieved 2022-03-23.{{cite web}}: CS1 maint: date and year (link)
  5. "Artwork by Swami Tadatmananda: A Biographical Sketch". Vedanta Press. 2015. Archived from the original on 2018-09-16. Retrieved 2022-03-23.
  6. Vedanta Kesari, Chennai, India: Ramakrishna Math, May 1956, pp. 84–86

బయటి లింకులు

[మార్చు]