Jump to content

శాంతా షెల్కే

వికీపీడియా నుండి

శాంతా జనార్దన్ షెల్కే (शांता जनार्दन शेळके) (12 అక్టోబరు 1922 – 6 జూన్ 2002) మరాఠీ కవయిత్రి, రచయిత్రి. ఆమె ప్రముఖ పాత్రికేయురాలు, విద్యావేత్త కూడా. ఆమె రచనలలో పాటల కూర్పు, కథలు, అనువాదాలు, బాల సాహిత్యం ఉన్నాయి. ఆమె కవితలలో భవగేతాలను (भावगीत) విస్తృతంగా ఉపయోగించింది.[1][2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

శాంతా 1922 అక్టోబరు 12న మహారాష్ట్రలోని ఇందాపూర్ లో జన్మించింది.[3] ఆమె తండ్రి అటవీ అధికారి,[4] ఐదుగురు తోబుట్టువులలో పెద్దది.[5] ఆమె తండ్రి తరచూ బదిలీలు చేయడంతో వారు తరచూ తరలివెళ్లేవారు. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు.[6] పూణేలోని హుజుర్పగ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశింది. పూణేలోని ఎస్పీ కళాశాలలో బీ.ఏ. (మరాఠీ), 1994లో ఎం.ఏ. (సంస్కృతం) పూర్తి చేశింది.[3]

విద్యావేత్తగా

[మార్చు]

ఎం.ఎ. పూర్తి చేసిన తరువాత, ఆమె ఆత్రే నవయుగంలో ఐదు సంవత్సరాలు, తరువాత దైనిక్ మరాఠాలో కొన్ని సంవత్సరాలు ఉప సంపాదకులరాలు పనిచేసింది. నాగపూర్లోని హిస్లాప్ కాలేజ్,[7] ముంబైలోని రామ్ నారాయణ్ రుయా కాలేజ్,[8] మహర్షి దయానంద్ కాలేజ్ లలో [9] మరాఠీ లెక్చరర్ గా బోధించింది. పదవీ విరమణ తర్వాత పూణేలో స్థిరపడ్డారు.[10][11]

రచయిత్రిగా

[మార్చు]

దాదాపు మూడు దశాబ్దాలు పైగా శాంత అనేక నవలలు, చిన్న కథలు, బాలల పుస్తకాలు, సినిమా గీతాలు,[5][12] కవితలు, అనువాద పుస్తకాలు రాశారు.[13][14] ప్రకృతి, జంతువులు, పక్షులు,[15] మానవ జీవితం [3] వంటి వివిధ అంశాలను ఆమె తన సాహిత్యంలో వర్నించింది. 1947లో ప్రచురితమైన వర్ష (वर्षा) ఆమె మొదటి కవితా సంకలనం. [16][17] లూయిసా మే ఆల్కాట్ రచించిన లిటిల్ ఉమెన్ ఆంగ్ల నవలను మరాఠీ భాషలో చౌఘిజానీ (चौघीजणी) పేరుతో అనువదించింది.[18] ధూల్ పతి (धूळपाटी) ఆమె స్వీయచరిత్ర.[10]

ఇతర హోదాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • 1985: డా. అరోరా పురస్కారం [21]
  • 1994: మద్గుల్కర్ పురస్కారం [6]
  • 2001: యశ్వంత్ రావ్ చవాన్ రాష్ట్ర పురస్కారాం: మరాఠీ సాహిత్య-సంస్కృతిక పురస్కారం [22][23]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

16 ఏళ్ల వయసులో ఆమెకు వివాహం జరిగింది. అయితే, ఆమె తన విద్యను, జీవితాన్ని స్వతంత్రంగా కొనసాగించడానికి అతన్ని విడిచిపెట్టింది.[24] 2002 జూన్ 6న పూణేలో ఆమె మరణించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. Joshi, Govind Narayan; Joshi, Govind Narayan (1984). Down melody lane (in ఇంగ్లీష్). Hyderabad: Orient Longman. p. 21. ISBN 978-0-86131-482-9.
  2. Amaresh, Datta, ed. (1949). Encyclopaedia Of Indian Literature Vol.3 (in ఇంగ్లీష్). Sahitya Akademi. p. 610.
  3. 3.0 3.1 3.2 "शांता शेळके (Shanta Shelke)". मराठी विश्वकोश (in మరాఠీ). 2019-08-21. Retrieved 2024-02-17.
  4. "गीतकार, लेखिका शांता शेळके". My Mahanagar (in మరాఠీ). 2021-10-12. Retrieved 2024-02-17.
  5. 5.0 5.1 "शेळके, शांता जनार्दन". महाराष्ट्र नायक (in మరాఠీ). Retrieved 2024-02-17.
  6. 6.0 6.1 6.2 "शांता शेळके...एक प्रतिभा संपन्न व्यक्तिमत्त्व". marathi.webdunia.com (in మరాఠీ). Retrieved 2024-02-17.
  7. "Birth centenary year of Marathi poetess Shanta shelke -Ex Professor in M D College held on 20-09-2022". M D College (in ఇంగ్లీష్). Retrieved 2024-02-18.
  8. "Department of Marathi". www.ruiacollege.edu (in ఇంగ్లీష్). Retrieved 2024-02-18.
  9. "Department of Marathi". hislopcollege.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2024-02-18.
  10. 10.0 10.1 Sahityakalp (2019-10-11). "Marathi Poetess, Novel Writer, Story Writer - Shanta Shelke". Sahityakalp (in మరాఠీ). Retrieved 2024-02-17.
  11. 11.0 11.1 "Shantabai is no more". The Times of India (in ఇంగ్లీష్). 2002-06-07. ISSN 0971-8257. Retrieved 2024-02-17.
  12. Kusumawati, Deshpande; Rajadhyaksha, M. V. (1988-06-01). History of Marathi Literature (in ఇంగ్లీష్). Sahitya Academy. p. 148.{{cite book}}: CS1 maint: date and year (link)
  13. The Marathi Scene: Life as Starting Point of Literature, M.D. Hatkanagalekar, Indian Literature, Vol. 30, No. 6 (122) (November-December, 1987), pp. 135-142, pg. 137, Sahitya Akademi
  14. Hatkanagalekar, M.D. (1987). "The Marathi Scene: Life as Starting Point of Literature". Indian Literature (in ఇంగ్లీష్). 30 (6 (122)): 137. ISSN 0019-5804.
  15. Lata Keshav, Deshmukh (April 2015). "The Literary Prose works of Marathi Women Writers: Features and Awareness". Res. J. Language and Literature Sci. (in ఇంగ్లీష్). 2 (4). International Science Community Association: 4. eISSN 2348-6252.
  16. "Maharashtra State Gazetteers: Language and Literature". p. 169.
  17. Das, Sisir Kumar. A history of Indian literature. 1911 - 1956: Struggle for Freedom: Triumph and Tragedy (in ఇంగ్లీష్). Sahitya Akademi. p. 780. ISBN 81-7901-798-7. {{cite book}}: Check |isbn= value: checksum (help)
  18. Women writing in India. 1: 600 B.C. to the early twentieth century (in ఇంగ్లీష్) (Repr. ed.). New York, NY: Feminist Press. 2002. p. 171. ISBN 978-1-55861-027-9.
  19. Lok Sabha Debates Vol Xiii (part I). p. 118.
  20. Talwalker, Clare (March 2009). "Kindred publics: the modernity of kin fetishism in western India". Postcolonial Studies (in ఇంగ్లీష్). 12 (1): 79. doi:10.1080/13688790802616233. ISSN 1368-8790.
  21. "The 22nd Swami Haridas Sangeet Sammelan, Bombay". Shanmukha. XI (1): 27. January 1986.
  22. "Yashwantrao Chavan Center - Yashwantrao Chavan State Award". Yashwantrao Chavan Center (in ఇంగ్లీష్). 2022-02-19. Retrieved 2024-02-17.
  23. "Shanta Shelke". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-02-17.
  24. Women writing in India. 1: 600 B.C. to the early twentieth century (in ఇంగ్లీష్) (Repr. ed.). New York, NY: Feminist Press. 2002. pp. 170–171. ISBN 978-1-55861-027-9.