Jump to content

శాంతి దేవి

వికీపీడియా నుండి
శాంతి దేవి

లో‍క్‍సభ సభ్యురాలు
పదవీ కాలం
1977  1980
తరువాత బిజేంద్ర పాల్ సింగ్

లో‍క్‍సభ సభ్యురాలు
పదవీ కాలం
1984  1989
ముందు బిజేంద్ర పాల్ సింగ్
తరువాత శ్రీపాల్ సింగ్ యాదవ్
నియోజకవర్గం సంభాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1937-01-30) 1937 జనవరి 30 (వయసు: 89)
జరీఫ్ నగర్, బదౌన్ జిల్లా , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
ఇతర రాజకీయ పార్టీలు

శాంతి దేవి (జననం 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శాంతి దేవి 1962 నుండి 1968 వరకు ఉత్తర ప్రదేశ్ శాసన మండలి సభ్యురాలిగా, 1974లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైంది. ఆమె 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జుగల్ కిషోర్ పై 132864 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

శాంతి దేవి 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ (సెక్యులర్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బిజేంద్ర పాల్ సింగ్ చేతిలో 15767 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి లోక్ దళ్ అభ్యర్థి జుగల్ కిషోర్ పై 41243 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

శాంతి దేవి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి శ్రీపాల్ సింగ్ యాదవ్ చేతిలో 42497 ఓట్ల ఓట్ల తేడాతో ఓడిపోయింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Sambhal Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 27 June 2025. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
  2. "मुलायम सिंह यादव की कर्मभूमि संभल में बेहद रोचक हुआ मुकाबला, इन दो पार्टियों में होगी कांटे की टक्कर". ETV Bharat News. 20 April 2024. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.