శాంతి హిరానంద్
| శాంతి హిరానంద్ | |
|---|---|
శాంతి హిరానంద్ | |
| జననం | 1932 లక్నో, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 2020 ఏప్రిల్ 10 (aged 87) గురుగ్రామ్, భారతదేశం |
| ప్రసిద్ధి | హిందుస్థానీ సంగీతం |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2007) |
శాంతి హిరానంద్ (1932 - 2020 ఏప్రిల్ 10) ఒక భారతీయ గాయని, శాస్త్రీయ సంగీతకారురాలు, రచయిత్రి. ఆమె గజల్ గాయనిగా ప్రసిద్ధి చెందింది. ఆమె ప్రఖ్యాత గజల్ గాయని బేగం అక్తర్ జీవిత చరిత్ర రచన అయిన బేగం అక్తర్: ది స్టోరీ ఆఫ్ మై అమ్మీ అనే పుస్తక రచయిత్రి.
జీవితచరిత్ర
[మార్చు]శాంతి హిరానంద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో సింధీ వ్యాపార కుటుంబంలో జన్మించింది. ఆమె భట్ఖండే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంది.[1][2][3]
ఆమె తొలి సంగీత ప్రదర్శన 1947లో ఆల్ ఇండియా రేడియో లాహోర్ లో జరిగింది, 1947లో భారతదేశ విభజన తరువాత ఆమె కుటుంబం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, రాంపూర్ కు చెందిన ఉస్తాద్ ఐజాజ్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆమె లక్నోలో తన సంగీత శిక్షణను కొనసాగించింది.[4][3] 1952లో, రేడియో స్టేషన్లోని ఒక అధికారి ఆమెకు బేగం అక్తర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని సూచించాడు.[2][3] దీంతో 1957లో, ఆమె బేగం అక్తర్ ఆధ్వర్యంలో ఠుమ్రీ, దాద్రా, గజల్ మొదలైన వాటిలో శిక్షణను ప్రారంభించింది. 1974లో అక్తర్ మరణం వరకు ఈ శిక్షణ కొనసాగింది. ఇది 2005లో ఆమె ప్రచురించిన బేగం అక్తర్: ది స్టోరీ ఆఫ్ మై అమ్మీ పుస్తకంలో వివరించింది.[5][6]
హిందూస్థానీ సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2007లో ఆమెకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[7] ఆమె చేసిన కొన్ని ప్రదర్శనలు సంకలనం చేయబడ్డాయి. మ్యూజిక్ టుడే ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ అనే ఆడియో సీడిగా విడుదల చేయబడ్డాయి.[8] ఆమె లక్నోలో నివసించింది. ఆమె జ్ఞాపకార్థం లక్నోలోని అక్తర్ ఇంటిని మ్యూజియంగా మార్చడంలో బేగం అక్తర్ అడ్మిరర్స్ గ్రూప్ (బిఎఎజి ట్రస్ట్) ప్రయత్నాలతో సంబంధం కలిగి ఉంది.[9] ఆమె తన చివరి దశాబ్దాలలో ఢిల్లీలోని త్రివేణి కళా సంగమంలో సంగీతం నేర్పింది.[3]
మరణం
[మార్చు]శాంతి హిరానంద్ 2020 ఏప్రిల్ 10న భారతదేశంలోని గురుగ్రామ్ లో మరణించింది.[10][11]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Shanti Hiranand on Indian Raga". Indian Raga. 2016. Retrieved 19 January 2016.
- ↑ 2.0 2.1 Kidwai, Saleem (10 April 2020). "With the passing of Shanti Hiranand, the Begum Akhtar era is formally over". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 11 April 2020.
- ↑ 3.0 3.1 3.2 3.3 "Ghazal singer Shanti Hiranand, torchbearer of Begum Akhtar's legacy, passes away". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 11 April 2020. Retrieved 11 April 2020.
- ↑ "Explaining nuances of ghazals the begum Akhtar way". Times of India. 23 September 2012. Retrieved 19 January 2016.
- ↑ "About the book". Viva Books. 2016. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 19 January 2016.
- ↑ Rajan, Anjana (19 March 2014). "Looking into the mirror". The Hindu. Retrieved 19 January 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 3 January 2016.
- ↑ "Expressions of Love". Music Today. 2016. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 19 January 2016.
- ↑ "In memory of Begum Akhtar". Times of India. 16 January 2011. Retrieved 19 January 2016.
- ↑ "Padma Shri singer Shanti Hiranand passes away at 87". 10 April 2020.
- ↑ "Hindustani classical singer and Padma Shri awardee, Shanti Hiranand, passes away at 87". The Economic Times. 11 April 2020. Retrieved 11 April 2020.