శాతవాహన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాతవాహన విశ్వవిద్యాలయం
శాతవాహన విశ్వవిద్యాలయ లోగో
రకంప్రజా విశ్వవిద్యాలయం
స్థాపితం2008 (2008)
ఛాన్సలర్తెలంగాణ గవర్నర్
చిరునామమల్కాపూర్ రోడ్డు, చింతకుంట, కరీంనగర్, తెలంగాణ, 505002, భారతదేశం
18°27′18″N 79°05′43″E / 18.4551224°N 79.09531°E / 18.4551224; 79.09531
కాంపస్పట్టణ
శాతవాహన విశ్వవిద్యాలయం is located in Telangana
శాతవాహన విశ్వవిద్యాలయం
Location in Telangana
శాతవాహన విశ్వవిద్యాలయం is located in India
శాతవాహన విశ్వవిద్యాలయం
శాతవాహన విశ్వవిద్యాలయం (India)

శాతవాహన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో ఉన్న విశ్వవిద్యాలయం. జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అవసరాలను తీర్చడానికి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఏకైక విశ్వవిద్యాలయానికి ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజవంశం పేరు పెట్టారు.[1]

ప్రారంభం[మార్చు]

2008, జూన్ 25న ఇచ్చిన జీవో నెం.89 ప్రకారం ఉన్నత విద్య విభాగం ఆధ్వర్యంలో 2008లో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. తొలిదశలో ఈ విశ్వవిద్యాలయ కార్యకలాపాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్‌ల నుండి కొనసాగాయి. 2008 జూన్ నెలలో అప్‌గ్రేడ్ చేయబడిన ఈ విశ్వవిద్యాలయం 2010లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డిగ్రీ, పిజి కళాశాలలను అనుసంధానం చేయడం ప్రారంభించింది.[2][3]

ప్రాంగణాలు[మార్చు]

ఈ విశ్వవిద్యాలయానికి మూడు కార్యనిర్వాహక ప్రాంగణాలు ఉన్నాయి. ప్రధాన ప్రాంగణంలో పరిపాలన భవనం, విశ్వవిద్యాలయ ఆర్ట్స్, సాంఘిక, వాణిజ్యశాస్త్ర కళాశాల, విశ్వవిద్యాలయ విజ్ఞానశాస్త్ర కళాశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ రెండవ ప్రాంగణం కరీంనగర్ నగరానికి సమీపంలో ఉంది, ఇందులో విశ్వవిద్యాలయ ఔషదశాస్త్ర కళాశాల ఉంది. మూడవది గోదావరిఖని నగరంలో ఉంది, ఇందులో విశ్వవిద్యాలయ పిజి కళాశాల ఉంది. 2012 సెప్టెంబరు నెల నుండి ప్రధాన ప్రాంగణం నుండి విశ్వవిద్యాలయ పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం ప్రాంగణాలల్లో వసతి గృహాలు, గ్రంథాలయాలు కూడా ఉన్నాయి.

కరీంనగర్ నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో అడవిలాంటి ప్రాంతంలో ఈ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణం చుట్టూ అందమైన రాతి గోడ కట్టబడింది. ఇక్కడున్న చెట్లు, జంతువులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి, ఇందులో సుమారు 100 నెమళ్ళు, అనేక కుందేళ్ళు ఉన్నాయి.

కళాశాలలు - కోర్సులు[మార్చు]

శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న 191 కళాశాలలు డిగ్రీ, పిజి, వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో 22 పిజి, 3 వృత్తివిద్యా డిగ్రీ కోర్సులు, ఇతర డిగ్రీ కోర్సులు (బిఎ, బి.కామ్., బి.ఎస్.సి) ఉన్నాయి. బి.ఫార్మసీ, ఎంఏ (అర్థశాస్త్రం, ఇంగ్లీష్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ), ఎంబిఏ, ఎం.కామ్ వంటి కోర్సులను, ఎం.ఎస్సీ. (వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, ఆహారశాస్త్రం & సాంకేతికత, ఇన్స్ట్రుమెంటేషన్ భౌతికశాస్త్రం గణితశాస్త్రం) మొదలైన కోర్సులు కరీంనగర్ లోని విశ్వవిద్యాలయ కళాశాల, గోదావరిఖనిలోని విశ్వవిద్యాలయ పిజి కళాశాల ద్వారా అందించబడతాయి.[2]

ప్రస్తుతం, విశ్వవిద్యాలయంలో విజ్ఞానశాస్త్రం, వాణిజ్యశాస్త్రం & నిర్వాహణశాస్త్రం, న్యాయశాస్త్రం, ఆర్ట్స్, సాంఘీక శాస్త్రం, ఓరియంటల్ లాంగ్వేజెస్ మొదలైన కోర్సులు బోధించే తొమ్మిది అధ్యాపకులు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 160కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. నమోదు చేసుకున్న విద్యార్థులకు విద్యను అందించడానికి విశ్వవిద్యాలయం సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తుంది.[4]

ఇతర వివరాలు[మార్చు]

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న కరీంనగర్ జిల్లాకుచెందిన గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విభాగాలకు చెందిన గ్రామీణ బాలికలకూ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన యువతకు ఉన్నత విద్య అందించడంకోసం ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. 2015 - 2016 విద్యా సంవత్సరంలో మొత్తం నమోదైన విద్యార్థుల్లో సుమారు 93% మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విభాగాలకు చెందినవారు ఉన్నారు.

ఉపకులపతులు[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[5][6]

క్రమసంఖ్య పనిచేసిన కాలం ఉపకులపతి పేరు ఇతర వివరాలు
1 2008 జూలై 28 - 2011 జూలై 27 ప్రొ. మహ్మద్ ఇక్బాల్ ఆలీ మొదటి ఉపకులపతి
2 2011 జూలై 27 - 2012 ఏప్రిల్ 18 ప్రొ. బి.వెంకటరత్నం
3 2012 ఏప్రిల్ 19 - 2015 ఆగస్టు 12 ప్రొ. కె. వీరారెడ్డి
4 2015 ఆగస్టు 13 - 2017 ఆగస్టు 27 ప్రొ. బి. జనార్థన్ రెడ్డి
5 27 ఆగస్టు 2017 - 20 మే 2021 టి. చిరంజీవులు ఇన్‌ఛార్జి ఉపకులపతి
6 21 మే 2021 - 20 మే 2024 సంకసాల మల్లేశం వైస్ చాన్స్‌లర్‌

రిజిస్ట్రార్ లు[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన రిజిస్ట్రార్ ల జాబితా[7]

క్రమసంఖ్య పనిచేసిన కాలం ఉపకులపతి పేరు ఇతర వివరాలు
1 2008 ఆగస్టు 28 - 2009 ఆగస్టు 27 డా. ఎ. వినాయక్ రెడ్డి తొలి రిజిస్ట్రార్
2 2009 ఆగస్టు 31 - 2012 మే 27 ప్రొ. జి. లక్ష్మణ్
3 2012 మే 28 - 2014 మే 27 ప్రొ.బి. భద్రయ్య
4 2014 మే 28 - 2018 ఆగస్టు 31 ప్రొ. ఎం. కోమల్ రెడ్డి
5 2018 సెప్టెంబరు 1 - 2020 ఫిబ్రవరి 15 ప్రొ. యు. ఉమేష్ కుమార్
6 2020 ఫిబ్రవరి - ప్రస్తుతం ప్రొ. టి. భరత్ ఐ/సి

విశ్వవిద్యాలయ చిహ్నం[మార్చు]

జిల్లాలోని త్రవ్వకాల్లో లభించిన వివిధ నాణేలు, పురావస్తు ప్రాముఖ్యత గల వస్తువులపై శాసనాలు కలుపుకొని కరీంనగర్ జిల్లా పురాతన సంస్కృతిని సూచించే విధంగా ఈ చిహ్నం రూపొందించబడింది. శాసనాలు చాలా బౌద్ధ సంస్కృతికి ప్రతిబింబాలు. చిహ్నంలో ఉన్న బొమ్మలు, సంకేతాలు (గుర్తులు) శాతవాహన శకంలోని కొన్ని మతపరమైన అవశేషాలను సూచిస్తున్నాయి. కాలమ్ ఎగువ భాగంలో ఉన్న ఆరు చేతులు బాణం, చేపలు, హుక్స్ లను సూచిస్తాయి. జిల్లాలో తవ్వకాలలో లభించిన నాణెం నుంచి ఇది తీసుకోబడింది. దీనిపై ఉన్న ఒక చుక్క చుట్టూ ఒక చదరపు బ్లాక్‌లో నాలుగు నెలవంకలు ఉన్నాయి. స్తంభాలు గేట్‌వేలోని బీమ్‌తో ఆకులేని చెట్ల రూపకల్పన కలిగిన దీర్ఘచతురస్రాకార బ్లాక్‌తో కలుపబడ్డాయి. తోరణం రెండు ఎద్దుతో అలంకరించబడి ఉంది. తోరణంపైన రెండు నెమళ్ళు అలంకరించబడ్డాయి.[8]

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "telangana students telangana supporters separate telangana state". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-11-04.
  2. 2.0 2.1 Deccan Chronicle, Nation (15 July 2019). "Satavahana University cries for attention". Puli Sharat Kumar. Archived from the original on 7 September 2019. Retrieved 27 August 2020.
  3. "Satavahana University -History". www.satavahana.ac.in. Archived from the original on 2020-09-22. Retrieved 2020-08-27.
  4. "Satavahana University-Profile". www.satavahana.ac.in. Archived from the original on 2020-08-03. Retrieved 2020-08-27.
  5. "Satavahana University-FormerVCs". www.satavahana.ac.in. Archived from the original on 2020-08-03. Retrieved 2020-08-27.
  6. ETV Bharat News. "వీసీ నియామకం జరిగేనా..?" (in ఇంగ్లీష్). Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
  7. "Satavahana University-FormerRegistrars". www.satavahana.ac.in. Archived from the original on 2020-09-22. Retrieved 2020-08-27.
  8. "Satavahana University-Emblem". www.satavahana.ac.in. Archived from the original on 2020-08-03. Retrieved 2020-08-27.