శామ్‌సంగ్ గ్రూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Samsung Group శాంసంగ్ గ్రూప్
రకంPublic (Korean: 삼성그룹)
వ్యవస్థాపకు(లు)Lee Byung-chull లీ బ్యూంగ్-చుల్
సేవా ప్రాంతముప్రపంచమంతా
కీలక వ్యక్తులుLee Kun-hee (Chairman and CEO)
Lee Soo-bin (President, CEO of Samsung Life Insurance)[1]
పరిశ్రమConglomerate
ఉత్పత్తులు
ఆదాయంUS$ 172.5 billion (2009)[2]
మొత్తం ఆదాయముUS$ 13.8 billion (2009)[2]
ఆస్తులుUS$ 294.5 billion (2009)[2]
మొత్తం ఈక్విటీUS$ 112.5 billion (2008)[2]
ఉద్యోగులు276,000 (2009)[2]
అనుబంధ సంస్థలుSamsung Electronics
Samsung Life Insurance
Samsung Heavy Industries
Samsung C&T etc.
వెబ్‌సైటుSamsung.com

శామ్‌సంగ్ గ్రూప్ (కొరియన్: 삼성그룹) అనేది ఒక బహుళజాతి సమ్మేళన సంస్థ, దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న శామ్‌సంగ్ టౌన్‌లో దీని ప్రధాన కార్యాలయం కొలువై ఉంది. ఇది దక్షిణ కొరియాకు సంబంధించిన అతిపెద్ద చియాబోల్ మరియు 2009లో 172.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వార్షిక ఆదాయం సాధించడం ద్వారా ఆదాయం పరంగా[3] ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ సమ్మేళనంగా నిలుస్తోంది.[2] శామ్‌సంగ్ గ్రూప్ తన వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనేక అంతర్జాతీయ అనుబంధ వ్యాపారాలను కలిగి ఉంటోంది, ఇందులో అనేక వ్యాపారాలు శామ్‌సంగ్ బ్రాండ్ పేరుతో సమైక్యంగా ఉన్నాయి. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ అనేది అమ్మకాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక కంపెనీగా ఉంటోంది;[4][5] శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్ అనేది ప్రపంచలోనే రెండవ అతిపెద్ద నౌక నిర్మాణ సంస్థగా నిలుస్తోంది;[6] U.S నిర్మాణ పత్రిక ఇంజనీరింగ్ న్యూస్-రికార్డ్ ద్వారా 225 ప్రపంచ స్థాయి నిర్మాణ సంస్థల సంకలనం జరగగా అందులో శామ్‌సంగ్ ఇంజనీరింగ్ 35వ ర్యాంకును, శామ్‌సంగ్ C&T 72వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి.[7] అలాగే గ్లోబల్ 500 ఇండస్ట్రీస్ పేరుతో 2009లో ఫార్చూన్ కేటాయించిన ర్యాంకుల్లో శామ్‌సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ 14వ ర్యాంకును సాధించింది.[8] దక్షిణ కొరియా మొట్టమొదటి థీమ్ పార్క్ అయిన శామ్‌సంగ్ ఎవర్‌ల్యాండ్ 1976లో యాన్జిన్ ఫాంల్యాండ్ పేరుతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన ఐదవ థీమ్ పార్క్‌గా ఉంటోంది, ఎప్‌కాట్, డిస్నీ MGM మరియు డిస్నీస్ అనిమల్ కింగ్‌డమ్ లాంటి వాటిని పక్కకు నెట్టి మరీ ఎవర్‌ల్యాండ్ ఈ స్థానాన్ని సాధించింది.[9] చెయిల్ వరల్డ్‌వైడ్ సంస్థ శామ్‌సంగ్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థగా పనిచేయడంతో పాటు[10] 2010లో రెవిన్యూ ద్వారా "వరల్డ్స్ టాప్ 50 ఏజెన్సీ కంపెనీస్" మధ్య #19 ర్యాంక్‌ని సాధించింది.[11] అలాగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వ్యాపార మ్యాగజైన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ద్వారా నిర్వహించబడిన వార్షిక రాడార్ సర్వేలో భాగమైన "2009 వరల్డ్స్ బెస్ట్ టాప్ 100 హోటల్స్"లో శామ్‌సంగ్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షిల్లా హోటల్ #19 ర్యాంక్‌ని సాధించింది.[12]

ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌స్ 2007 ఆల్-ఏసియా రీసెర్చ్ టీమ్ సర్వేలో పాల్గొన్న 22 సంస్థలకు బెస్ట్ ఓవరాల్ జెనరలిస్ట్ సేల్స్ ఫోర్స్ సర్వే ర్యాంకులను కేటాయించింది. 2007లో రెవిన్యూ ద్వారా నిర్వహించబడిన "2007 ఆల్-ఏసియా బెస్ట్ ఓవరాల్ జెనరలిస్ట్ సేల్స్ ఫోర్స్ ర్యాంకింగ్స్"లో శామ్‌సంగ్ సెక్యూరిటీస్ (ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్) #14 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.[13]

గార్టెనర్ యొక్క “మార్కెట్ షేర్ అనాలసిస్: టాప్ 10 కన్సెల్టింగ్ ప్రొవాడర్స్ రెవిన్యూ, గ్రోత్ అండ్ మార్కెట్ షేర్, వరల్డ్‌వైడ్ అండ్ రీజినల్ 2009” అనేది సేవల ప్రదాతల కోసం ఉద్దేశించబడిన ఒక పరికరంగా ఉంటోంది. శామ్‌సంగ్ SDS అనేది ఆసియా పసిఫిక్‌లో రెండవస్థానంలో నిలవగా ఈ జాబితాలో IBM అగ్రస్థానంలోనూ అకెంచర్ మూడవస్థానంలోనూ నిలిచాయి.[14]

దక్షిణ కొరియా యొక్క మొత్తం ఎగుమతుల్లో శామ్‌సంగ్ గ్రూప్ ఐదవ వంతు వాటాను కలిగి ఉంటోంది[15]. శామ్‌సంగ్ గ్రూప్ అనేది అనేక స్వదేశీ పరిశ్రమల్లో, ఒంటరి మార్కెట్‌పై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న ఏకైక సంస్థగా ఉంటోంది; శామ్‌సంగ్ ఆదాయం కొన్ని దేశాల GDP కంటే కూడా ఎక్కువగా ఉంటోంది. 2006లో, ఒకవేళ ర్యాంకులు కేటాయించి ఉంటే శామ్‌సంగ్ గ్రూప్ అనేది ప్రపంచంలోనే 35వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేది, అర్జంటీనా ఆర్థిక వ్యవస్థ కంటే కూడా ఇది పెద్దది.[16] దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, రాజకీయాలు, మీడియా మరియు సంస్కృతిలపై ఈ కంపెనీ శక్తివంతమైన ప్రభావాన్న కలిగి ఉంటోంది, మిరాకిల్ ఆన్ ది హాన్ రివర్ వెనుక ఈ కంపెనీ ఒక ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా శామ్‌సంగ్ సాధించిన విజయాన్ని నేడు అనేక వ్యాపారాలు స్ఫూర్తిదాయక ఆదర్శంగా ఉపయోగించుకుంటున్నాయి[ఉల్లేఖన అవసరం]. 2010లో మీడియా గ్రూప్‌ని శామ్‌సంగ్ కొనుగోలు చేసింది.

చరిత్ర[మార్చు]

1930లో డేగులో నిర్మితమైన శామ్‌సంగ్ శాంఘాయ్ యొక్క భవనం

1938లో,[17] యుఐరియాంగ్ దేశానికి చెందిన అతిపెద్ద భూస్వామ్య కుటుంబానికి చెందిన లీ బైయుంగ్-చుల్ (1910–1987) దగ్గర్లోని డేగు నగరానికి చేరుకుని శామ్‌సంగ్ శాంఘాయ్ (삼성상회) పేరుతో ఒక చిన్నపాటి ట్రెడింగ్ కంపెనీని స్థాపించాడు, అప్పట్లో మొత్తం నలభై మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ సు-డాంగ్ (ప్రస్తుతం ఇంగో-డాంగ్)లో కొలువుదీరింది. ప్రారంభంలో ఈ సంస్థ నగరంలోనూ చుట్టుపక్కల కిరాణా ఉత్పత్తులను సరఫరా చేయడంతో పాటు సొంతంగా నూడిల్స్‌ని ఉత్పత్తి చేసేది. కొంతకాలానికి ఈ సంస్థ బాగా అభివృద్ధి సాధించడంతో 1947లో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని లీ సియోల్‌కు తరలించారు. అయితే, కొరియన్ యుద్ధం సంభవించడంతో లీ సియోల్‌ని విడిచిపెట్టాల్సి వచ్చింది, దీంతో బుసన్ చేరుకున్న ఆయన చెయిల్ జెడాంగ్ పేరుతో ఒక పంచదార శుద్ధి కర్మాగారాన్ని స్థాపించారు. యుద్ధం తర్వాత, 1954లో, లీ చెయిల్ మొజిక్‌ను స్థాపించడంతో పాటు డేగూలోని చిమ్‌సన్-డాంగ్‌లో ప్లాంట్‌ని నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఉన్ని మిల్లుగా గుర్తింపు సాధించడంతో పాటు ప్రధాన కంపెనీగా ఎదగడంపై ఆ కంపెనీ దృష్టి సారించింది.

కాలక్రమంలో శామ్‌సంగ్ అనేక ప్రాంతాల్లోకి విస్తరించడంతో పాటు శామ్‌సంగ్‌ను అన్ని రకాల పరిశ్రమల మధ్య ప్రధాన సంస్థగా స్థాపించేందుకు లీ కృషి చేశారు, అందులో భాగంగా ఆయన శా‌మ్‌సంగ్‌ను బీమా, సెక్యూరిటీలు, మరియు రిటైల్ లాంటి రంగాల్లోకి తీసుకువెళ్లారు. పారిశ్రామీకరణకు లీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పలు సంస్థలను కలిపి అతిపెద్ద స్వదేశీ సమ్మేళనాన్ని ఏర్పరచే దిశగా ఆర్థిక అభివృద్ధి వ్యూహంపై అతను దృష్టి పెట్టారు, అందులో భాగంగా తన సంస్థలను పోటీ నుంచి రక్షించడంతోపాటు ఆర్థికంగా వాటికి సహాయసహకారాలు అందించారు. మరోవైపు విదేశీ పోటీనుంచి శామ్‌సంగ్‌ను రక్షించడం కోసం దక్షిణ కొరియాలో వినియోగ ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమ్మకుండా అనేక విదేశీ కంపెనీలపై ఆయన నిషేధం విధించారు.[ఉల్లేఖన అవసరం].

1960ల చివర్లో, శామ్‌సంగ్ గ్రూప్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రారంభించింది. ఇందులో భాగంగా అది శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ కో., శామ్‌సంగ్ ఎలక్ట్రో-మెకానిక్స్ కో., శామ్‌సంగ్ కో., మరియు శామ్‌సంగ్ సెమీకండక్టర్ & టెలీకమ్యూనికేషన్స్ కో., లాంటి అనేక ఎలక్ట్రానిక్-సంబంధిత విభాగాలను ఏర్పాటు చేయడంతోపాటు సువాన్‌లో ఫెసిలిటీని స్థాపించింది. ఇక్కడి నుంచి తొలి ఉత్పత్తి రూపంలో బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ సెట్‌ను సంస్థ ఉత్పత్తి చేసింది. 1980లో, గుమిలోని Hanguk Jeonja Tongsin సంస్థను శామ్‌సంగ్ సొంతం చేసుకోవడంతో పాటు టెలీకమ్యూనికేషన్స్ డివైస్‌ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రారంభ ఉత్పత్తుల రూపంలో సంస్థ స్విచ్‌బోర్డులను ఉత్పత్తి చేసింది. మరోవైపు ఇది టెలిఫోన్ మరియు ఫ్యాక్స్ తయారీ ఉత్పత్తుల్లోకి అభివృద్ధి చెందడంతో పాటు శామ్‌సంగ్ మొబైల్ ఫోన్ తయారీ కేంద్రంగా రూపుదాల్చింది. సదరు సంస్థ నేటి వరకు 800 మిలియన్ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసింది.[18] ఈ క్రమంలో 1980ల్లో ఈ కంపెనీ విభాగాలన్నీ కలిసి శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో., లిమిటెడ్‌ అనే ఒకే గొడుగు కిందకు చేరాయి.

న్యూయార్క్ పట్టణంలోని టైమ్ వార్నర్ సెంటర్ లోపలి భాగంలో కనిపిస్తున్న శామ్‌సంగ్ లోగో

1980ల చివర్లోనూ మరియు 1990ల ప్రారంభంలోనూ, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలపై శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ పెద్దమొత్తంలో ఖర్చు చేసింది, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో కంపెనీని ముందు వరుసలో నిలబెట్టే దిశగా కీలకమైన విభాగాల్లో పెట్టుబడులను పెట్టడం జరిగింది. 1982లో పోర్చుగల్ వేదికగా ఇది టెలివిజన్ విడిభాగాల కూర్పు ప్లాంట్‌ను స్థాపించింది; 1984లో, న్యూయార్క్‌లోనూ మరో ప్లాంట్‌ని స్థాపించింది; 1985లో, టోక్యోలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది; 1987లో, ఇంగ్లాండ్‌లో ఒక ఫెసిలిటీని స్థాపించింది; అలాగే మరో ఫెసిలిటీని ఆస్టియన్లో 1996లో స్థాపించింది. మొత్తంగా, ఆస్టియన్ ప్రదేశంలో శామ్‌సంగ్ 5.6 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టింది – టెక్సాస్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడి పెట్టడం ద్వారానూ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద ఏకైక విదేశీ పెట్టుబడులులో ఒకదాని ద్వారానూ సంస్థ ఈ ఘనతను సాధించింది. కొత్త పెట్టుబడి ద్వారా ఆస్టియన్‌లో శామ్‌సంగ్ మొత్తం పెట్టుబడి విలువ 9 బిలియన్ అమెరికా డాలర్లను చేరుతుంది.[19]

మరోవైపు 1990ల్లో అంతర్జాతీయ కార్పోరేషన్‌గా ఎదిగేందుకు శామ్‌సంగ్ ప్రయత్నాలు ప్రారంభించింది. మలేషియాలోని రెండు పెట్రోనాస్ టవర్‌లలో ఒకదాన్ని, తైవాన్‌లో తైపీ 101 మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లో బుర్జ్ ఖలీఫా నిర్మించేందుకుగానూ శామ్‌సంగ్ కన్‌స్ట్రక్షన్ శాఖ అవకాశాన్ని దక్కించుకుంది.[20] 1993లో, శామ్‌సంగ్ గ్రూప్ యొక్క పది అనుబంధ గ్రూపులను లీ కున్-హీ అమ్మివేయడంతో కంపెనీ పరిమాణం తగ్గింది, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, మరియు కెమికల్స్ లాంటి మూడు పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించే దిశగా ఇతర అంశాలను ఇందులో పొందుపర్చడం జరిగింది. 1996లో, సన్గ్‌క్యుయుంక్వాన్ యూనివర్సిటీ ఫౌండేషన్‌ను శామ్‌సంగ్ గ్రూపు తిరిగి చేజిక్కించుకుంది.

ఇతర ప్రధాన కొరియన్ కంపెనీలతో పోలిస్తే, 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం నుంచి శామ్‌సంగ్ క్షేమంగా బయటపడింది. అయినప్పటికీ, ఈ సంక్షోభం కారణంగా శామ్‌సంగ్ మోటార్‌ను గుర్తించదగిన స్థాయి నష్టానికి రీనల్ట్‌కు విక్రయించడం జరిగింది. దీంతో 2010 నాటికి రీనల్ట్ శామ్‌సంగ్ విషయంలో 80.1 శాతం వాటా రీనల్ట్‌కు సొంతమై ఉండగా, కేవలం 19.9 శాతం వాటా మాత్రమే శామ్‌సంగ్ ఖాతాలో నిలిచింది. అదనంగా, 1980ల మొదలుకుని 1990ల వరకు శామ్‌సంగ్, ఎయిర్‌క్రాఫ్ట్‌ల శ్రేణి తయారీని కూడా చేపట్టింది. మరోవైపు శామ్‌సంగ్ ఎయిరోస్పేస్, దేవూ హెవీ ఇండస్ట్రీస్, మరియు హూందాయ్ స్పేస్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ లాంటి మూడు ప్రధాన స్వదేశీ ఎయిరోస్పేస్ విభాగాల మధ్య కలయిక ద్వారా ఇది 1999లో కొరియా ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ (KAI)గా స్థాపితమైంది. అయినప్పటికీ, శామ్‌సంగ్ మాత్రం నేటికీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లను తయారు చేస్తోంది. అలాగే[ఉల్లేఖన అవసరం] శామ్‌సంగ్ టెక్‌విన్ అనేది రోల్స్-రాయిస్ ఎయిర్‌బస్ A380కి సంబంధించిన టిరెంట్ 900 ఇంజన్ యొక్క కంబూస్టర్ మాడ్యూల్‌ను అందించే ఏకైక సరఫరాదారుగా నిలుస్తోంది.[21] కొరియా యొక్క శామ్‌సంగ్ టెక్‌విన్ అనేది బోయింగ్ యొక్క 787 డ్రీమ్‌లైనర్ GEnx ఇంజన్ ప్రోగ్రాంలో రెవిన్యూను పంచుకున్న పోటీదారులుగా నిలిచాయి.[22]

సియోల్‌లోని శామ్‌సంగ్ టౌన్‌ వద్ద శామ్‌సంగ్ గ్రూప్ ప్రధాన కార్యాలయం.

ఇక 1992లో మెమొరీ చిప్స్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా శామ్‌సంగ్ నిలిచింది, మరోవైపు ఇంటెల్ తర్వాత (వరల్డ్‌వైడ్ టాప్ 20 సెమీకండక్టర్ మార్కెట్ షేర్ ఇయర్ బై ఇయర్ చూడండి) ప్రపంచ రెండవ అతిపెద్ద చిప్ తయారీదారుగా శామ్‌సంగ్ నిలుస్తోంది.[23] 1995లో, ఈ సంస్థ తొలిసారిగా తన లిక్విడ్-క్రిస్టల్ డిస్‌ప్లే తెరను రూపొందించింది. అటుపై పదేళ్ల తర్వాత, లిక్విడ్-క్రిస్టల్ డిస్‌ప్లే ప్యానెళ్ల తయారీకి సంబంధించి ప్రపంచ అతిపెద్ద ఉత్పత్తిదారుగా శామ్‌సంగ్ ఖ్యాతని ఆర్జించింది. అతిపెద్ద పరిమాణంలోని TFT-LCDల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాహసించని సోనీ సంస్థ, ఈ విషయంలో సహకారం కోసం శామ్‌సంగ్‌ను సంప్రదించింది, చివరకు 2006లో ఇరు ఉత్పత్తుదారులకు అవసరమైన LCD ప్యానెళ్ల కోసం S-LCD పేరుతో శామ్‌సంగ్ మరియు సోనీలు కలిసి ఒక సంయుక్త పరిశ్రమను స్థాపించాయి. S-LCDకి సంబంధించి శామ్‌సంగ్ (50% ప్లస్ 1 వాటా) మరియు సోనీ (50% మైనస్ 1 వాటా)లు వాటాలు పంచుకోవడంతో పాటు దక్షిణ కొరియాలోని టాంగ్‌జుంగ్ వేదికగా తమ కర్మాగారాలను మరియు ఫెసిలిటీలను నడుపుతున్నాయి.

2004 మరియు 2005లో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌గా సోనీని అధిగమించిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా #19 ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.[24] ఉత్తర అమెరికా మరియు పాశ్చాత్య యూరోప్‌లలో ప్రధాన మార్కెట్ వాటాను చేజిక్కింటుకోవడం ద్వారా, నోకియా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లను తయారు చేస్తున్న సంస్థగా శామ్‌సంగ్ పేరు గడించింది.[25]

SCTV మరియు ఇండోసైర్ అనేవి శామ్‌సంగ్ యాజమాన్యంలో భాగమైన సూర్య చిత్ర మీడియా యొక్క అనుబంధ సంస్థలుగా ఉంటున్నాయి.

గుప్త ఆదాయం[మార్చు]

శామ్‌సంగ్ మొత్తం ఆదాయం గురించి తెలియాలంటే, కంపెనీ నుంచి వచ్చే ఆదాయం మరియు అన్ని రకాల అనుబంధ సంస్థల నుంచి వచ్చే ఆదాయాలను లెక్కగట్టి తెలుసుకోవాల్సిందే. ఆర్థిక ఫలితాలు మరియు మాతృ కంపెనీల ఆదాయాల ఆధారంగా లెక్కించిన ప్రకారం, FY 2009లో, శామ్‌సంగ్ గ్రూప్ మొత్తంగా 220 ట్రిలియన్ KRW (172.5 బిలియన్ అమెరికా డాలర్లు) ఆదాయాన్ని సాధించింది. మరోవైపు ఇందులో విదేశీ అనుబంధ సంస్థల నుంచి వచ్చిన ఆదాయాలు లెక్కించబడలేదు, కాబట్టి ఈ సంస్థలకు సంబంధించిన నిజమైన ఆదాయాలు ఎంత అనే విషయం ఎవరికీ తెలియదు.[26]

శామ్‌సంగ్ గ్రూప్ విభజనలు[మార్చు]

 • మొదటి విభజన : 1966

1948లో, చో హాంగ్-జై (హైయోసంగ్ గ్రూప్ యొక్క స్థాపకుడు), శామ్‌సంగ్ గ్రూప్ స్థాపకుడైన లీ బైయుంగ్ చుల్‌తో కలిసి కొత్త కంపెనీ అయిన శామ్‌సంగ్ ముల్సాన్ గోంగ్సా (삼성물산공사), లేదా శామ్‌సంగ్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే సంస్థలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టారు. ఆవిధంగా ప్రారంభమైన ఆసంస్థ నేడు శామ్‌సంగ్ C&T కార్పొరేషన్‌గా అవతరించింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత, ఇద్దరి మధ్య యాజమాన్యపరమైన కొన్ని విభేదాలు తలెత్తడంతో చో మరియు లీలు విడిపోయారు. ఈ నేపథ్యంలో 30% వరకు గ్రూపు వాటా కావాలని ఆయన కోరారు. ఒప్పందాలు ఖరారు కావడంతో, శామ్‌సంగ్ గ్రూప్ అనేది శామ్‌సంగ్ గ్రూప్ మరియు హైయోసంగ్ గ్రూప్, హాన్‌కుక్ టైర్ ...మొదలగు సంస్థలుగా విడిపోయింది.[27][28]

 • రెండవ విభజన : 1990లు
Pan-samsung2-error corrections.png

స్థాపకుడైన లీ మరణం అనంతరం, శామ్‌సంగ్ గ్రూప్ అనేది శామ్‌సంగ్ గ్రూప్ మరియు షిన్‌సెగే గ్రూప్, CJ గ్రూప్ మరియు హన్సోల్ గ్రూప్ అనే మూడు అనుబంధ సంస్థలుగా విడిపోయింది.[29] షిన్‌సేగ్ (డిస్కౌంట్ స్టోర్, డిపార్ట్‌మెంట్ స్టోర్) అనేది వాస్తవానికి శామ్‌సంగ్ గ్రూప్‌లో భాగంగా ఉండేది, అయితే, 1990ల్లో ఇది CJ గ్రూప్‌ (ఫుడ్/కెమికల్స్/ఎంటర్‌టైన్‌మెంట్/లాగిస్టిక్స్) మరియు హ్యాన్సోల్ గ్రూప్ (పేపర్/టెలికాం)లతో కలిసి ప్రత్యేకంగా అవతరించింది. బ్రాండ్-న్యూ షిన్‌సేగ్ సెంటుమ్‌సిటీ డిపార్ట్‌మెంట్ స్టోర్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తింపు సాధించింది.[30] నేటి ఈ ప్రత్యేకమైన గ్రూపులు స్వతంత్రంగా ఉండడంతో పాటు శామ్‌సంగ్ గ్రూప్‌లో భాగంగా గానీ లేదా సంబంధం కలిగినవిగా గానీ ఉండడం లేదు.[31] "ఏమాత్రం అర్థంలేని కొన్నింటిని విశ్వసించే వ్యాపార ప్రపంచం నియంత్రిస్తున్న చట్టాలను ప్రజలు మర్చిపోయారు" అని హ్యాన్సోల్ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు, అంతేకాకుండా "1991లో శామ్‌సంగ్ గ్రూప్ నుంచి హ్యాన్సోల్ విడిపోయిన సమయంలోనే, శామ్‌సంగ్ అనుబంధ సంస్థలతో అన్ని చెల్లింపుల గ్యారెంటీలు మరియు షేర్-హోల్డింగ్ బంధాలను తెంచుకోవడం జరిగింది" అని కూడా ఆ ప్రతినిధి తెలిపారు. "శామ్‌సంగ్ గ్రూప్ నుంచి వేరుపడిన సమయం నుంచే హ్యాన్సోల్, షిన్‌సెగ్, మరియు CJలు స్వతంత్ర నిర్వహణ కిందకు చేరాయి" అని హ్యాన్సోల్ గ్రూప్ సంబంధింత వనరు ఒకటి నొక్కి చెప్పింది. "శామ్‌సంగ్ గ్రూప్‌తో కలిసి షిన్‌సెగ్ ఎలాంటి చెల్లింపు గ్యారెంటీలను కలిగి లేదు" అని షిన్‌సెగ్ డిపార్ట్‌మెంట్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.[31]

శామ్‌సంగ్ ద్వారా ఆర్జనలు[మార్చు]

1990 దశకం చివర్లో విజయవంతం కాని కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా శరవేగంగా విస్తరించేందుకు శామ్‌సంగ్ నిర్ణయించింది. అయితే, ఆర్గానిక్ వృద్ధిపై దృష్టి సారించిన శామ్‌సంగ్, గత 10 సంవత్సరాల కాలంలో భారీస్థాయి ఆర్జనలేవీ చేపట్టలేదు.

 • రోలెక్స్-స్విస్ వాచ్ పోరు

జర్మన్ కెమెరా తయారీ సంస్థ అయిన రోలేయ్‌ని 1995లో శామ్‌సంగ్ టెక్‌విన్ సొంతం చేసుకుంది. 100% స్విస్-తయారీ వాచీలకు సంబంధించిన న్యూ లైన్ యొక్క క్రిస్టల్స్ విషయంలో శామ్‌సంగ్ (రోలేయ్) తన ఆప్టిక్ నైపుణ్యాలను ఉపయోగించింది, ఈ రకమైన వాచీలను స్విట్జర్లాండ్‌లోని బాస్సెక్వార్ట్‌లో ఉన్న నోయువెల్ పిక్వెర్జ్ S.A. వేదికగా వాచీతయారీదారు బృందం తయారు చేసేది. రొలేయ్‌ పేరు తన పేరుకు సమీపంగా ఉండడం వల్ల తమ అమ్మకాలకు ఏదైనా భంగం వాటిల్లే అవకాశముందని భావించిన రోలెక్స్ సంస్థతో ప్రత్యక్ష పోరు సాగించాలని నిర్ణయించింది. మరోవైపు ఈ రకమై భయం ఎక్కువ కావడంతో జెనీవా సంస్థ అయిన రోలెక్స్ తన ప్రత్యర్థిని ముఖాముఖి ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. స్థిరమైన బ్రాండ్ ఒకటి భయపెడుతన్న నేపథ్యంలో స్విస్ వాచ్ పరిశ్రమ యొక్క నిశ్చయత ప్రదర్శనకు చిహ్నమైన రోలెక్స్ స్వీయరక్షణకు సిద్ధమైంది. అంతేకాకుండా రోలేయ్‌తో జరుగుతున్న ప్రత్యక్ష పోరును మొత్తం స్విస్ వాచ్ పరిశ్రమకు సంబంధించిన అంశంగా రోలెక్స్ పరిగణించింది. మొత్తంమీద అన్ని రకాల ప్రయత్నాలతో ప్రత్యర్థి కంపెనీపై పోరుకు సిద్ధపడిన రోలెక్స్ చివరకు జర్మన్ మార్కెట్ నుంచి రోలేయ్‌ని బయటకు గెంటడంలో విజయం సాధించింది. జర్మన్ భూభాగంపై రోలేయ్ వాచ్‌లకు సంబంధించిన ప్రచారాన్ని, అమ్మకాలను బహిష్కరిస్తూ 1995 మార్చి 11న, కొలోజెన్ డిస్ట్రిక్ కోర్ట్ తీర్పునిచ్చింది.[32][33]

 • ఫోకెర్-డచ్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు

శామ్‌సంగ్‌తో కలిసి కన్సార్టియంగా ఏర్పడేందుకు ఇతర ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు తిరస్కరించడంతో డచ్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు ఫోకెర్‌ను సొంతం చేసుకోవాలనుకున్న శామ్‌సంగ్ ఆశలు ఫలించలేదు. శామ్‌సంగ్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో తాము భాగస్వామ్యం కాబోవడం లేదని ప్రతిపాదిత భాగస్వాములైన --హూందాయ్,హన్జిన్ మరియు దేవూలు దక్షిణ కొరియా ప్రభుత్వానికి తెలిపాయి.[34]

 • AST పరిశోధన
AST (1994)ని కొనుగోలు చేయడం ద్వారా కొన్నేళ్ల క్రితం ఉత్తర అమెరికాలోకి ప్రవేశించాలని శామ్‌సంగ్ భావించినప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

నైపుణ్యం కలిగిన పరిశోధకులు పెద్దమొత్తంలో బయటకు వెళ్లిపోవడం, నష్టాలు వెంటాడడం లాంటి కారణాల వల్ల కాలిఫోర్నియాలో ప్రారంభించిన కంప్యూటర్ తయారీ సంస్థను శామ్‌సంగ్ మూసేయాల్సి వచ్చింది. .[35]

 • FUBU వస్త్రాలు మరియు దుస్తులు - విజయం యొక్క అరుదైన విజయం

1992లో, టోపీల సేకరణతో డైమండ్ జాన్ ఈ కంపెనీని ప్రారంభించారు, న్యూయార్క్ సిటీలోని క్యూన్స్ ఏరియాలోని ఇంటినుంచి ఆ సంస్థ తన ఉత్పత్తులను సిద్ధం చేసేది. కంపెనీకి అవసరమైన నిధుల కోసం జాన్ తన ఇంటిని 100,000 డాలర్లకు తనఖా పెట్టారు. ప్రారంభంలో తన స్నేహితులైన అలెగ్జాండర్ మార్టిన్, కార్ల్ బ్రౌన్, మరియు కెయిత్ పెర్రిన్‌లతో కలిసి ఇంటిలో సగభాగాన్ని FUBU ప్యాక్టరీగా మార్చిన ఆయన మిగిలిన సగాన్ని మాత్రం నివాస అవసరాల కోసం అలాగే ఉంచారు. FUBU యొక్క విస్తరణలో భాగంగా కొరియన్ కంపెనీ అయిన శామ్‌సంగ్ 1995లో FUBUలో పెట్టుబడులు పెట్టింది.[36]

 • లెహ్‌మ్యాన్ బ్రదర్స్ హోల్డింగ్స్ ఏసియన్ ఆపరేటర్స్

పూర్తిస్థాయిలో బ్రోకరేజ్‌లను కలిగిన శామ్‌సంగ్ సెక్యురిటీస్ లెహ్‌మ్యాన్ బ్రదర్స్ హోల్డింగ్స్ కోసం ఎదురు చూసింది. అయితే, ఈ విషయంలో మరింత ముందడుగు వేసిన నొమురా హోల్డింగ్స్, లెహ్‌మ్యాన్ బ్రదర్స్ హోల్డింగ్స్ ఏసియన్ ఆపరేటర్స్‌ బిడ్ గెల్చుకునే దిశగా శామ్‌సంగ్ సెక్యూరిటీస్, స్టాండర్డ్ ఛార్టెర్డ్, మరియు బెర్కిలీలను అధిగమించింది.[37] దురదృష్టవశాత్తూ, కొన్ని నెలల తర్వాత శామ్‌సంగ్ సెక్యూరిటీస్ కో., లిమిటెడ్. మరియు సిటీ ఆఫ్ లండన్‌లోని N M రోథ్స్‌ఛైల్డ్ & సన్స్ (సాధారణంగా రోథ్స్‌ఛైల్డ్‌ గా సుపరిచితం) లు కలిసి పెట్టుబడి బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రవేశించే దిశగా వ్యూహ్యాత్మక కూటమిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు పార్టీలు సంయుక్తంగా క్రాస్ బార్డర్ మెర్జెర్స్ మరియు ఆర్జన ఒప్పందాలపై పనిచేసేందుకు సిద్ధమయ్యాయి.[38]

ఉత్పత్తులు, వినియోగదారులు మరియు సంస్థాగత నిర్మాణం[మార్చు]

గ్రూప్ విభాగాలు[మార్చు]

2009లో ఫిన్లాండ్‌లోని మూరామేలో ఫోటో తీయబడిన Veli Hyyryläinen Oy పేరు కలిగిన శామ్‌సంగ్ SE170 రోడ్-రైల్ ఎక్స్‌కావేటర్
 • ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు
 • ఆర్థిక సేవలు
 • రసాయన పరిశ్రమలు
 • యంత్రాలు & భారీ పరిశ్రమలు
 • ఇంజనీరింగ్ & నిర్మాణం
 • రిటైల్ & ఎంటర్‌టైన్‌మెంట్
 • దుస్తులు & ప్రకటనలు
 • విద్య & వైద్య సేవలు
 • వాణిజ్యం & పరిశోధన అభివృద్ధి
 • ఆహారపదార్థాల సరఫరా & సెక్యురిటీ సేవలు

ప్రసిద్ధ వినియోగదారులు[మార్చు]

 • రాయల్ డచ్ షెల్

వచ్చే 15 సంవత్సరాల పాటు రాయల్ డచ్ షెల్‌కు 50 బిలియన్ US డాలర్ల విలువైన ద్రవీకృత సహజ వాయువు (LNG) నిల్వ సౌకర్యాలను కల్పించడం ద్వారా అటువంటి ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న ఏకైక సేవల సరఫరాదారుగా శామ్‌సంగ్ భారీ పరిశ్రమలు అవతరించనుంది.[39] [40]

 • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం

శామ్‌సంగ్, కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్ప్ మరియు హూందాయ్ సంస్థల కూడిన దక్షిణ కొరియా సంస్థల కన్సార్టియం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అణు విద్యుత్ కేంద్రాలును నిర్మించడం కోసం 40 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.[41]

 • కెనడియన్ ప్రావియన్స్ ఆఫ్ ఒన్టారియో ప్రభుత్వం

ఒన్టారియో యొక్క కెనడియన్ ప్రావియన్స్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందంపై సంతకాలు చేసింది, 2,500MW పవన మరియు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని నిర్మించే దిశగా 6.6 బిలియన్ డాలర్లకు ఈ ఒప్పందం ఖరారైంది. శామ్‌సంగ్ మరియు కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ కన్సార్టియం ఒప్పందంలో భాగంగా, ఈ ప్రావియన్స్‌లో 2,000MW- సామర్థ్యం కలిగిన కొత్త పవన విద్యుత్ సంస్థలు మరియు 500MW సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ కేంద్రాలతో పాటు తయారీ సరఫరా గొలుసును సైతం నిర్మించనున్నారు.[42]

శామ్‌సంగ్ యొక్క కీలక క్లెయింట్లు (Q1 2010)[43]
ర్యాంక్/కంపెనీ భాగ వర్ణన కొనుగోలు (యూనిట్: ట్రిలియన్ KRW) మొత్తం అమ్మకాల శాతం
1 సోనీ DRAM, NAND ఫ్లాష్, LCD ప్యానెల్, మొదలుగునవి... 1.28 3.7
2 ఆపిల్ ఇంక్ AP (మొబైల్ ప్రాసెసర్),DRAM, NAND ఫ్లాష్, మొదలుగునవి... 0.9 2,6
3 డెల్ DRAM, ఫ్లాట్-ప్యానెల్స్, లిథియం-అయాన్ బ్యాటరీ, మొదలుగునవి... 0.87 2.5
4 HP DRAM, ఫ్లాట్-ప్యానెల్స్, లిథియం-ఆయాన్ బ్యాటరీ, మొదలుగునవి... 0.76 2.2
5 వెరిజోన్ కమ్యూనికేషన్స్ హ్యాండ్‌సెట్స్, మొదలుగునవి... 0.5 1.3
6 AT&T హ్యాండ్‌సెట్స్, మొదలుగునవి... 0.5 1.3

శామ్‌సంగ్ మెడికల్ సెంటర్[మార్చు]

శామ్‌సంగ్ మెడికల్ సెంటర్ అనేది ఒక లాభాపేక్ష రహిత సంస్థ. ఈ మెడికల్ సెంటర్ కోసం ప్రతి సంవత్సరం శామ్‌సంగ్ గ్రూప్ దాదాపు 100 మిలియన్ డాలర్లను "వితరణ" రూపంలో పంపుతుంది.[44] శామ్‌సంగ్ మెడికల్ సెంటర్ (కొరియన్: 삼성의료원) ద్వారా శామ్‌సంగ్ సియోల్ హాస్పిటల్ (కొరియన్: 삼성서울병원), కాంగ్‌బుక్ శామ్‌సంగ్ హాస్పిటల్ (కొరియన్: 강북삼성병원), శామ్‌సంగ్ ఛాంగ్‌వాన్ హాస్పిటల్ (కొరియన్: 삼성창원병원), శామ్‌సంగ్ క్యాన్సర్ సెంటర్ (కొరియన్:삼성암센터) మరియు శామ్‌సంగ్ లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ (కొరియన్: 삼성생명과학연구소) లాంటి సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. సియోల్‌లోని శామ్‌సంగ్ క్యాన్సర్ సెంటర్ అనేది ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ కేంద్రంగా ఉంటోంది, కొరియాకు చెందిన నేషనల్ క్యాన్సర్ సెంటర్ మరియు జపాన్ నేషనల్ క్యాన్సర్ సెంటర్ కంటే కూడా ఇది చాలా పెద్దది.[45] కండక్ట్ జాయింట్ రీసెర్చ్ టు ఐడెంటిపై జీనోమిక్ మెకానిజమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లినికల్ ఔట్‌కమ్స్ కోసం శామ్‌సంగ్ మెడికల్ సెంటర్ మరియు పిఫిజర్‌లు పనిచేస్తున్నాయి.[46] SMC అనేది పూర్తిస్థాయి AAHRPP (అసోసియేషన్ ఫర్ ది అక్రిడియేషన్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్)ను స్వీకరించేందుకు ఏర్పడిన మొట్టమొదటి US యేతర సంస్థగా ఉంటోంది.[47]

శబ్ద వ్యుత్పత్తి మరియు లోగో చరిత్ర[మార్చు]

కొరియన్ హంజా పదమైన శామ్‌సంగ్ (三|星) అంటే "త్రీస్టార్" లేదా "మూడు నక్షత్రాలు" అని అర్థం. "మూడు" అనే పదం "పెద్ద, సంవృద్ధమైన మరియు శక్తివంతమైన" అనే అర్థానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, "నక్షత్రాలు" అనగా శాశ్వతము అని అర్థం. (శామ్‌సంగ్ గ్రూప్ స్ధాపకుడి ద్వారా ఈ అర్థం చెప్పబడింది).[48]

వివాదం[మార్చు]

అమెరికన్ కంప్యూటర్ మార్కెట్లలో అమ్మకాలు జరిపే దిశగా DRAM చిప్స్ ధరలను నిర్ణయించేందుకు 1999 మొదలుకుని 2002వరకు హైనిక్స్ సెమీకండక్టర్, ఇన్ఫీనియన్ టెక్నాలజీస్, ఎల్పిడా మెమరీ (హిటాచీ మరియు NEC) మరియు మైక్రో టెక్నాలజీలతో కలిసి శామ్‌సంగ్ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడింది. దీనికి సంబంధించి 2005లో నేరాన్నిఅంగీకరించిన శామ్‌సంగ్, 300 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది, తద్వారా US చరిత్రలో రెండవ అతిపెద్ద విశ్వాస వ్యతిరేక జరిమానాగా ఇది నిలించింది.[49][50][51][52]

ఇదేరకమైన DRAM సంఘటనలో భాగంగా మే 2010లో EU విశ్వాస వ్యతిరేక నిఘా సంస్థ శామ్‌సంగ్‌పై €145.73 మిలియన్లను జరిమానాగా విధించింది.[53]

సంస్థలన్నీ కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాయనే ఆరోపణలో భాగంగా డిసెంబర్ 2010లో శామ్‌సంగ్‌తో సహా ఆరు LCD ప్యానెల్ ఉత్పత్తిదారు సంస్థలకు యూరోపియన్ కమిషన్ €648.925 మిలియన్లను జరిమానాగా విధించింది. అయితే, ఈ విషయంలో మాత్రం శామ్‌సంగ్ పూర్తిస్థాయి జరిమానా తగ్గింపును సాధించింది.[54]

వీటిని కూడా చూడండి[మార్చు]

గమనికలు మరియు సూచనలు[మార్చు]

 1. Kelly Olsen (2008-04-22). "Samsung chairman resigns over scandal". Associated Press via Google News. మూలం నుండి 2008-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-22. Cite news requires |newspaper= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Samsung Profile 2010". Samsung.com. 2008-12-31. Retrieved 2010-11-11. Cite web requires |website= (help)
 3. రెవెన్యూ ద్వారా కంపెనీల జాబితా చూడుము
 4. "/ Technology - Samsung beats HP to pole position". Ft.com. Retrieved 2010-09-04. Cite web requires |website= (help)
 5. Economist.com శామ్‌సంగ్ వద్ద వారసత్వం – విజయపు కిరీటం
 6. Park, Kyunghee (2009-07-28). "July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell's Platform Orders (Update1)". Bloomberg. Retrieved 2010-11-11. Cite web requires |website= (help)
 7. "The Top 225 International Contractors2010". Enr.construction.com. 2010-08-25. Retrieved 2010-11-11. Cite web requires |website= (help)
 8. "Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com". Money.cnn.com. 2009-07-20. Retrieved 2010-09-04. Cite news requires |newspaper= (help)
 9. "The World's Best Amusement Parks". Forbes.com. 2002-03-21. Retrieved 2010-09-11. Cite news requires |newspaper= (help)
 10. "CHEIL WORLDWIDE INC(030000:Korea SE)". businessweek.com. 2010-09-15. Retrieved 2010-09-16. Cite web requires |website= (help)
 11. "AGENCY FAMILY TREES 2010". Advertising Age. 2010-04-26. Retrieved 2010-09-16. Cite web requires |website= (help)
 12. "2009 World's Best Hotels". Institutional Investor. 2010-03-01. Retrieved 2010-09-11. Cite web requires |website= (help)
 13. "2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings". Institutional Investor. 2007-06-01. Retrieved 2010-09-16. Cite web requires |website= (help)
 14. "Deloitte Vol. 2 Article. 3" (PDF). deloitte.com. Retrieved 2011-01-20. Cite web requires |website= (help)
 15. Hutson, Graham (17 April 2008). "Samsung chairman charged with tax evasion - Times Online". The Times. Retrieved 28 February 2011. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 16. "[초 국가기업] <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴". Chosun.com. మూలం నుండి 2010-11-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-11. Cite web requires |website= (help)
 17. "History - Corporate Profile - About Samsung - Samsung". Samsung Group. Samsung Group. Retrieved 13 February 2011.
 18. మూస:Ko icon http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp Archived 2016-03-06 at the Wayback Machine.
 19. "Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips" (PDF). Austinchamber.com. 2010-06-09. Retrieved 2010-09-13. Cite web requires |website= (help)[permanent dead link]
 20. "Dubai skyscraper symbol of S. Korea's global heights". CNN. October 19, 2009. Retrieved 2009-10-19. Cite news requires |newspaper= (help)
 21. "Customers, suppliers & partners". rolls-royce.com. మూలం నుండి 2011-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-07. Cite web requires |website= (help)
 22. "GEnx-1B Engine Makes its First Flight on Boeing's 787 Dreamliner". General Electric Company. Retrieved 2011-02-07. Cite web requires |website= (help)
 23. Cho, Kevin (2009-04-24). "Samsung Says Hopes of Recovery Are 'Premature' as Profit Falls". Bloomberg. Retrieved 2010-09-04. Cite web requires |website= (help)
 24. "Global Branding Consultancy". Interbrand. Retrieved 2010-09-04. Cite web requires |website= (help)
 25. "INSIDE JoongAng Daily". Joongangdaily.joins.com. 2009-08-17. Retrieved 2010-09-04. Cite web requires |website= (help)
 26. "한국경제 大計 기업이 이끈다] 지난해 주요그룹 매출 보니". economy.hankooki.com. 2010-07-30. మూలం నుండి 2011-04-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-04. Cite web requires |website= (help)
 27. "Industrial giant's roots tied to nylon products". Joongangdaily.joins.com. 2009-11-09. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 28. "효성 40년史..오너 일가 뒷얘기 '눈길'". www.chosun.com. 2007-06-19. మూలం నుండి 2011-05-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 29. "Samsung to celebrate 100th anniversary of late founder". koreaherald.com. 2010-03-29. Retrieved 2011-01-21. Cite web requires |website= (help)
 30. "Largest Department Store". community.guinnessworldrecords.com. 2009-06-29. Retrieved 201-01-21. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 31. 31.0 31.1 హన్సోల్, షిన్‌సేగే డెనీ రిలేషన్స్ విత్ సేహన్ మే 24, 2000. జూన్గ్యాంగ్ డైలీ
 32. "Voigtlander & Rollei non-camera items". 1997-06-09. మూలం నుండి 2011-02-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 33. "Basel 96 Watches Take Back the Spotlight". jckonline.com. 1996-06. మూలం నుండి 2011-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-05. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 34. "Samsung Loses Attempt to Acquire Fokker". latimes.com. 1997-01-01. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 35. "Samsung buys Dutch group in return to M&A". 1997-06-09. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 36. "FUBU Shoes". shoeshowcase.net. మూలం నుండి 2010-12-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-05. Cite web requires |website= (help)
 37. "Nomura Wins The Lehman Asia Stakes". forbes.com. 2008-09-22. Retrieved 2011-02-07. Cite web requires |website= (help)
 38. "Samsung-Rothschild alliance". koreatimes.co.kr. 2008-11-05. Retrieved 2011-02-07. Cite web requires |website= (help)
 39. "Samsung Heavy Industries". www.forbes.com. 2009-09-23. Retrieved 2010-09-13. Cite news requires |newspaper= (help)
 40. "Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities". www.hellenicshippingnews.com. 2009-07-31. మూలం నుండి 2016-05-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-13. Cite web requires |website= (help)
 41. "Seoul wins 40-billion-dollar UAE nuclear power deal". www.france24.com. 2009-12-28. మూలం నుండి 2009-12-31 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-29. Cite web requires |website= (help)
 42. "Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010". www.premier.gov.on.ca. 2010-01-21. మూలం నుండి 2011-05-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-13. Cite web requires |website= (help)
 43. "Sony, Apple, Dell are Samsung's big buyers". www.koreatimes.co.kr. 2010-06-16. Retrieved 2010-10-26. Cite web requires |website= (help)
 44. "기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등". www.dt.co.kr. Retrieved 2010-09-19. Cite web requires |website= (help)
 45. Roberts, Rob (2009-10-26). "AECOM Technology buys Ellerbe Becket". kansascity.bizjournals.com. Retrieved 2010-09-19. Cite news requires |newspaper= (help)
 46. "Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer". www.pfizer.be. Retrieved 2010-09-19. Cite web requires |website= (help)[permanent dead link]
 47. "AAHRPP accredits the first international center". www.aahrpp.org. మూలం నుండి 2006-10-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-19. Cite web requires |website= (help)
 48. "한국 10대 그룹 이름과 로고의 의미". www.koreadaily.com. 2006-07-10. Retrieved 2010-09-19. Cite web requires |website= (help)
 49. "Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy". U.S. Department of Justice. Retrieved 2009-05-24. Cite web requires |website= (help)
 50. Pimentel, Benjamin (2005-10-14). "Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam". San Francisco Chronicle. Retrieved 2009-05-24. Cite news requires |newspaper= (help)
 51. "Price-Fixing Costs Samsung $300M". InternetNews.com. 2005-10-13. Retrieved 2009-05-24. Cite news requires |newspaper= (help)
 52. Flynn, Laurie J. (2006-03-23). "3 to Plead Guilty in Samsung Price-Fixing Case". New York Times. Retrieved 2009-05-24. Cite news requires |newspaper= (help)
 53. http://www.reuters.com/article/2010/05/19/eu-chipmakers-idUSLDE64I20420100519
 54. "Antitrust: Commission fines six LCD panel producers €648 million for price fixing cartel". European Commission. 2010-12-08. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]