శారదా మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శారదా మెహతా
శారదా మెహతా
జననం(1882-06-26)1882 జూన్ 26
మరణం1970 నవంబరు 13(1970-11-13) (వయసు 88)
విద్యాసంస్థగుజరాత్ కళాశాల
వృత్తిసంఘ సంస్కర్త, రచయిత్రి
జీవిత భాగస్వామి
సుమంత్ మెహతా
(m. 1898; died 1968)
తల్లిదండ్రులు
  • గోపిలాల్ ధ్రువ (తండ్రి)
  • బాలాబెన్ (తల్లి)

శారదా మెహతా (1882 జూన్ 26 – 1970 నవంబరు 13) భారతీయ సంఘసంస్కర్త, విద్యావాది గుజరాతీ రచయిత్రి. గుజరాత్ కు చెందిన తొలి గ్రాడ్యుయేట్ మహిళగా ఆమె పేరు గాంచింది. మహిళా విద్య, సంక్షేమం కోసం సంస్థలను స్థాపించింది. ఈమె అనేక వ్యాసాలు, ఆత్మకథలను కొన్ని రచనలను అనువదించింది.[1]

తొలినాళ్లలో[మార్చు]

శారదా మెహతా 1882 జూన్ 26న గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి గోపిలాల్ మణిలాల్ ధ్రువ ఒక న్యాయ అధికారి, తల్లి బాలాబెన్ వీరిది నాగార్ బ్రాహ్మణ కుటుంబం. ఈమె మనుమరాలు బోలేనాథ్ దివీధియా ఒక సంఘ సంస్కర్త, కవయిత్రి.[2][3]

శారదా మెహతా రాయిబహదూర్ మంగబడి బాలికల ఉన్నత పాఠశాల నుండి తన ప్రాథమిక విద్యను అభ్యసించింది. తర్వాత ఆమె మహాలక్ష్మి టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ఆంగ్లో-వెర్నాక్యులర్ క్లాసుల్లో చేరి 1897 లో మెట్రిక్యులేషన్ పట్టా పొందింది. ఈమె 1901 లో గుజరాత్ కళాశాల నుండి తర్కం, న్యాయ తత్వ శాస్త్రంలో బ్యాచిలర్ పట్టా పొందింది. ఈమె ఇంకా ఈమె సోదరి విద్యాగౌరి గుజరాత్ రాష్ట్ర తోలి మహిళా గ్రాడ్యుయేట్లు.[4]

శారదా 1898లో సుమంత్ మెహతాను వివాహం చేసుకుంది. సుమంత్ మెహతా శారదకు కళాశాల నుండే పరిచయం, ఆతను తనకు నాలుగు సంవత్సరాలు సీనియర్గా ఉన్నాడు. సుమంత్ ఒక వైద్య విద్యార్థి, గేక్వాడ్ లో వైద్యునిగా సమాజ సేవలందించాడు.

కెరీర్[మార్చు]

సామాజిక సేవలో[మార్చు]

మెహతా సామాజిక సంస్కరణలు విద్య, మహిళా సాధికారత, కుల ఆంక్షల వ్యతిరేకత, అంటరానితనం నిర్మూలన అలాగే భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఈమె మహాత్మా గాంధీ వ్యక్తిత్వంచే ప్రభావం చెందింది. 1906 నుండి శారదా స్వదేశీ (దేశీయ) వస్తువులు, ఖాదీ దుస్తులను ప్రోత్సహించింది.

మూలాలు[మార్చు]

  1. Rajgor, Shivprasad (January 2002). Thaker, Dhirubhai (ed.). ગુજરાતી વિશ્વકોશ [Gujarati Encyclopedia] (in గుజరాతి). Vol. XV (1st ed.). Ahmedabad: Gujarat Vishvakosh Trust. pp. 535–536. OCLC 248968453.
  2. Geraldine Hancock Forbes (2005). Women in Colonial India: Essays on Politics, Medicine, and Historiography. Orient Blackswan. pp. 124–142, 173. ISBN 978-81-8028-017-7.
  3. Rameshwari Devi; Romila Pruthi (1998). Women and the Indian Freedom Struggle: Sarojini Naidu. Pointer Publishers. p. 249. ISBN 978-81-7132-164-3.
  4. Vijailakshmi, Usha R. (2012). "Gandhi's Leadership and Civil Disobedience Movement in Mumbai, 1930: Events and Inferences" (CD-ROM). Humanities and Social Sciences Review. 1 (2): 383–391. ISSN 2165-6258.