శారీరక లక్షణ రుగ్మత
| శారీరక లక్షణ రుగ్మత | |
|---|---|
| ఇతర పేర్లు | సొమటోఫార్మ్ డిజార్డర్ |
| వీడియో వివరణ | |
| ప్రత్యేకత | మానసిక వ్యాధులు |
| లక్షణాలు | శారీరక లక్షణాలగురించి ఎక్కువ ఆలోచన లేదా ఆందోళన |
| కాల వ్యవధి | దీర్ఘకాలికము |
| కారణాలు | స్పష్టత లేదు |
| ప్రమాద కారకములు | కుటుంబ వ్యాధుల నేపధ్యం |
| భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | ఇతర వ్యాధులు |
| చికిత్స | కౌన్సెలింగ్, మందుల వాడకం |
| తరుచుదనము | ~6% |
శారీరక లక్షణ రుగ్మత, దీనినే సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్ అని ఆంగ్లంలో అంటారు. గతంలో దీనినే సోమాటోఫార్మ్ డిజార్డర్ గా పిలిచేవారు. ఇది శారీరక లక్షణాలకు సంబంధించి అధిక ఆందోళన కలిగి ఉండే మానసిక పరిస్థితి. ఈ ఆందోళన క్రమంగా సాధారణంగా రోజువారీ పనితీరుకు అంతరాయం కలిగించే స్థాయికి పెరుగుతుంది.[1] అంతర్లీన అనారోగ్య సమస్య ఫలితంగా ఈ రోగ లక్షణాలు సంభవించవచ్చు లేదా అనారోగ్యం లేకపోవచ్చు. ఇది తప్పించుకోగలిగే వ్యక్తిత్వ రుగ్మత లేదా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ అయి కూడా ఉండవచ్చు.[2]
శారీరక (సోమాటిక్) లక్షణ రుగ్మతలు అనేవి ఒక రకమైన మానసిక రుగ్మతలు. గుర్తించదగిన శారీరక కారణం లేని శారీరక అనారోగ్య లక్షణాలను నాడీ సంబంధిత, గుండె సంబంధిత, నొప్పి, జీర్ణశయాంతర సోమాటిక్ లక్షణాలుగా వర్గీకరించారు[3].
కారణాలు
[మార్చు]ఈ రుగ్మతకు కారణం అస్పష్టంగా. అయితే కుటుంబ చరిత్ర, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నిరుద్యోగం, పిల్లల దుర్భాషలాడడం వంటివి ఈ సమస్యను ప్రమాద పరిస్థితులలోకి తీసుకు వెళ్తుంది.[4][2] కనీసం ఆరు నెలల పాటు సమస్య ను పరిశీలించిన తరువాత రోగ నిర్ధారణ చేస్తారు.[1] సంబంధిత రుగ్మతల్లో నాడీ సంబంధిత సమస్యలు (conversion disorder), వాస్తవ రుగ్మత [గమనిక 1], అనారోగ్యం గురించిన ఆందోళన రుగ్మత ఉన్నాయి. కానీ ఇది మలింగరింగ్[గమనిక 2] కాదు. దీనిలో వేరే ప్రయోజనం కోసం లక్షణాలు ఉత్పన్నమవుతాయి.[5]
చికిత్స
[మార్చు]చికిత్సలో అభిజ్ఞా ప్రవర్తన చికిత్స వంటి కౌన్సెలింగ్ పద్ధతులు, SSRI (Selective serotonin reuptake inhibitor) వంటి మందులు ఉపయోగిస్తారు.[5] ప్రాణాలకు ముప్పు కలిగించని విధంగా చేసే చికిత్స ప్రయత్నాలు సహాయపడవచ్చు. అనవసరమైన ఆందోళనలు, ప్రతికూల ఫలితాలు అర్ధవంతమైనవి కావు కాబట్టి వ్యాధి నిర్ధారక పరీక్షలను నివారించాలని తరచుగా సిఫార్సు చేస్తారు. 90 శాతం వరకు కేసులు 5 సంవత్సరాలకు పైగా కొనసాగుతూనే ఉంటాయి.[2]
మానసిక చికిత్సలలో ప్రత్యేకంగా ఉపయోగించే అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స (CBT) ఈ సోమాటిక్ లక్షణ రుగ్మతకు కూడా విస్తృతంగా ఉపయోగించే చికిత్సా విధానం. దీనిలో
- ఒత్తిడిని తగ్గించడం
- శారీరక లక్షణాలను ఎదుర్కోవడం
- నిరాశ ఇతర మానసిక సమస్యలను ఎదుర్కోవడం
- జీవన నాణ్యతను మెరుగుపరచడం
- శారీరక లక్షణాల మీద శ్రద్ధను తగ్గించడం, వంటివి కౌన్సెలింగ్ లో చెపుతారు.
అంతేకాకుండా, బహుళ లక్షణాల రుగ్మతకి చికిత్స చేయడానికి కష్టతరము, వైద్యపరంగా వివరించలేని లక్షణాలతో ఉన్న రోగులలో జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో ఇంటర్ పర్సనల్ సైకోథెరపీ (PIT) దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించిందిచేస్తున్నాయి అని అధ్యయనాలు.[6] సోమాటిక్ లక్షణ రుగ్మత ఉన్నవారిలో సాధారణంగా కనిపించే నిరాశ, ఆందోళన వంటి లక్షణాలకు చికిత్స చేయడానికి యాంటిడిప్రెసెంట్ మందులు కూడా ఉపయోగిస్తారు. మందులు ప్రత్యేకంగా రుగ్మతను నయం చేయవు, కానీ CBTతో కలిపినప్పుడు చికిత్స ప్రక్రియకు సహాయపడతాయి.[7]
వ్యాప్తి
[మార్చు]సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్ జనాభాలో సుమారు 6% మందిని ప్రభావితం చేస్తుందని అంచనా. మగవారితో పోలిస్తే ఆడవారు 10 రెట్లు ఎక్కువగా గురి అవుతున్నారు.[2] తరచుగా బాల్యంలోనే ప్రారంభమవుతుంది. అయితే తరువాత చాలా కాలం వరకు రోగ నిర్ధారణ జరగకపోవచ్చు.[4] ఈ పరిస్థితిని మొదట పురాతన ఈజిప్షియన్లు వివరించారు. 1900లలో దీనిని హిస్టీరియా అని పిలిచేవారు.[8] ప్రస్తుతం దీని పేరు 2013 లో 'డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్, ఐదవ ఎడిషన్ (DSM-V) లో ప్రవేశపెట్టారు.[2]
సూచనలు
[మార్చు]- 1 2 Diagnostic and Statistical Manual of Mental Disorders (Fifth ed.). American Psychiatric Association. 2013. pp. 311-315. doi:10.1176/appi.books.9780890425596.156852. ISBN 978-0-89042-555-8.
- 1 2 3 4 5 D'Souza, RS; Hooten, WM (January 2020). "Somatic Syndrome Disorders". StatPearls. PMID 30335286.
- ↑ Williams, Sara E.; Zahka, Nicole E. (2017). Treating Somatic Symptoms in Children and Adolescents (Guilford Child and Adolescent Practitioner Series). 370 Seventh Avenue, Suite 1200, New York, NY 10001: The Guilford Press. pp. 18–21. ISBN 9781462529520. LCCN 2016049135.
{{cite book}}: CS1 maint: location (link) - 1 2 LaFrance WC (July 2009). "Somatoform disorders". Seminars in Neurology. 29 (3): 234–46. doi:10.1055/s-0029-1223875. PMID 19551600.
- 1 2 Kurlansik, SL; Maffei, MS (1 January 2016). "Somatic Symptom Disorder". American family physician. 93 (1): 49–54. PMID 26760840.
- ↑ Sattel H, Lahmann C, Gundel H, Guthrie E, Kruse J, Noll-Hussong M, Ohmann C, Ronel J, Sack M, Sauer N, Schneider G, Henningsen P. Brief psychodynamic interpersonal psychotherapy for patients with multisomatoform disorder: randomised controlled trial. The British Journal of Psychiatry. 2012;200(1):60-7.
- ↑ "Somatic symptom disorder Treatments and drugs - Mayo Clinic". Mayo Clinic (in ఇంగ్లీష్). Archived from the original on 2017-04-19. Retrieved 2017-04-19.
- ↑ Sadock, Benjamin J.; Kaplan, Harold I.; Sadock, Virginia A. (2007). Kaplan & Sadock's Synopsis of Psychiatry: Behavioral Sciences/clinical Psychiatry (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 634. ISBN 978-0-7817-7327-0. Archived from the original on 2021-06-28. Retrieved 2021-02-17.
గమనిక
[మార్చు]- ↑ ఒక వ్యక్తి, ఎటువంటి దుష్ప్రవర్తన కలిగించే ఉద్దేశ్యం లేకుండా, ఉద్దేశపూర్వకంగా (తమకు లేదా మరొకరికి) రోగి వలె ఉద్దేశపూర్వకంగా లక్షణాలను ఉత్పత్తి చేయడం, నటించడం లేదా అతిశయోక్తి చేయడం ద్వారా తనకు అనారోగ్యం ఉన్నట్లుగా వ్యవహరించే పరిస్థితి.
- ↑ చట్టపరమైన లేదా పని బాధ్యతలను తప్పించుకోవడం, పరిహారం పొందడం లేదా మందులు పొందడం వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం శారీరక లేదా మానసిక లక్షణాలను ఉద్దేశపూర్వకంగా కల్పించడం లేదా అతిశయోక్తి చేయడం