శాశ్వత ఖాతా సంఖ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ లేదా పర్మనెంట్ ఎకౌంట్ నంబర్) అనేది అక్షరాలు అంకెలు కలగలిసి ఉన్న యునిక్ సంఖ్యని భారత ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం గుర్తింపబడిన న్యాయబద్దమైన ఎంటిటీస్ కు జారీ చేయబడుతుంది. ఇది భారతీయ ఆదాయపు పన్ను విభాగం (ఇండియన్ ఇన్ కమ్ టాక్స్ డిపార్త్ మెంట్) జారీ చేస్తుంది. ఇది గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది.

బ్యాంక్ అకౌంట్ ప్రారంభం, ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే జీతం లేదా బోధనా రుసుములను తీసుకొనుటకు, పరిమితికి మించి కొనే లేదా అమ్మే ఆస్తులకు వంటి దాదాపు అన్నిఆర్థిక లావాదేవీలకు ఈ సంఖ్య తెలియజేయటం తప్పని సరి.దీని యొక్క ముఖ్యోద్దేశం అధిక విలువ కలిగిన వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను పసిగట్టి తద్వారా పన్ను ఎగవేతలను అరికట్టటం.

శాశ్వత ఖాతా సంఖ్య అనేది యునిక్, జాతీయ, శాశ్వతం. ఈ సంఖ్య కలిగిన వారి చిరునామా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రమునకు మారినప్పటికీ ఈ సంఖ్య మాత్రం మారదు.