శింగనమల(పెనగలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శింగనమల(పెనగలూరు)" కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ ఓబనమూర్తి స్వామి ఆలయం:- రాష్ట్రంలో ఎక్కడా కనిపించని ఓబనమూర్తి స్వామి ఆలయం ఈ గ్రామంలో ఉంది. శాతవాహనరాజులు ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటుచేసినట్లు చారిత్రిక ఆధారాలు చెబుచున్నవి. అప్పట్లో వివాహాలు జరిపించడానికి రాజులు అద్భుతమైన మంటపాన్ని నిర్మించారు. గతంలో 4 గ్రామాలు ఇక్కడ ఉండేవనీ, 100 కు పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ ఉన్నట్లు పెద్దలు చెబుతారు. వేదపండితులు, బ్రాహ్మణులు, అధికంగా ఉండటంతో శింగనమల గ్రామానికి అప్పట్లో, "శృంగేమళై "గా పేరు పెట్టగా కాలక్రమంలో శింగనమలగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు.[2]
  2. శ్రీ సీతారాముల ఆలయం:- శింగనమల గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ ఆలయంలో, 2014,ఫిబ్రవరి-24 సోమవారం నాడు, విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. పలువురు దాతలు ఆలయానికి విరళాలిచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు, ఈటమాపురం, శింగిరెడ్డిపల్లె, పెనగలూరు మొదలగు గ్రామాల నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. [3]
  3. శ్రీ నయనధీశ్వరుడు ఆలయం.

వ్యవసాయం, నీటిపారుదల[మార్చు]

ఈ గ్రామములో 374 ఎకరాలలో విస్తరించుకుని ఉన్న ఒక చెరువు ఉంది. ఈ చెరువు క్రింద 2000 ఎకరాల ఆయకట్ట ఉంది. 2005లో ఈ చెరువులో పూడిక తీశారు. కానీ ఈ చెరువు ఇప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. [2]

శింగనమల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పెనగలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 599
 - స్త్రీలు 565
 - గృహాల సంఖ్య 282
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,164 - పురుషుల సంఖ్య 599 - స్త్రీల సంఖ్య 565 - గృహాల సంఖ్య 282

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
  2. ఈనాడు కడప;24డిసెంబరు,2013; 4వ పేజీ.

మూలాలు[మార్చు]

[2] ఈనాడు కడప:- డిసెంబరు-31,2013.5వ పేజీ. [3] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-25; 4వ పేజీ.