Jump to content

శిలలపై శిల్పాలు చెక్కినారు (పాట)

వికీపీడియా నుండి

శిలలపై శిల్పాలు చెక్కినారు 1962లో విడుదలైన మంచి మనసులు చిత్రంలోని పాట. ఈ పాటను ఘంటసాల ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకి కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతం అందించారు. సాహిత్యం అందించింది ఆచార్య ఆత్రేయ.

విశేషాలు

[మార్చు]

అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి మీద చిత్రీకరించిన ఈ పాట, చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ పాటను విజయనగర సామ్రాజ్య శిల్పకళకు నెలవైన హంపిలో చిత్రీకరించారు. అంతేకాక ఈ పాటలో 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి.యస్.రంగా అనుమతితో పెట్టారు. ఈ పాట ప్రింటింగులో రంగా స్వయంగా పాల్గొన్నారు. ఆ సన్నివేశాలలో శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు కనిపిస్తారు, చిన్న విచిత్రమేమిటంటే తెనాలి రామకృష్ణగా నాగేశ్వరరావు కూడా కనిపిస్తారు. ఎంతో గంభీరంగా సాగే ఈ పాట, చివరికి మృదువుగా, ప్రశాంతంగా సమాప్తమవుతుంది.

పాటలోని ఒక సన్నివేశంలో నాగేశ్వరరావు, జానకి

అహో ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!

విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!

ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

కనుచూపు కరువైన వారికైనా

కనుచూపు కరువైన వారికైనా

కనిపించి కనువిందు కలిగించు రీతిగా

శిలలపై శిల్పాలు చెక్కినారు

ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు

ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు

ఒక చెంత శృంగారమొలుకు నాట్యాలు

నవరసాలొలికించు నగరానికొచ్చాము

కనులు లేవని నీవు కలత పడవలదు

కనులు లేవని నీవు కలత పడవలదు

నా కనులు నీవిగా చేసికొని చూడు

శిలలపై శిల్పాలు చెక్కినారు

మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

ఏకశిలరథముపై లోకేశు వడిలోన

ఓరచూపులదేవి ఊరేగి రాగా

ఏకశిలరథముపై లోకేశు వడిలోన

ఓరచూపులదేవి ఊరేగి రాగా

రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి

సరిగమా పదనిసా స్వరములే పాడగా

కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు

కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ

కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు

కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ

శిలలపై శిల్పాలు చెక్కినారు

మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు

శిలలపై శిల్పాలు చెక్కినారు

రాజులె పోయినా రాజ్యాలు కూలినా

కాలాలు మారినా గాడ్పులే వీచినా

మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా

ఆ... ఆ... ఆ... ఆ...

చెదరనీ కదలనీ శిల్పాల వలెనే

నీవు నా హృదయాన నిత్యమై సత్యమై

నిలిచివుందువు చెలీ

నిజము నా జాబిలీ

లింకులు

[మార్చు]