శిలాలోలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిలాలోలిత
Silalolitha.jpg
జననంలక్ష్మి
1958,జూలై 12
హైదరాబాద్
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుడాక్టర్. పి. లక్ష్మి
వృత్తిఅధ్యాపకురాలు
ప్రసిద్ధిమహిళా సాధికారత సాహిత్యం
పదవి పేరుడాక్టర్

శిలాలోలిత కలం పేరుతో తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న రచయిత్రి డాక్టర్ పి. లక్ష్మి. ఆమె కవయిత్రి, విమర్శకురాలు కూడా[1]

జననం[మార్చు]

1958, 12 జూలైహైదరాబాద్ లోని శంషాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు పి.యం మణి (రచయిత్రి), పి. రామిరెడ్డి (హిందీ ఉపాధ్యాయులు).[2]

విద్యాభ్యాసం[మార్చు]

 • ప్రాథమిక విద్య రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లోనూ,
 • ఉన్నత విద్య సుల్తాన్‌బజార్ లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోనూ,
 • బి.ఏ (రాజనీతి శాస్త్రం, 1985) దూరవిద్యద్వారా ఆంధ్రా విశ్వవిద్యాలయం లోనూ,
 • యం.ఏ (తెలుగు, 1987) కోఠి మహిళా కళాశాలలోనూ,
 • తెలుగు పండిత శిక్షణ (1988 ), మసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కళాశాలలోనూ
 • యం.ఫిల్ (1989)
 • పి.హెడ్ డి (1998) చదివారు.

కుటుంబం[మార్చు]

1991 మే 10 న కవి యాకూబ్ గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సందీప్, సాహీర్ భారతి.

నివాసం - ఉద్యోగం[మార్చు]

ప్రస్తుతం హైదరాబాద్ లోని చైతన్యపురిలో స్వంత ఇంటిలో నివసిస్తున్నారు. 1993 నుండి జి.యల్.ఆర్ న్యూ మోడల్ జూనియర్ కళాశాలలో తెలుగు జూనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

ప్రచురణలు[మార్చు]

 1. 1993 - కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు ( యం.ఫిల్ పరిశోధనా వ్యాసం)
 2. 1999 - పంజరాన్నీ నేనే పక్షినీ నేనే (కవిత్వం)
 3. 2005 - ఎంతెంత దూరం (కవిత్వం)
 4. 2006 - కవయిత్రుల కవితా మార్గం ( పి.హెడ్ డి పరిశోధనా వ్యాసం)
 5. 2006 - నారి సారించి (సాహిత్య విమర్శనా వ్యాసం)
 6. 2013 - గాజునది (కవిత్వం)

మూలాలు[మార్చు]

 1. 10టివి, అక్షరం (July 24, 2016). "ప్రగతి శీల భావాలతో కవిత్వాలు". Archived from the original on 28 July 2016. Retrieved 27 July 2016.
 2. నవతెలంగాణ, మానవి, ముఖాముఖి (13 January 2016). "అంత‌రంగ మ‌థ‌న‌మే క‌విత్వం". Retrieved 27 July 2016.

బయటి లింకులు[మార్చు]