శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ | |
---|---|
ప్రదేశం | |
గచ్చిబౌలి, హైదరాబాదు, తెలంగాణ | |
అక్షాంశ,రేఖాంశాలు | 17°26′14″N 78°20′40″E / 17.4372°N 78.3444°E |
జంక్షన్ వద్ద రహదార్లు | ఐటీ కారిడార్ - కొండాపూర్ |
నిర్మాణం | |
రకం | ఫ్లైఓవర్ |
లైన్స్ | 4 |
నిర్మాణం చేసినవారు | వాడుకలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ |
ప్రారంభం | 2022 నవంబరు 25 |
గరిష్ట వెడల్పు | 1.75 కిలోమీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పు |
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్.[1][2] ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఐటీ కారిడార్‌కు సులభతర ప్రయాణం కోసం గచ్చిబౌలి జంక్షన్ మీదుగా రెండు వైపులా 4లైన్లతో, కొండాపూర్ వైపు 6 లైన్లతో 1.75 కిలోమీటర్ల పొడవు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. దీని నిర్మాణంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గడంతోపాటు హైటెక్‌సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రయాణం సులువవుతుంది.[3] ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ఫ్లైఓవర్ ఇది.
నిర్మాణం
[మార్చు]గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో ఔటర్‌రింగ్ రోడ్డు వైపు 4 లైన్లు, 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతోనూ.. కొండాపూర్ వైపు 6 లైన్లు, 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతోనూ నిర్మిస్తున్న ఈ బైడైరెక్షనల్ ఫ్లైఓవర్ కు 2019 నవంబరు 4న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[4] 2019 డిసెంబరులో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి.[5]
హైదరాబాద్ మహానగర పాటక సంస్థ చేత ఇంజనీరింగ్ ఫీట్ అని పిలువబడుతున్న ఈ ఫ్లైఓవర్, భూమి నుండి 18 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడిందిది. దీని నిర్మాణంలో భాగంగా అత్యంత పొడవైన స్పాన్‌ను గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా 64 మీటర్ల మేర బిగించబడింది.[6] ఫేజ్-1లోని వై ఆకారంలో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి ఔటర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా తాకుతుంది.[3]
ప్రారంభం
[మార్చు]2022 నవంబరు 25న మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపి జి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణిదేవి, రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కార్పోరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7][8]
వివరాలు
[మార్చు]- ఓఆర్‌ఆర్ మీదుగా గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ వరకు (రెండు వైపులా) మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.
- ఎగువ ర్యాంపు ఓఆర్‌ఆర్ నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 458.64 మీటర్ల వెడల్పు, శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు దిగువ ర్యాంపు ఫ్లైఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్‌లను చేపట్టారు.
- సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్‌ను చేపట్టారు.
- మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లైఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "KTR to inaugurate Shilpa Layout flyover on Friday". The New Indian Express. 2022-11-25. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ India, The Hans (2022-11-25). "KTR to throw open Shilpa Layout flyover today". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-24. Retrieved 2022-11-25.
- ↑ 3.0 3.1 telugu, NT News (2022-05-06). "ఆగస్టు కల్లా శిల్ప ఫ్లైఓవర్". Namasthe Telangana. Archived from the original on 2022-05-06. Retrieved 2022-05-06.
- ↑ "Hyderabad: 2nd Biodiversity flyover ready". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-11-04. Archived from the original on 2021-06-18. Retrieved 2022-05-06.
- ↑ "New SRDP Flyover At Gachibowli Junction To Come Up By June 2022". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-09-29. Archived from the original on 2021-10-13. Retrieved 2022-05-06.
- ↑ Today, Telangana (2022-05-05). "Hyderabad: Shilpa Layout-ORR flyover an engineering feat". Telangana Today. Archived from the original on 2022-05-06. Retrieved 2022-05-06.
- ↑ telugu, NT News (2022-11-25). "నగర సిగలో మరో వంతెన.. శిల్పా లేవుట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ ABN (2022-11-25). "Shilpa Layout Flyover: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ telugu, NT News (2022-11-25). "జూబ్లీ హిల్స్ టు ఔటర్ 10 నిమిషాల్లో". www.ntnews.com. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.