Jump to content

శిల్ప, చిత్రకళ పరిణామం

వికీపీడియా నుండి
శిల్ప,చిత్రకళ పరిణామం
book title
కృతికర్త:
సంపాదకులు: చలసాని ప్రసాదరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): శిల్ప, చిత్రకళ
ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
విడుదల: 2004
పేజీలు: 528
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ISBN No. 81-86073-107-6

శిల్ప,చిత్రకళ పరిణామం చలసాని ప్రసాదరావు సంపాదకత్వంలో వెలువడిన, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన 90 వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం.

నాందీ ప్రస్తావన

[మార్చు]

1983 తర్వాత వివిధ అకాడమీలు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమయ్యాయి. వాటిల్లో లలితకళా అకాడమీ ఒకటి. తెలుగువారి చిత్ర, శిల్పకళారంగాన్ని పరిపుష్టం చేసి ప్రోత్సహించడం, ఆ వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించటం, విశ్వవిద్యాలయం కర్తవ్య నిర్వహణలో ఒక భాగం. చిత్ర, శిల్ప కళారంగంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించటం, బహుమతులు ప్రదానం చేయటం గతంలో చేసింది. చిత్ర, శిల్పకళ కోర్సుల్ని అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం, కళాభిమానుల కోసం విశ్వవిద్యాలయం గతంలో కొన్ని గ్రంథాలను ప్రచురించింది కూడా.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య, సంగీత, నృత్య, నాటక, లలితకళా అకాడమీల బాధ్యతలు, అంతర్జాతీయ తెలుగుసంస్థ లక్ష్యం - వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, లక్ష్యసాధన కోసం అవరించినదే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ప్రవాసాంధ్రులలో సాహితీ సాంస్కృతిక ప్రక్రియల వ్యాప్తికోసం విజ్ఞానదూతలను, కళాబృందాలను తయారుచేసి వివిధ దేశ విదేశాలకు పంపే ప్రయత్నం చేసింది. భాషా, కళా, సాహిత్య, సాంస్కృతిక ప్రచార సాధనకు ఉపకరించే గ్రంథాలను ప్రచురించారు.

తెలుగువారి భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, జానపద గిరిజన విజ్ఞానం, లలిత కళారంగాలలో బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ, సేవ వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలందించడానికీ, సంస్కృతీ పరిరక్షణతోపాటు తెలుగు పరిమళాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ తెలుగువారి అస్తిత్వానికీ, ఆస్తిక్యబుద్ధి విశేషానికీ పెట్టింది పేరుగా, తెలుగువారి చిరునామాగా, చిరస్థాయిగా ఉండాలనే సత్సంకల్పంతో, సమున్నతమైన ఆశయాలతో ఏర్పడిన ఒక ఉన్నత విద్యాసంస్థ, ఒక విశిష్టమైన విద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. నిర్దిష్ట లక్ష్యంతో - ఒక దూరదృష్టితో, నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అనేక ప్రచురణలు చేసింది.

తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంపుటాలను సిద్ధం చేయించి విశ్వసాహితి, భారతభారతి సంపుటా లనూ 'హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఆంధ్రాస్' అనే పేరుతో ఆంగ్లంలో ఒక విజ్ఞాన సర్వస్వాన్ని గతంలో ఈ విశ్వవిద్యాలయం ప్రచురించింది.

కళ-పత్రిక

[మార్చు]

1961 నుండి 1973 సంవత్సరముల మధ్య కాలంలో చలసాని గారి సంపాదకత్వంలో కళ-పత్రిక రూపంలో వెలువడింది. పత్రిక వెలువరించిన చలసాని ప్రసాదరావుగారే ఈ గ్రంథానికి సంపాదకులు. కీ.శే. చలసానివారి కలల పంటగా రూపుదిద్దుకున్నదే కళ. 60 మంది కళావేత్తల, కళాభిజ్ఞుల, చిత్రశిల్ప కళాకారుల 90 వ్యాసాల సమాహార స్వరూపం ఈ పుస్తకం.

1961లో వెలువడిన చిత్రకళా పరిచయం, 1968లో కళాపరిణామ సమీక్ష, 1969లో తెలుగువారి చిత్ర శిల్పకళల పూర్వాపరాలు, 1970 లో ప్రాచీనులు నిర్దేశించిన చిత్ర శిల్పకళా లక్ష్యలక్షణాలు, 1971 లో సమకాలీన కళ చర్చావేదిక, 1973 లో భారతీయ కళా పరిణామ చరిత్ర - అపురూపమూ, ప్రామాణికమూ అయిన ఆ ఆరు సంపుటాలు ఒక గ్రంథ రూపంలో వెలువరించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

కళ ప్రతి సంపుటం ఒక ప్రత్యేక అంశం మీద సార్వకాలికమైన విషయ సంపదతో రూపొందింది. కాలం గడిచినా ఆ సంపుటాల విలువ పెరిగిందేగాని తరగలేదు. అందువల్ల విద్యార్థులకూ, కళాభిమానులకూ ఒక ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుందని భావించి కళ గ్రంథాన్ని ప్రచురించారు. ఆరు భాగాలుగా వున్న ఈ గ్రంథంలో మొత్తం 90 వ్యాసాలున్నాయి. ఒక్కో భాగంలో ఏమేమి వ్యాసాలున్నాయి, ఆయా రచయితలు ఎవరు? అనేది క్రింద చూడవచ్చు.

చిత్ర శిల్ప కళాపరిచయం

[మార్చు]

మొదటి భాగం (కళ - మొదటి సంపుటి - 1961)

  1. విదేశాల్లో చిత్రకళ - పూర్వరంగం - సూర్యదేవర సంజీవదేవ్
  2. పాశ్చాత్య చిత్రలేఖనంలో కొన్ని ముఖ్య పరిణామాలు - మొక్కపాటి కృష్ణమూర్తి
  3. ప్రాచీన భారతీయ చిత్రలేఖనం - చలసాని ప్రసాదరావు, బొగ్గవరపు సత్యానందం
  4. భారతీయ చిత్రలేఖనం - ఆధునిక దశ - అంట్యాకుల పైడిరాజు
  5. ఆధునిక చిత్రకళ - పూర్వ, పశ్చిమ సాంప్రదాయములు - బి.వి. నరసింహారావు
  6. భారతీయ శిల్పకళ - కె.వి. కుసుమకుమారి
  7. ఆధునిక శిల్పకళ - వి.వి. చౌదరి
  8. మాధ్యమిక యుగాంధ్ర చిత్రలేఖనం - అబ్బూరి గోపాలకృష్ణ
  9. భారతీయ చిత్రకళారంగంలో, ఆంధ్ర చిత్రకారుల స్థానం - వేలూరి రాధాకృష్ణ
  10. జానపద చిత్రకళ - బి. వెంకటయ్య
  11. అలంకరణ కళ - కొండపల్లి శేషగిరి రావు
  12. వ్యంగ్య చిత్రాలు - కథా చిత్రాలు - రాంభట్ల కృష్ణమూర్తి
  13. వాణిజ్య కళ - యన్.పి. విఠల్
  14. కళ-వాస్తుశాస్త్రము - ఆర్.బి. రాజు
  15. ఆంధ్రుల వాస్తుశిల్పము - బి. రామచంద్రరావు
  16. మన సాంస్కృతిక రంగం - ఎ.ఎస్.రామన్

కళా పరిణామ సమీక్ష

[మార్చు]

రెండవ భాగం(కళ - రెండవ సంపుటి-1968)

  1. కళ-మూలమూ-మూల్యమూ - కె.వి. రమణారెడ్డి
  2. సాంప్రదాయం నుండి ఆధునికతలోకి - హెర్మన్ గోయెట్జ్
  3. నవ్యధార - సూర్యదేవర సంజీవదేవ్
  4. నేటి భారతీయ కళ - జయ అప్పాసామి
  5. ఆధునికమా? సమకాలీనమా? - జి. స్వామినాథన్
  6. కళలలో సామూహిక లక్షణాలు - కొడవటిగంటి కుటుంబరావు
  7. ఆధునిక ఆంధ్రచిత్రకళ - చలసాని ప్రసాదరావు
  8. నేటి చిత్రకారుడు - అతని కళ - ఎస్.వి. రామారావు
  9. రసదృష్టి - ఆచంట జానకిరామ్
  10. మన కళా వారసత్వం - యం. బాలకోటయ్య
  11. మాతరం- వేలూరి రాధాకృష్ణ
  12. కళ-చిత్రకళ - డి. వీరమణి
  13. సినిమారంగంలో కళాదర్శకుడు - మాధవపెద్ది గోఖలే
  14. చిత్రకళా విద్యావిధానం - అంట్యాకుల పైడిరాజు
  15. ప్రేక్షకుని దృక్కోణం నుండి - శ్రీపతి
  16. సాహిత్యంలో చిత్రకళ - ఎస్. జనార్ధన్
  17. కళ-చిన్ననాటి ముచ్చటలు - రాంభట్ల కృష్ణమూర్తి
  18. కళ-సౌందర్యవాదం - శీలా వీర్రాజు
  19. కళా ఉద్యమాలు - పి.ఆర్.రాజు

తెలుగువారి చిత్ర శిల్ప కళల పూర్వాపరాలు

[మార్చు]

మూడవ భాగం (కళ - మూడవ సంపుటి –1969)

  1. పరిప్రేక్షణ - సూర్యదేవర సంజీవదేవ్
  2. ప్రాచీన సాహిత్యంలో చిత్రకళా ప్రస్తావనలు - దేవులపల్లి ప్రభాకరరావు
  3. ఆంధ్రుల ఆది చిత్రకళ - రాంభట్ల కృష్ణమూర్తి
  4. బౌద్ధయుగపు కళాసృష్టి - నార్ల వెంకటేశ్వరరావు
  5. హిందూకళ వికాసదశ - పి.సి.ఎన్. రెడ్డి
  6. కాకతీయ శిల్పం - చలసాని ప్రసాదరావు
  7. విజయనగర చిత్రలేఖనం - అబ్బూరి గోపాలకృష్ణ
  8. బ్రిటిష్ పాలనాకాలపు చిత్రకళ - ఆచంట జానకిరామ్
  9. పునరుజ్జీవనోద్యమ కాలపు చిత్రకళ - వేలూరి రాధాకృష్ణ
  10. స్వాతంత్య్రానంతర ఆంధ్ర చిత్రకళ - మన్మోహన్
  11. సమకాలీన చిత్రకళ - మాదేటి రాజాజి

ప్రాచీనులు నిర్దేశించిన చిత్ర, శిల్పకళా లక్ష్య లక్షణాలు

[మార్చు]

నాలుగవ భాగం (కళ - నాలుగవ సంపుటి-1970)

  1. ఆతీతే - సూర్యదేవర సంజీవదేవ్
  2. కళా పరిణామం - కె.కె. రంగనాథాచార్యులు
  3. రూప భేదం - సంకలన వ్యాసాలు
  4. ప్రమాణాలు, భావ యోజనం, లావణ్యం, సాదృశ్యం, వర్ణికా భంగం
  5. భూమి బంధం - రాంభట్ల కృష్ణమూర్తి
  6. ప్రాచీన శాస్త్రాలు- ఆధునిక దృక్పధం - ఎస్.వి. రామారావు

సమకాలీన కళఃచర్చావేదిక

[మార్చు]

ఐదవ భాగం (కళ - అయిదవ సంపుటి-1971)

  1. కళ - సమాజ పరిణామం - సూర్యదేవర సంజీవదేవ్
  2. సామాన్యుడు కోరే చిత్రకళ - కొడవటిగంటి కుటుంబరావు
  3. నేటి చిత్రకళా విద్యావిధానం - మన్మోహన్ దత్
  4. రేపటి చిత్రకళ - కృష్ణాబాయి
  5. కళ- ప్రజలు-పత్రికలు - పురాణం సుబ్రహ్మణ్యశర్మ
  6. కళ-జనానీకము - ఆచంట జానకిరాం
  7. కళాసీమ వాస్తవికత - డాక్టర్ ఎస్.వి.ఎస్.రావు
  8. ఫొటోగ్రాఫిక్ చిత్రకళ - వై. రాంబాబు
  9. ఎవరికోసం ఈ చిత్రకళ? - వి.ఎస్. హరినారాయణ్
  10. కళారంగంలో నేటి పరిస్థితి - వేలూరి రాధాకృష్ణ
  11. కళలలో సెక్సు-నీతి - కె.వి. రమణారెడ్డి
  12. అమాయకుల చిత్రకళ - అబ్బూరి గోపాలకృష్ణ
  13. తెలుగుదేశంలో విప్లవ చిత్రకళ - చంద్ర
  14. కళ- ఏమిటి? ఎందుకు? - రాంభట్ల కృష్ణమూర్తి
  15. కళలు-చారిత్రక దృష్టి - హరి
  16. కళారంగంలో ఒకటిన్నర దశాబ్దాలు- చలసాని ప్రసాదరావు

భారతీయ కళా పరిణామ చరిత్ర

[మార్చు]

ఆరవ భాగం (కళ - ఆరవ సంపుటి-1973)

  1. చరిత్ర-కళ - నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు
  2. మతం-కళలు - రాంభట్ల కృష్ణమూర్తి
  3. ఆదిమకాలపు భారతీయ కళ - దివ్యజ్ఞాన సరోజినీ వరదరాజన్
  4. బౌద్ధయుగపు తొలికళలు - సూర్యదేవర సంజీవదేవ్
  5. బౌద్ధయుగపు కళాభివృద్ధి - వి.వి.టోణ్‌పే
  6. జైన-వైష్ణవ-శైవకళలు - వై. రాంబాబు
  7. మధ్యయుగాలనాటి చిత్రకళ - వేలూరి రాధాకృష్ణ
  8. బ్రిటిష్ కాలపు చిత్రకళ - వి.ఎస్. హరినారాయణ్
  9. అలంకరణ కళ - ముద్రగడ సూర్యప్రకాశరావు
  10. కామకళ-తాంత్రిక కళ - డాక్టర్ ఎస్.వి.ఎస్.రావు
  11. కళ- సాంఘిక ప్రయోజనం - బొజ్జా తారకం
  12. కళ - రచయితలు, చిత్రకారులు - వెనిగళ్ళ వెంకటరత్నం

మూలాలు

[మార్చు]