శివకుమార్ ఉదాసి
| శివకుమార్ చనబసప్ప ఉదాసి | |||
| పదవీ కాలం 2009 – 2024 | |||
| తరువాత | బసవరాజు బొమ్మై | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | హవేరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 మే 20 హవేరి , కర్ణాటక , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | సి.ఎం. ఉదాసి, నీలాంబిక | ||
| జీవిత భాగస్వామి |
రేవతి (m. 2003) | ||
| సంతానం | 2 | ||
| పూర్వ విద్యార్థి | సైనిక్ పాఠశాల, బీజాపూర్, విజయపుర బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,బెంగళూరు, కర్ణాటక | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
శివకుమార్ చనబసప్ప ఉదాసి (జననం 20 మే 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హవేరి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శివకుమార్ ఉదాసి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకియలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హవేరి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సలీం అహ్మద్‌పై 87,920 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సలీం అహ్మద్‌పై 87,571 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాల కమిటీ సభ్యుడిగా, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, ఆర్థిక స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సెక్యూరిటీ వడ్డీ అమలు & రుణాల రికవరీ చట్టాలు, ఇతర కేటాయింపు (సవరణ) బిల్లు, 2016 పై జాయింట్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
శివకుమార్ ఉదాసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హవేరి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డిఆర్ పాటిల్‌పై 1,40,882 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ఇంధన శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా, జల వనరుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Shivakumar Udasi" (in ఇంగ్లీష్). The Indian Express. 27 April 2025. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Shivakumar Udasi's motto: Work is worship,and welfare schemes a blessing" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 June 2019. Retrieved 27 April 2025.