శివకుమార్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిట్ శివకుమార్‌ శర్మ
వ్యక్తిగత సమాచారం
జననం(1938-01-13)1938 జనవరి 13 [1]
జమ్మూ, జమ్మూ కాశ్మీరు, బ్రిటిష్ రాజ్
మూలంజమ్మూ, భారతదేశం
మరణం2022 మే 10(2022-05-10) (వయసు 84)[2]
సంగీత శైలిహిందుస్థానీ సంగీతము
వృత్తిసంగీత దర్శకుడు, సంగీత విద్వాంసుడు
వాయిద్యాలుసంతూర్, తబలా
క్రియాశీల కాలం1955–2022
జీవిత భాగస్వామిమనోరమ
పిల్లలురాహుల్ శర్మ, రోహిత్ శర్మ
సంబంధిత చర్యలురాహుల్ శర్మ(కుమారుడు)
హరిప్రసాద్ చౌరాసియా

పండిట్ శివకుమార్‌ శర్మ(1938 జనవరి 13 - 2022 మే 10) భారతదేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు. ఆయన సంగీతరంగంలో సేవలకుగానూ 1991లో పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్ పురస్కారలతో భారత ప్రభుత్వం సత్కరించింది.

వృత్తి జీవితం

[మార్చు]

పండిట్ శివ కుమార్ శర్మ 1938లో కాశ్మీర్ లో జన్మించి, జమ్మూ కాశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు. ఆయన జమ్మూ కాశ్మీరు రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివ కుమార్ శర్మ 1956లో ‘జనక్‌ జనక్‌ పాయల్‌ బాజే’ సినిమాకు తొలిసారిగా బ్యాక్‌గ్రౌండ్ ‌స్కోర్‌ అందించి, 1960లో ఆయన తన తొలి సోలో ఆల్బమ్‌ను తీశాడు.

పండిట్ శివ కుమార్ శర్మ, పండిట్ హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి శివ-హరి పేరుతో ‘సిల్సిలా’, 'ఫాస్లే' , ‘లమ్హే’ , ‘చాందిని’, 'డార్'వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

మరణం

[మార్చు]

84 ఏళ్ల పండిట్ శివ కుమార్ శర్మ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గుండె పోటు రావడంతో ముంబయిలో 2022 మే 10న మరణించాడు. ఆయనకు భార్య మనోరమ, కుమారులు రాహుల్‌ శర్మ,.రోహిత్ శర్మ ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "A dream fulfilled". Indian Express. 30 April 2000. Archived from the original on 3 October 2012. Retrieved 3 February 2009.
  2. Eenadu (10 May 2022). "సంగీత విద్వాంసుడు పండిత్‌ శివకుమార్‌ శర్మ కన్నుమూత". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. V6 Velugu (10 May 2022). "'సంతూర్‌' వాయిద్యకారుడు పండిట్ శివకుమార్‌ శర్మ ఇక లేరు" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (10 May 2022). "క‌న్నుమూసిన‌ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ‌కుమార్ శ‌ర్మ". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.