Coordinates: 1°26′23.58″N 103°46′46.59″E / 1.4398833°N 103.7796083°E / 1.4398833; 103.7796083

శివకృష్ణ దేవాలయం (సింగపూర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివకృష్ణ దేవాలయం (సింగపూర్)
శివకృష్ణ దేవాలయం (సింగపూర్) is located in Singapore
శివకృష్ణ దేవాలయం (సింగపూర్)
సింగపూరులో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు1°26′23.58″N 103°46′46.59″E / 1.4398833°N 103.7796083°E / 1.4398833; 103.7796083
దేశంసింగపూర్
ప్రదేశం31 మార్సిలింగ్ రైజ్, సింగపూర్ 739127
సంస్కృతి
దైవంశివుడు, శ్రీకృష్ణుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రవీడియన్ శైలీ
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1962
సృష్టికర్తకుంజుకృష్ణన్
వెబ్‌సైట్వెబ్సైటు

శివకృష్ణ దేవాలయం, సింగపూరులోని హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో విష్ణువు, శివుడు ప్రధాన దేవుళ్ళు కాగా ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు.[1]

చరిత్ర[మార్చు]

1962లో కుంజుకృష్ణన్ అనే ప్రవాస భారతీయుడు సెంబావాంగ్ రోడ్‌లోని ఒక ప్రదేశంలో దేవతలను ప్రతిష్ఠింపజేసి, పూజలు చేసేవాడు. కొంతమంది టాక్సీ డ్రైవర్లు విశ్రాంతి కోసం ఆ ప్రాంతంలో గుమిగూడేవారు. కుంజుకృష్ణన్ మరణానంతరం, వేలాయుతం అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మరికొంతమంది దేవతలను ప్రతిష్ఠింపజేవాడు. కొంతకాలం తరువాత దేవాలయానికి "శ్రీ శివ-కృష్ణ దేవాలయం" అని పేరు పెట్టారు.

1982లో, మార్సిలింగ్ రైజ్ వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి దేవాలయం మార్చబడింది. ఇక్కడి భూమి వైశాల్యం దాదాపు 25000 చదరపు అడుగులు. 1982 నుండి 1987 వరకు వివిధ కమిటీలు దేవాలయ సంరక్షణను చేపట్టాయి.

1987లో కొత్త కమిటీ దేవాలయ బాధ్యతలు స్వీకరించిన వెంటనే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. 1987 డిసెంబరు 9న "దేవాలయ శంకుస్థాపన" కార్యక్రమం జరిగింది, ఆ తర్వాత దేవాలయ నిర్మాణం జరిగింది. 1996 సెప్టెంబరు 1న దేవాలయ మొదటి సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. 2008 మార్చి 23న[2] దేవాలయ రెండవ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.

దేవాలయ దేవతలు[మార్చు]

దేవాలయంలో ఈ కింది దేవతామూర్తులు ఉన్నారు.[1]

సామాజిక కార్యకలాపాలు[మార్చు]

ఇక్కడ సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. పూజలు, హోమాలు జరుగుతాయి.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు[మార్చు]