Coordinates: 9°50′36″N 78°28′51″E / 9.843300°N 78.480900°E / 9.843300; 78.480900

శివగంగై

వికీపీడియా నుండి
(శివగంగ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Sivaganga
Kingdom of ramnad
Municipality
Sivagangai
Kalayarkoil
Kalayarkoil
Nickname: 
Sivagangai Seemai
Sivaganga is located in Tamil Nadu
Sivaganga
Sivaganga
Sivaganga, Tamil Nadu
Coordinates: 9°50′36″N 78°28′51″E / 9.843300°N 78.480900°E / 9.843300; 78.480900
Country India
StateTamil Nadu
DistrictSivaganga
RegionPandya Nadu
DivisionMadurai
Government
 • Type1st grade municipality
 • BodySivagangai Municipality
 • ChairpersonMr CM. Durai Anand B.A.[1]
 • Vice ChairpersonMr V.Sekar.[2]
 • Commissioner of MunicipalityMr R.Subramanian B.COM.[3]
Area
 • Total43.28 km2 (16.71 sq mi)
Elevation
124 మీ (407 అ.)
Population
 (2011)
 • Total40,403
 • Density11,588/km2 (30,010/sq mi)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
630561, 630562
Telephone code04575
Vehicle registrationTN-63
Distance from Madurai40 kilometres (25 mi) WEST (Road)
Distance from Trichirapalli130 kilometres (81 mi) NORTH (Rail)
Distance from Rameswaram120 kilometres (75 mi) SOUTH (Rail)

శివగంగ, భారతదేశం,తమిళనాడు రాష్ట్రం,శివగంగ జిల్లాకు చెందిన ఒక నగరం.ఇది శివగంగ జిల్లాప్రధానకార్యాలయం.శివగంగ తమిళనాడులోని రాణి వేలునాచియార్ రాజ్యం.ఇది అధికారిక, వాణిజ్య ప్రయోజనాల కోసం శివగంగ జిల్లాలో ముఖ్య నగరం. దీని మారుపేరు శివగంగై సీమాయి. ఇది 16వ శతాబ్దానికి చెందిన శివగంగై కోటకు ప్రసిద్ధి చెందింది.నగరమధ్యన శివగంగై కోట ఉంది. కోట లోపల, రాజరాజేశ్వరి అమ్మన్ ఆలయం ఉంది. దానిలో అనేక అలంకరించబడిన శిల్పాలు ఉన్నాయి. సమీపంలో ప్రభుత్వ సంగ్రహశాల ఉంది. దానిలో చరిత్ర పూర్వ అవశేషాలు, సహజ చరిత్ర ప్రదర్శనలు ఉన్నాయి. ఈ నగరం మధురై నుండి 48 కిమీ (30 మైళ్లు) దూరంలో, రాష్ట్ర రాజధాని చెన్నైనుండి 449 కిమీ (279 మైళ్లు) దూరంలోఉంది.1965లో స్థాపించబడిన పురపాలకసంఘం ద్వారా శివగంగ పరిపాలన సాగుతుంది. 2011 నాటికి పురపాలక సంఘం 10.2 km2 (3.9 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పట్టణ జనాభా మొత్తం 40,403. ఈ పట్టణం వ్యవసాయం, లోహపు పనులకు, నేత పనులకు ప్రసిద్ధి చెందింది.శివగంగ పరిసరప్రాంతాల్లో గణనీయమైన ఖనిజనిక్షేపాలు ఉన్నాయి. శివగంగ శాసనసభ నియోజకవర్గం పరిధిలోఒక భాగం. పట్టణానికి రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా మార్గం. దీనికి రైలు ప్రయాణ సౌకర్య అనుసంధానం ఉంది.సమీప ఓడరేవు, వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్, తూత్తుకుడి 189 km (117 mi) దూరంలో ఉంది. శివగంగ నగరానికి సమీప విమానాశ్రయం, మధురై అంతర్జాతీయ విమానాశ్రయం, 53 km (33 mi) దూరంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

శివగంగ సముద్ర మట్టానికి102 మీటర్లు (334 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. పట్టణం ఉష్ణమండల, తడిపొడి వాతావరణం కలిగి ఉంటుంది.వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 °C or 98.6 °F ఉండగా, శీతాకాలంలో ఇది 28 °C or 82.4 °F ఉంటుంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 to 27.8 °C (75.0 to 82.0 °F) ఉంటుంది. కాలానుగుణ వాతావరణ పరిస్థితులు మధ్యస్తంగా ఉంటాయి. వాతావరణం ఏకరీతిగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల కాలంలోపట్టణం అత్యధిక వర్షపాతం పొందుతుంది. సగటువార్షిక వర్షపాతం 931 millimetres or 36.65 inches .[4]

జనాభా గణాంకాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
196115,642—    
197120,826+33.1%
198124,832+19.2%
199133,190+33.7%
200140,220+21.2%
201192,359+129.6%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం శివగంగలో 40,403 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 990 స్త్రీల లింగనిష్పత్తి ఉంది. ఇది జాతీయసగటు 929 కంటే చాలా ఎక్కువ ఉంది [5] మొత్తం జనాభాలో 3,880 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో 1,985 మంది పురుషులు ఉండగా, 1,895 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 9.59% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.07% మంది ఉన్నారు. పట్టణ సగటుఅక్షరాస్యత 83.86%గా ఉంది.ఇది జాతీయ సగటు 72.99% కన్నాఎక్కువ.[5] పట్టణంలో మొత్తం 10,184 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 14,145 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 164 మంది రైతులు, 294 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు,246 మంది గృహ పరిశ్రమలుకు చెందినవారు,11,406 మంది ఇతర కార్మికులు,2,035 సన్నకారు కార్మికులు,54 సన్నకారు రైతులు,127 మంది సన్నకారు రైతులు,127మంది ఇతర వ్యవసాయ కార్మికులు,17 మంది మార్జినల్ కార్మికులు,16 మంది ఇతర కార్మికులు ఉన్నారు.[6] 1991, 2001 దశాబ్దాలలో శివగంగ పట్టణం 25% వృద్ధిని సాధించింది. పట్టణం జనాభా సాంద్రత 1981, 1991, 2001 దశాబ్దాలలో దాదాపు రెట్టింపు అయింది. 6.970 km2 (697.0 ha) వైశాల్యంలో విస్తరించి ఉంది.జన సాంద్రత 1981లో కిమీ 2కి 3500 మంది నుండి, 1991లో కిమీ 2కి 4,800 మందికి పెరిగింది. అభివృద్ధి ఎక్కువగా పట్టణ ప్రాంతం అంతటా కేంద్రీకృతమై ఉంది.[7]

2011 మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, శివగంగలో 84.75% హిందువులు, 10.07% ముస్లింలు,4.66% క్రైస్తవులు,0.02% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.49% ఇతర మతాలను అనుసరిస్తున్నారు.[8]

పరిపాలన[మార్చు]

శివగంగ శివగంగ జిల్లాకు జిల్లాకేంద్రంగా ఉంది. దీనికి ఈశాన్యంలో పుదుక్కోట్టై జిల్లా, ఉత్తరాన తిరుచిరాపల్లి జిల్లా, ఆగ్నేయంలో రామనాథపురం జిల్లా, నైరుతిలో విరుదునగర్ జిల్లా, పశ్చిమాన మధురై జిల్లా సరిహద్దులుగాఉన్నాయి. శివగంగ జిల్లా 1984 జూలైలో పూర్వ రామ్‌నాడ్ జిల్లా నుండి వేరు చేయబడింది.శివగంగ జిల్లా కోర్టులు పట్టణంలో ఉన్నాయి.ఈ న్యాయస్థానాలు రాష్ట్రంలోని మద్రాసు ఉన్నత న్యాయ స్థానం (మధురై బెంచ్) పరిపాలనా, న్యాయనియంత్రణలో ఉన్నాయి.[9]

రవాణా[మార్చు]

త్రోవ మార్గం

రాష్ట్ర రవాణా సంస్థ శివగంగై బస్టాండ్ నుండి అన్ని సుదూరప్రాంతాలకు బస్సులను నడుపుతోంది.

రైలు మార్గం

శివగంగ రైల్వే స్టేషన్ పట్టణానికి తూర్పు వైపున ఉంది.ఇక్కడ తిరుచ్చి-రామేశ్వరం రైల్వే లైన్ కలుస్తుంది. ఇది దక్షిణ జిల్లాల రైళ్లు చెన్నై ఎగ్మోర్ చేరుకోవడానికి విరుదునగర్ నుండి తిరుచిరాపల్లి కూడలి వరకు గార్డ్ లైన్‌గా పనిచేస్తోంది. గూడ్స్ సర్వీస్ కోసం పనిచేస్తుంది. మెయిన్ లైన్‌లో రద్దీ విరుదునగర్, మదురై కూడలి, దిండిగల్, తిరుచ్చి ఉన్నాయి.[10]

వాయు మార్గం

నగరం నుండి సమీప విమానాశ్రయం మధురై అంతర్జాతీయ విమానాశ్రయం 40 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుండి చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి విదేశాలకు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది.

విద్య[మార్చు]

ప్రభుత్వ శివగంగై వైద్య కళాశాల, ఆసుపత్రి తమిళనాడులోని శివగంగై పురపాలక సంఘ శివార్లలో ఉన్న ఒక విద్యా సంస్థ. నగరంలో మన్నార్ దురై సింగం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, విక్రమ్ ఇంజనీరింగ్ కళాశాల, పాండియన్ సరస్వతి యాదవ్ ఇంజనీరింగ్ కళాశాల, మైఖేల్ ఇంజనీరింగ్ కళాశాల,పన్నై ఇంజనీరింగ్ కళాశాల వంటి అనేక కళాశాలలు ఉన్నాయి. ప్రిస్ట్ యూనివర్సిటీ (మదురై క్యాంబస్) నగరం నుండి 15 కిమీ దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. Sivagangai Municipality, Commissioner. "Sivagangai Municipal Council". Department Of Municipal Administration And Water Supply. Archived from the original on 2013-02-17. Retrieved 2023-02-18.
  2. ":: Welcome to Sivagangai Municipality ::". Archived from the original on 13 April 2013.
  3. ":: Welcome to Model Municipality ::". Archived from the original on 13 April 2013.
  4. Sivagangai Municipality, Commissioner. "Sivagangai Municipal Council". Department Of Municipal Administration And Water Supply. Archived from the original on 16 మార్చి 2014. Retrieved 31 Dec 2012.
  5. 5.0 5.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  6. "Census Info 2011 Final population totals - Sivaganga". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  7. Sivagangai Municipality, Commissioner. "Sivagangai Population details". Sivaganga Municipality. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 31 Dec 2012.
  8. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  9. "Sivaganga district court". District Courts. 2013. Retrieved 1 January 2014.
  10. [1] Archived 10 ఏప్రిల్ 2010 at the Wayback Machine

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శివగంగై&oldid=4054561" నుండి వెలికితీశారు