శివతాండవం
శివతాండవం పరమశివుడు ఒనరించిన తాండవ నృత్యం.
ఆనంద తాండవం
[మార్చు]ఒకనాడు మహాజ్ఞానియైన వ్యాఘ్రపాదుడు తిల్లైవనంలో లింగపూజలు నిర్వహించి పార్వతీసమేతుడైన ఈశ్వరుని తన తాండవ నృత్యంతో సకల భువనాలను ఆనందపరచమని అర్ధిస్తాడు. అతని శివారధనకు ప్రసన్నుడై ఋషి కోరిక తీర్చడానికై, సకల చరాచరకోటికి ఆనందానుభూతిని ప్రసాదించే నాట్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ విధంగా తిల్లైవనంలో బ్రహ్మ ముహూర్తాన శివుడు చేసిన నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు.
చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలోని చిత్ర సభా మండపంలో ఈ నృత్యాన్ని నేటికీ నిర్వహిస్తున్నారు.
ఊర్ధ్వ తాండవం
[మార్చు]నటరాజు చేసే తాండవ నృత్యాన్ని చూసి ఓర్వలేని దుర్గాదేవి ఒకనాడు కైలాసానికి వెళ్ళి శివుడు చేసే నృత్యాన్ని చూసి తక్కువగా అంచనా వేసి, అపహాస్యం చేసి తనతో నృత్యం చేసి గెలవమంటుండి. ఆ విధంగా తిల్లైవనంలో ముక్కోటి దేవతలు, ఋషిపుంగవుల సమక్షంలో రౌద్రరూపంలో చేసిన శివతాండవంలో దుర్గాదేవి ఓడిపోతుంది. ఢమరుకం కింకిణీరవాల కనుగుణంగా శరీరాన్ని కుడిఎడమలకు వంచడం ఈ తాండవంలోని విశేషం. ఈ భంగిమలో ఎడమ చేతిని కుడి కాలి వేళ్ళకు తగిలించి నాట్యం చేయడం మరొక విశేషం.
ఇవి కూడా చూడండి
[మార్చు]గ్యాలరీ
[మార్చు]పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన s:శివతాండవము పుస్తకం కోసం ప్రముఖ చిత్రకారుడు బాపు చిత్రించిన అపూర్వ కళాఖండాలు.