శివతాండవ కావ్యం
శివతాండవం పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన సంగీత, నాట్య, సాహితీ రచన.[1] ఈ కావ్యంలోని వస్తువు చిదంబరంలోని నటరాజు ఆలయంలో చూసిన శివతాండవ నృత్యం, పాల్కురికి సోమనాథుని శివ స్తుతులు. ఇది కన్నడ శివకవుల రగడల్లో వాడిన ఛందస్సును అనుసరించింది. ఇందులో లయ ప్రధానంగా ఉంటుంది. ఈ కావ్యం జర్మన్, హిందీ భాషల్లోకి కూడా అనువదించబడింది.
రచయిత
[మార్చు]ఈ కావ్య రచన చేసేటపుడు రచయిత ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో నలభై రోజుల పాటు 108 ప్రదక్షిణలు చేశాడు. ఈ గ్రంథం కోసం రచయిత తమిళం నేర్చుకుని అందులోని శివస్తుతులను అర్థం చేసుకున్నాడు.[2] రచయితకు తన రచనల్లో కల్లా అత్యంత ఖ్యాతి తెచ్చినది ఈ పుస్తకమే.[3][4]
శివతాండవాన్ని వర్ణించే ఒక పద్యం
[మార్చు]కిసలయజటాచ్ఛటలు ముసురుకొని వ్రేలాడ
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండలచకాచకలు చెక్కులఁ బూయ
అకలంక కంఠహారాళి నృత్యము సేయ
శృంఖలారుండములు చెలగి తాండవమాడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయ
మూలాలు
[మార్చు]- ↑ "సరస్వతీ పుత్రుడు | Puttaparthi Narayanacharyulu 105th Birth Anniversary | Sakshi". www.sakshi.com. Retrieved 2025-02-24.
- ↑ "పుట్టపర్తివారి "శివతాండవం" లో నాకు నచ్చిన పదాలు, పాదాలు – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 2025-02-24.
- ↑ "Puttaparthi Narayanacharyulu: విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ". EENADU. Retrieved 2025-02-24.
- ↑ ABN (2021-03-29). "మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు". Andhrajyothy Telugu News. Retrieved 2025-02-24.
