Jump to content

శివనాథ్ సింగ్

వికీపీడియా నుండి
శివనాథ్ సింగ్
Personal information
Born(1946-07-11)1946 జూలై 11
మజారియా, బక్సర్, భారతదేశం
Died2003 జూన్ 6(2003-06-06) (వయసు: 56)
జంషెడ్‌పూర్, భారతదేశం
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event(s)5000 మీటర్లు,[10000 మీటర్లు, మారథాన్
Achievements and titles
Personal best(s)10000 మీ: 28:58.1 (1978)[1]
మారథాన్: 2:12:00 (1978)జాతీయ రికార్డు
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Silver medal – second place1973 మారికినా5000 మీ
Silver medal – second place1973 మారికినా10,000 మీ
Silver medal – second place1975 సియోల్5000 మీ
Silver medal – second place1975 సియోల్10,000 మీ

శివనాథ్ సింగ్ (జూలై 11,1946-జూన్ 6,2003) భారతదేశం సృష్టించిన గొప్ప సుదూర రన్నర్లలో ఒకడు. సింగ్ ఆసియా క్రీడలలో రెండుసార్లు, వేసవి ఒలింపిక్స్లలో రెండుసార్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు భారతదేశంలోని బీహార్ బక్సర్ మజరియాలో జన్మించాడు.[2] ఇతడు భారత సైన్యం లోని బీహార్ రెజిమెంట్ లో చేరి, నాయక్ సుబేదార్ హోదాకు ఎదిగాడు.[2] ఇతడు సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ 2003 జూన్ 6న భారతదేశంలోని జంషెడ్పూర్లో మరణించాడు. అతను 1978లో మారథాన్ లో నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ భారతదేశ జాతీయ రికార్డుగా ఉంది.[3] ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన భారత అథ్లెటిక్స్ రికార్డు.

క్రీడా జీవితం

[మార్చు]

శివనాథ్ సింగ్ 1976 వేసవి ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ క్రీడలలో పురుషుల మారథాన్‌లో 11వ స్థానంలో నిలిచాడు.

ఇతడు తన రన్నింగ్ కెరీర్ మొత్తంలో చెప్పులు లేకుండా పోటీలో పాల్గొన్నాడు.[4] ఇతడు 1978లో జలంధర్ సాధించిన ఉత్తమ సమయంతో భారత జాతీయ మారథాన్ రికార్డును కలిగి ఉన్నాడు.

విజయాలు

[మార్చు]
సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1973ఆసియా ఛాంపియన్షిప్స్మారికినా, ఫిలిప్పీన్స్2వ5000 మీ14:17.0
1973ఆసియా ఛాంపియన్షిప్స్మారికినా, ఫిలిప్పీన్స్2వ10000 మీ29:54.8
1975ఆసియా ఛాంపియన్షిప్స్సియోల్, దక్షిణ కొరియా2వ5000 మీ14:01.2
1975ఆసియా ఛాంపియన్షిప్స్సియోల్, దక్షిణ కొరియా2వ10000 మీ29:14.6
1976ఒలింపిక్ క్రీడలుమాంట్రియల్, కెనడా11వమారథాన్2:16:22
1978జలంధర్ మారథాన్జలంధర్, భారతదేశం1వ
(జాతీయ రికార్డ్)
మారథాన్2:12:00[5]
1980ఒలింపిక్ క్రీడలుమాస్కో, సోవియట్ యూనియన్మారథాన్DNF

మూలాలు

[మార్చు]
  1. శివనాథ్ సింగ్ at World Athletics
  2. 1 2 "Remembering Shivnath Singh, India's Greatest Marathon Runner". The Wire. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-05-08.
  3. "Shivnath Singh was a brave runner with a heart of gold". The Times of India. TOI. 7 June 2003. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2018.
  4. "Shivnath Singh was a brave runner with a heart of gold". The Times of India. TOI. 7 June 2003. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2018.
  5. "Shivnath Singh: India's lion-hearted runner". www.sportskeeda.com. sportskeeda. 5 March 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2018.