శివయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శివయ్య
దర్శకత్వం ఆర్. సురేష్ వర్మ
నిర్మాత దగ్గుబాటి రామానాయుడు
నటులు డా. రాజశేఖర్ ,
మోనిక బేడి
సంగీతం ఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ సంస్థ
విడుదల
1998
భాష తెలుగు

శివయ్య 1998 లో ఆర్. సురేష్ వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రాజశేఖర్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఎం. ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరరచన చేసింది.[2]

కథ[మార్చు]

శివయ్య తన చెల్లెలి చదువు కోసం పల్లెటూరి నుండి పట్నం వస్తాడు. పక్కనే ఉన్న మిఠాయి అంగడి యజమాని కూతురైన శిరీష శివయ్యను ప్రేమిస్తుంటుంది. స్థానిక మార్కెట్ అక్కడ ఉన్న లోకల్ గూండాలైన జ్యోతి, అతని తమ్ముడు పూర్ణ చెప్పు చేతల్లో నడుస్తుంటుంది. అక్కడి వారి బాగు కోసం శివయ్య వారితో తలపడి ఎదిరిస్తాడు. కానీ తనను నమ్మిన వాళ్ళే మోసం చేయడంతో శివయ్య ప్రత్యర్థుల చేతిలో దారుణంగా దెబ్బతింటాడు. అతని చెల్లెల్ని గూండాలు అందరూ చూస్తుండగా మానభంగం చేస్తాడు.

ఇంతలో అక్కడికి రోజా అనే పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి శివయ్య గతాన్ని గురించి చెబుతుంది. తన కుటుంబ గౌరవం కాపాడ్డం కోసం తన ప్రేమించిన అమ్మాయిని ఎలా వదులుకున్నదీ చెబుతుంది. చివరికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి కోర్టులో గూండాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి వారికి శిక్ష పడేలా చూడ్డంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఎం. ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి స్వరరచన చేసింది.

  • మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది
  • నడిచే దేవుడు
  • ఓ రంగనాథా
  • ప్రేమనగరు వాణిశ్రీలా ఉంటే
  • ఎక్కడుందిరా ఆ చట్టం

మూలాలు[మార్చు]

  1. "శివయ్య సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 15 November 2017. 
  2. "శివయ్య పాటలు". naasongs.com. Retrieved 15 November 2017. 
"https://te.wikipedia.org/w/index.php?title=శివయ్య&oldid=2259865" నుండి వెలికితీశారు