Jump to content

శివరంజని (సినిమా)

వికీపీడియా నుండి
శివరంజని
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం హరిప్రసాద్,
జయసుధ,
సుభాషిణి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిల్మ్స్
భాష తెలుగు

శివరంజని దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం వహించగా, తారకప్రభు ఫిల్మ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలన చిత్రం.

నటీనటులు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

కథాంశం అభివృద్ధి

[మార్చు]

ఈ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావే సినిమాకు కథ, మాటలు, చిత్రానువాదం కూడా రాశారు. దాసరి నారాయణరావు స్వర్గం నరకం సినిమా పూర్తయ్యి, స్వర్గ్ నరక్ గా దానిని హిందీలో పునర్నిర్మించేనాటికి శివరంజని సినిమా కథా బీజాన్ని సింగిల్ లైన్ ఆర్డర్ గా అభివృద్ధి చేశారు. స్వర్గ్ నరక్ సినిమా చిత్రీకరణ సమయంలో కొంత ఖాళీ సమయం దొరకగా, సహాయకుడు ధవళ సత్యంతో శివరంజని సినిమా సీన్లు వినిపించగా, అక్కడికక్కడే సినిమా డైలాగులు ఆశువుగా చెప్తూ పూర్తిచేశారు. దాసరి శివరంజని సినిమా సంభాషణలు అదే గదిలో 3 గంటల్లో పూర్తిచేశారు.[1]

పాటలు

[మార్చు]
  • "అభినవ తారవో నా అభిమాన తారవో" (రచన: సి. నారాయణరెడ్డి; గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • "చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూచాడమ్మా" – పి. సుశీల
  • "జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా" – పి. సుశీల
  • "మా పల్లెవాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటెపనులకొచ్చావా", రచన: దాశం గోపాలకృష్ణ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ పి శైలజ
  • "మీ అమ్మవాడు నాకోసం ఈనివుంటాడే" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • "నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు" (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  • "పాలకొల్లు సంతలోనా పాపాయమ్మో పాపాయమ్మో" (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)

మూలాలు

[మార్చు]
  1. అన్విత (1 July 2017). చెరుకూరి, రామోజీరావు (ed.). "వందనం ఆ అక్షరానికి అభివందనం". తెలుగు వెలుగు. 5 (11). హైదరాబాద్: రామోజీ ఫౌండేషన్: 25.