Jump to content

శివరామకృష్ణ చంద్రశేఖర్

వికీపీడియా నుండి

శివరామకృష్ణ చంద్రశేఖర్
జననం(1930-08-06)1930 ఆగస్టు 6
కలకత్తా, బ్రిటిష్ ఇండియా
మరణం2004 మార్చి 8(2004-03-08) (వయసు: 73)
బెంగళూరు, భారతదేశం
వృత్తిసంస్థలుమైసూరు విశ్వవిద్యాలయం, రామన్ పరిశోధనా సంస్థ
చదువుకున్న సంస్థలునాగ్‌పూర్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిద్రవ స్ఫటికాలు (Liquid Crystals)
ముఖ్యమైన పురస్కారాలురాయల్ మెడల్ (1994)
ఎరింగెన్ మెడల్ (1996)

శివరామకృష్ణ చంద్రశేఖర్ FNA, FRS (6 ఆగస్టు 1930 – 8 మార్చి 2004)[1] భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ద్రవ స్ఫటికాల (Liquid Crystals) రంగంలో చేసిన విప్లవాత్మక పరిశోధనలకుగాను 1994లో రాయల్ మెడల్ను అందుకున్నారు.[2] అంతర్జాతీయ ద్రవ స్ఫటికాల సంఘం (International Liquid Crystal Society) స్థాపక అధ్యక్షుడు కూడా ఆయనే.[3]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

శివరామకృష్ణ చంద్రశేఖర్ 1930 ఆగస్టు 6న కలకత్తాలో జన్మించారు. ఆయన తల్లి సీతాలక్ష్మి భారతీయ శాస్త్రవేత్త సి.వి. రామన్ గారి సోదరి. తండ్రి శివరామకృష్ణన్ ఇండియన్ అకౌంట్స్ సర్వీస్ అధికారి.

1951లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో మొదటి ర్యాంకుతో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. తదనంతరం బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థలో తన మామ సి.వి. రామన్ మార్గదర్శకత్వంలో డాక్టరేట్ చేశారు. 1954లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి డీఎస్సీ పట్టా పొందారు.

ఆపై 1851 ఎగ్జిబిషన్ స్కాలర్‌షిప్‌తో కవెండిష్ ల్యాబొరేటరీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు వెళ్లి న్యూట్రాన్, ఎక్స్-రే విక్షేపణపై పరిశోధనలకుగాను రెండవ డాక్టరేట్ సాధించారు.

పరిశోధన

[మార్చు]

1961లో భారతదేశానికి తిరిగి వచ్చి మైసూరు విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగానికి తొలి అధిపతిగా నియమితులయ్యారు. ఇక్కడే ఆయన ద్రవ స్ఫటికాలపై పరిశోధన ప్రారంభించారు.

ద్రవ స్ఫటికాల ఆప్టికల్ లక్షణాలు, కొలెస్టరిక్, నెమాటిక్ దశలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 1971లో భారత ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక శాఖ మద్దతుతో రామన్ పరిశోధనా సంస్థలో ద్రవ స్ఫటికాల ప్రయోగశాలను స్థాపించారు.

ఈ ప్రయోగశాల ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సహకారంతో భారతదేశంలో స్వదేశీ LCD సాంకేతికత అభివృద్ధికి ఆయన దోహదపడ్డారు.

కాలమ్నార్ దశ ఆవిష్కరణ

[మార్చు]

1977లో శివరామకృష్ణ చంద్రశేఖర్, ఆయన సహచరులు డిస్క్ ఆకార అణువులతో ఏర్పడే కాలమ్నార్ దశను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ద్రవ స్ఫటికాల రంగంలో మైలురాయిగా నిలిచింది. ఈ పరిశోధన పత్రం ప్రమాణ పత్రికలో ప్రచురించబడి అత్యధికంగా ఉల్లేఖించబడిన రచనలలో ఒకటిగా నిలిచింది.

ప్రచురణలు, గౌరవాలు

[మార్చు]

1977లో ఆయన రచించిన Liquid Crystals గ్రంథాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ గ్రంథం రష్యన్, జపనీస్ భాషలలోకి అనువదించబడింది.

ఆయనకు లభించిన ముఖ్య గౌరవాలు:

  • భట్నాగర్ అవార్డు (1972)
  • హోమీ భాభా మెడల్ (1987)
  • మేఘనాద్ సహా మెడల్ (1992)
  • రాయల్ మెడల్ – రాయల్ సొసైటీ (1994)
  • నీల్స్ బోర్ అంతర్జాతీయ స్వర్ణ పతకం – యునెస్కో (1998)
  • పద్మభూషణ్ (1998)[4]
  • ఫ్రాన్స్ ప్రభుత్వము అందించిన Order of Academic Palms గౌరవం (1999)

భారతదేశాన్ని ద్రవ స్ఫటికాల రంగంలో ప్రపంచ పటంపై నిలిపిన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు.

మూలాలు

[మార్చు]
  1. Gray, G. W.; Luckhurst, G. R.; Raynes, E. P. (2007). "Sivaramakrishna Chandrasekhar. 6 August 1930 -- 8 March 2004: Elected FRS 1983". Biographical Memoirs of Fellows of the Royal Society. 53: 127. doi:10.1098/rsbm.2007.0015.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  2. "Royal Medal Winners".
  3. "Prof. S. Chandrashekhar dead". The Hindu. 9 మార్చి 2004.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Padma Awards" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బాహ్య లింకులు

[మార్చు]
  • Obituary: Professor Sivaramakrishna Chandrasekhar – Times Online (2004)