శివాజీ (నటుడు)
శివాజీ | |
|---|---|
| జననం | 1977 జూన్ 30 |
| వృత్తి | వ్యాఖ్యాత, నటుడు, రాజకీయ కార్యకర్త |
| భాగస్వామి | శ్వేతా గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తొడల్లుడు కూతురు)[1] |
| పిల్లలు | శ్రీ, వెంకట్ |
శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై వ్యాఖ్యాత గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరాడు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య అక్కడే యాంకర్ గా మారాడు.
కె. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా పరదేశి అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం స్టార్ 2000 కాంటెస్ట్ అనే ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో లయ, శివాజీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో కనిపించిన తరువాత మరే సినిమాలలోనూ కనిపించలేదు. కానీ ఆ షో వల్ల శివాజీ గురించి పదిమందికి తెలిసింది. దాంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా.[2] కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వై. వి. ఎస్. చౌదరి. ఆ సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర. ఆ సినిమా కోసం ఆయన మొట్టమొదటి సారిగా విమానమెక్కి విదేశం (దుబాయ్) వెళ్ళాడు.
స్వతహాగా చిరంజీవి అభిమానియైన శివాజీ ఆయన్ను కలవాలని ఆశగా ఉండేది. ఆ కోరిక మాస్టర్ సినిమాతో తీరింది. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని వినమ్రంగా చెబుతాడు శివాజీ. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్ర రూపంలో అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతాడు. సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగతి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.
రాజకీయాల్లో
[మార్చు]భారతీయ జనతా పార్టీలో చేరడంతో శివాజీ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించేందుకు కృషి చేసాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించాడు. హోదా ఇవ్వనందుకు తన స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు.[3] తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసాడు.
2018 మార్చి 22న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారతదేశంలో విస్తరించేందుకు గాను, "ఆపరేషన్ ద్రవిడ" అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో "ఆపరేషన్ గరుడ"ను నిర్వహిస్తోందనీ చెప్పాడు.[4][5]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర(లు) | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 1997 | మాస్టర్ | శివాజీ | ||
| 1998 | శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి | శివాజీ | ||
| ప్రేమంటే ఇదేరా | శివాజీ | |||
| 1999 | ఫిల్మ్ నగర్ | |||
| 2000 | యువరాజు | శివాజీ | ||
| బ్రహ్మచారులు | బాలు | |||
| కళాశాల | సూరి | |||
| 2001 | ప్రియమైన నీకు | రఘు | ||
| కుషీ | బాబు | |||
| భార్య | శంకర్ | |||
| చిరంజీవులు | చంటి | |||
| స్నేహితుడు | బాలు | |||
| 2002 | ఫ్రెండ్స్ | |||
| ప్రియనేస్తమా | కిరణ్ | |||
| చంద్రవంశం | ||||
| స్నేహితులు | బాలు | |||
| మనసుంటే చాలు | విశాఖ | |||
| సందడే సందడి | కామేష్ | |||
| అద్రుష్టం | పవన్ | |||
| ఇంద్ర | గిరి / వీర మనోహర్ రెడ్డి | |||
| శివ రామరాజు | రాజు | |||
| 2003 | ఒట్టేసి చెపుతున్నా | దిలీప్ | ||
| ఆయుధం | రుషేంద్ర | |||
| ఆడంటే అదో రకం | కృష్ణుడు | |||
| శ్రీరామచంద్రులు | చంద్ర | |||
| మిస్సమ్మ | నంద గోపాల్ | |||
| 2004 | అమ్మాయి బాగుంది | శివ | ||
| శ్రీ & శ్రీమతి శైలజా కృష్ణమూర్తి | కృష్ణమూర్తి | |||
| స్వరాభిషేకం | చందు | |||
| కొంచెం టచ్లో వుంటే చెప్తాను | కాళిదాసు | |||
| 2005 | మిస్టర్ ఎర్రబాబు | ఎర్రా బాబూ | ||
| అదిరిందయ్య చంద్రం | చంద్రం | |||
| 2006 | అయ్యప్ప దీక్ష | |||
| సీతారాముడు | సీతారాముడు | |||
| టాటా బిర్లా మధ్యలో లైలా | టాటా | |||
| రారాజు | సూర్య | |||
| 2007 | ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి | |||
| సత్యభామ | కృష్ణ కుమార్ | |||
| నీ నవ్వే చాలు | మురళీ కృష్ణ | |||
| తులసి | హర్ష | |||
| భజంత్రీలు | ||||
| స్టేట్ రౌడీ | రాంబాబు | |||
| మంత్ర | శివాజీ | |||
| 2008 | పెళ్లికాని ప్రసాద్ | శివ ప్రసాద్ | ||
| జల్సా | రఘు | |||
| బ్రహ్మానందం డ్రామా కంపెనీ | వాసు | |||
| మా ఆయన చంటి పిల్లాడు | బుల్లబ్బాయి | |||
| ఆలయం | రాజా | |||
| కౌసల్యా సుప్రజా రామ | రవి | |||
| కుబేరులు | శివ ప్రసాద్ | |||
| 2009 | మస్త్ | శివ | ||
| ఇందుమతి | చందు | |||
| సత్యమేవ జయతే | ప్రతాప్ | |||
| నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ | సంజయ్ శాస్త్రి | |||
| 18, 20 లవ్ స్టోరీ | బుల్లన్న | |||
| డైరీ | వంశీ | |||
| 2010 | ఆకాశ రామన్న | జై | ||
| తాజ్ మహల్ | అజయ్ / కుమార్ | నిర్మాత కూడా | ||
| బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం | శీను | |||
| 2011 | లోకమే కొత్తగా | రాహుల్ | ||
| ముగ్గురూ | అతిధి పాత్ర | |||
| ఏమైంది నాలో | మురళి | |||
| 2012 | అయ్యారే | వెంకటేశం | ||
| ఎం బాబు లడ్డు కావాలా | ||||
| 2013 | దాసు తిరిగింది | |||
| పవిత్ర | శివ | [6] | ||
| గోల గోల | ||||
| 2014 | కమలతో నా ప్రయాణం | సూర్యనారాయణ | ||
| బూచమ్మ బూచోడు | కార్తీక్ | [7] | ||
| చూసినోడికి చూసినంత | ||||
| 2015 | దొరకడు | |||
| 2016 | సీసా | |||
| 2024 | కూర్మనాయకి | [8] | ||
| 2025 | కోర్ట్ | మంగపతి | [9] | |
| దండోరా | శివాజీ | |||
| 2026 | సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని | నిర్మాత కూడా |
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా
[మార్చు]| సంవత్సరం | సినిమా | నటుడు | గమనికలు |
|---|---|---|---|
| 2002 | జయం | నితిన్ | |
| 2002 | సొంతం | ఆర్యన్ రాజేష్ | |
| 2003 | దిల్ | నితిన్ | ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు |
| 2003 | సంబరం | నితిన్ | |
| 2008 | ఉల్లాసంగ ఉత్సాహంగా | యశో సాగర్ | |
| 2012 | పిజ్జా | విజయ్ సేతుపతి | తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | ఛానెల్ | భాష | పాత్ర | గమనికలు |
|---|---|---|---|---|---|
| 2018 | గ్యాంగ్‌స్టార్స్ | అమెజాన్ వీడియో | తెలుగు | సీఐ ఆంజనేయులు | వెబ్ సిరీస్ |
| 2023 | బిగ్ బాస్ 7 | స్టార్ మా | తెలుగు | పోటీదారు | రియాలిటీ షో |
| 2023 | నైంటీస్ | ETV విన్ | తెలుగు | శేఖర్ | వెబ్ సిరీస్[10] |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (12 November 2023). "'మేము ఇలా ఉన్నామంటే మీరూ, చిరంజీవిగారే కారణం': శివాజీ సతీమణి". the original నుండి 12 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2023.
- ↑ మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా
- ↑ "Sivaji on hunger strike for Andhra Pradesh's special status". 14 May 2015. ఒరిజినల్ నుండి 8 మే 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2018.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "సంచలన విషయాలు బయట పెట్టిన శివాజీ." 22 March 2018. ఒరిజినల్ నుండి 22 మార్చి 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2018.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "శివాజీ చెప్పిన సినిమా స్టోరీ". 23 March 2018. ఒరిజినల్ నుండి 10 ఏప్రిల్ 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2018.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. the original నుండి 14 అక్టోబరు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 జూలై 2019.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 August 2020.
- ↑ Chitrajyothy (29 June 2024). "'కూర్మనాయకి'లో శివన్నగా శివాజీ.. లుక్ అదిరింది". the original నుండి 29 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 June 2024.
- ↑ "విలన్ గా హీరో శివాజీ.. 14 ఏళ్ళు జైలు శిక్ష తప్పదా.?". V6 Velugu. 7 March 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
- ↑ Zee News Telugu (5 October 2023). "వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ శివాజీ.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్." (in ఇంగ్లీష్). the original నుండి 12 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2023.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివాజీ పేజీ