Jump to content

శివ్‌పురి

అక్షాంశ రేఖాంశాలు: 25°26′N 77°39′E / 25.43°N 77.65°E / 25.43; 77.65
వికీపీడియా నుండి
శివ్‌పురి
పట్టణం
శివ్‌పురి
శివ్‌పురి
శివ్‌పురి is located in Madhya Pradesh
శివ్‌పురి
శివ్‌పురి
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°26′N 77°39′E / 25.43°N 77.65°E / 25.43; 77.65
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాశివ్‌పురి
Elevation
468 మీ (1,535 అ.)
జనాభా
 (2011)
 • Total1,79,977
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
473551
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-33

శివ్‌పురి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పురి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. మునిసిపాలిటీ . ఇది వాయవ్య మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ డివిజన్లో భాగం. ఇది సముద్ర మట్టం నుండి 462 మీటర్ల ఎత్తున ఉంది..

భౌగోళికం

[మార్చు]

శివ్‌పురి సుమారు 25.43 ° ఉత్తర అక్షాంశం, 77.65 ° తూర్పు రేఖాంశం వద్ద ఉంది. [1] పట్టణం గ్వాలియర్కు దక్షిణాన 120 కిమీ, ఝాన్సీకి పశ్చిమాన 96 కిమీ దూరంలో ఉంది. శివ్‌పురి సముద్ర మట్టం నుండి 462 మీ. ఎత్తున ఉంది. [2]

వాతావరణం

[మార్చు]

భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల మాదిరిగానే శివ్‌పురిలో కూడా ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది, ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన ఋతువులు - వేడి వేసవి, వర్షాకాలం, చల్లని శీతాకాలం - ఉంటాయి. [3]

వేసవి

[మార్చు]

శివ్‌పురిలో వేసవి ఏప్రిల్‌లో వచ్చి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో శివ్‌పురి సగటు 40°C తో వేడిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30°C చుట్టూ ఉంటుంది. మేలో సగటు అధిక ఉష్ణోగ్రత 43°C కు చేరుకుంటుంది. ఇదే అత్యంత వేడిగా ఉండే నెల. [3]

వర్షాకాలం

[మార్చు]

వర్షాకాలం, జూలై-సెప్టెంబరు నెలల్లో ఉంటుంది. సగటున 34°C గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. కనిష్టంగా 20 - 24°C మధ్య ఉంటుంది. [3]

శీతాకాలం

[మార్చు]

శీతాకాలపు చల్లగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఋతువు, నవంబరు నుండి మార్చి వరకు ఉంటుంది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14°C తో కొంత చల్లగా ఉంటుంది. అయితే ఇది కనిష్ట ఉష్ణోగ్రత 6°C వరలు పడిపోతూ ఉంటుంది. [3]

మూలాలు

[మార్చు]