శివ్ శంకర్
శివ్ శంకర్ | |
---|---|
దర్శకత్వం | కాపుగంటి రాజేంద్ర |
స్క్రీన్ ప్లే | సత్యానంద్ |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 18 ఆగస్టు 2004 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివ్ శంకర్, 2004 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానరులో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, బ్రహానందం, ఆలీ తదితరులు నటించగా ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. ఇది సౌందర్య నటించిన చివరి తెలుగు సినిమా. 2002లో వచ్చిన రోడ్ టు పెర్డిషన్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సమర్పించాడు.[1]
నటవర్గం
[మార్చు]- మోహన్ బాబు (శివ్ శంకర్/శివాజీ)
- సౌందర్య (పద్మ)
- నాతన్యా సింగ్
- రజా మురద్ (హేమాద్రి)
- రియాజ్ ఖాన్
- జయప్రకాశ్ రెడ్డి
- పొన్నబలం
- మోహన్ రాజ్
- ఆహుతి ప్రసాద్ (కారు డ్రైవరు)
- బ్రహ్మానందం
- ఆలీ (హోటల్ యజమాని)
- ఎల్.బి. శ్రీరామ్
- వేణుమాధవ్
- ఎ.వి.ఎస్.
- గణేష్
- రఘునాథ రెడ్డి
- అనంత్
- చిట్టిబాబు
- జివి
- రఘుబాబు
- అభినయశ్రీ
- మాస్టర్ అభినవ్
- మాస్టర్ వంశీ
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు.[2] 2004, జూలై 31న అన్నపూర్ణ స్టూడియోలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు.[3]
- జాబిలమ్మ ఊగుతున్నది - శ్రేయ ఘోషాల్, టిప్పు
- కృష్ణ నువు రాకు - కె. ఎస్. చిత్ర, హరిహరన్
- నేనేమి చేతును - మాలతి లక్ష్మణ్
- ఏందిరయ్యో - స్వర్ణలత, టిప్పు
- నీటిమీదే కాగితాన - హరిహరన్
విడుదల
[మార్చు]ఐడెల్ బ్రేన్ ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమాలో మోహన్ బాబు నటన, ఇళయరాజా సంగీతం బాగున్నాయి. పాత-కాల కథనం తీసుకోవడం ఈ సినిమాలోని లోపం అని పేర్కొన్నది".[1] ఫుల్ హైదరాబాద్ ఈ సినిమాకు మిశ్రమ రివ్యూ ఇచ్చింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 http://www.idlebrain.com/movie/archive/mr-shivshankar.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-22. Retrieved 2021-05-22.
- ↑ http://www.idlebrain.com/news/functions/audio-shivshankar.html
- ↑ https://movies.fullhyderabad.com/shiv-shankar/telugu/shiv-shankar-movie-reviews-1499-2.html
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2004 తెలుగు సినిమాలు
- ఇళయరాజా సంగీతం అందించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- సౌందర్య నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు