శివ చరణ్ గోయల్
| శివ చరణ్ గోయల్ | |||
| |||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 10 – 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | సుభాష్ సచ్‌దేవా | ||
|---|---|---|---|
| తరువాత | హరీష్ ఖురానా | ||
| నియోజకవర్గం | మోతీ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1962 ఫిబ్రవరి 6 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శివ చరణ్ గోయల్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శివ్ చరణ్ గోయెల్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ సచ్‌దేవాపై 15,221 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ సచ్‌దేవాపై 14,072 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
శివ్ చరణ్ గోయెల్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరీష్ ఖురానాపై 11,657 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Moti Nagar Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Moti Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.