శివ చరణ్ లాల్ గుప్తా
| శివ చరణ్ లాల్ గుప్తా | |||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| తరువాత | దినేష్ మోహనియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సంగం విహార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శివ చరణ్ లాల్ గుప్తా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సంగం విహార్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శివ చరణ్ లాల్ గుప్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సంగం విహార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అమోద్ కుమార్ కాంత్ పై 3,589 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి దినేష్ మోహనియా చేతిలో 777 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
శివ చరణ్ లాల్ గుప్తా 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సంగం విహార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి దినేష్ మోహనియా చేతిలో 43,988 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయనకు 2020 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన జేడీ (యూ) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి దినేష్ మోహనియా చేతిలో 42,522 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "2008 Delhi AssemblyResults". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 March 2025.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ "Sangam Vihar Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. the original నుండి 20 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 March 2025.