శిష్ట్లా ఉమామహేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిష్ట్లా ఉమామహేశ్వరరావు చిత్రపటం.

శిష్ట్లా ఉమామహేశ్వరరావు (1912 - 1953) ప్రముఖ తెలుగు కవి.

వీరు గుంటూరు జిల్లా మంచాల గ్రామంలో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ పట్టా పొంది ఇంగ్లీషు భాషలోని నూతన కవితా పద్ధతుల్ని బాగా అవగతం చేసుకున్నారు. వీరు 'విష్ణు ధనువు', 'నవమి చిలుక' అనే రెండు ఖండ కావ్య సంపుటాలను ప్రకటించారు.

వీరు సైన్యంలో చేరి విచిత్రమైన అనుభవాలను పొంది 'సిపాయి కథలు' అను మౌలికమైన కథలను రచించారు. వీరి 'కాళింగి పాటలు' తెలుగు కవిత్వానికి నూతన అలంకారాలు.

వీరు కొంతకాలం "శాంతిని" అనే పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.