శీతల లేపనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీతల లేపనం
Jar for cold cream from the first half of the 20th century. From the Museo del Objeto del Objeto collection.

చర్మ రక్షణకు వాడే సౌందర్య సాధనాలలో శీతల లేపనం ఒకటి. ఇవి సూర్యుని వేడి నుండి, చలిగాలి నుండి, దుమ్ము ధూళి నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అంతే కాక చర్మాన్ని శుభ్రపరచి, నునుపుగా చేస్తాయి. లేపనాలు నూనె, నీటిల ఎమల్షన్లు.

లక్షణాలు

[మార్చు]

సులక్షణమైన శీతల లేపనం శరీర ఉష్ణోగ్రత వద్ద కరిగి, చర్మము అంతటా త్వరగా పరుచుకుంటుంది. అంతేకాక జిడ్డుగా ఉండదు. చర్మానికి గట్టిగా అతుక్కోదు.

సంఘటకాలు

[మార్చు]

శీతల లేపనములో ముఖ్యముగా బాదం నూనె తేనె తుట్టె నుండి లభించు మైనము గులాబీ నీరుతో పాటు కొంద సువాసన ద్రవ్యాలు కలిసి ఉంటాయి. వెన్న, ఆలివ్ నూనె ఖనిజ తైలము, లెనోనిన్ నూనె, బోరాక్స్, పారఫిన్ మైనము ల వంటి ఇతర సంఘటకాలు తగిన మోతాదులలో కలపటం వలన శీతల లేపనం యొక్క లక్షణాలలో మార్పులు చేయవచ్చు. చర్మపు స్వభావము, శీతల లేపనము ఉపయోగించే సమయము చర్మంపై లేపనము ఉండే కాల వ్యవధి మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని లేపనము యొక్క లక్షణాలలో మార్పులు చేస్తారు.

మూలాలు

[మార్చు]