శీను వాసంతి లక్ష్మి
శీను వాసంతి లక్ష్మి | |
---|---|
దర్శకత్వం | ఇ. శ్రీనివాస్ |
నిర్మాత | ఎస్. ఎం. సురేష్[1] |
తారాగణం | |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తులజాభవాని క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2004 మార్చి 24 |
శీను వాసంతి లక్ష్మి 2004 లో ఆర్. పి. పట్నాయక్ హీరోగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం.[2] ఈ సినిమాకు ఆది మూలం వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ సినిమా. ఇదే సినిమా తమిళంలో కూడా విక్రం హీరోగా కాశీ అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో కథా నాయకుడు అంధుడైన ఓ గాయకుడు.
కథ[మార్చు]
చుట్టూరా కొండలు, పచ్చదనం, సెలయేళ్ళ మధ్య ఓ అందమైన పల్లెటూరు. నది ఒడ్డునే ఓ గుడిసె. అందులో శీను (ఆర్. పి. పట్నాయక్), తండ్రి (నూతన్ ప్రసాద్), తల్లి, చెల్లెలు వాసంతి (ప్రియ) తో కలిసి నివసిస్తుంటాడు. శీను పుట్టుకతోనే అంధుడు. కానీ అతనికి అద్భుతమైన గాత్రం ఉంటుంది. వీధుల్లో, రోడ్డు పక్కన పాటలు పాడుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తండ్రి మాత్రం అతని అంధత్వాన్ని ఎప్పుడూ హేళన చేస్తుంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మాటలు రాని ఓ అమ్మాయి లక్ష్మి (నవనీత్ కౌర్) శీనును ఆరాధిస్తుంటుంది.
గ్రామంలో పెద్ద మనిషి అయిన అప్పలనాయుడు (ప్రకాష్ రాజ్), ఓ మంత్రి కొడుకును, అతని భార్యను వెంటబెట్టుకుని ఆటవిడుపు కోసం ఆ గ్రామానికి వస్తాడు. అప్పల నాయుడంటే ఆ గ్రామంలో శీనుతో సహా అందరికీ మంచి గౌరవం ఉంటుంది. శీను తల్లి కూడా వాళ్ళ భవంతిలోనే పనిమనిషిగా ఉంటుంది. అప్పలనాయుడు సాయంతో శీను ఓ కంటి వైద్యుణ్ణి కలిసి తనకు ఓ దాత, ధనం సమకూరితే తనకు చూపు వస్తుందని తెలుసుకుంటాడు. అప్పలనాయుడు శస్త్రచికిత్సకు కావలసిన ధనసహాయం చేయడానికి ముందుకు వస్తాడు. లక్ష్మి తన అమాయకత్వంతో తన ఒక కంటిని దానం చేయడానికి సిద్ధ పడుతుంది.
ఓ రోజు అప్పల నాయుడు, మంత్రి కొడుకు వాసంతి, లక్ష్మిని చూసి తమ భవనంలోకి పిలిచి వారిమీద అత్యాచారం చేస్తారు. కానీ వారు ఆ విషయం బయటికి చెబితే శీను ఆపరేషన్ ఆగిపోతుందని ఎవరికీ చెప్పరు. శీను కోసం జరిగిందంతా మరిచిపోయి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అవకాశంగా తీసుకున్న నాయుడు, మంత్రి కొడుకు వారిని మళ్ళీ బంగళాకు రమ్మని ఒత్తిడి చేస్తుంటారు. ఈ విషయాలేమీ తెలియని శీను నాయుడిని గుడ్డిగా నమ్ముతూ తన చెల్లెలి పెళ్ళి కూడా నిర్ణయిస్తాడు. చివరికి శీను అప్పలనాయుడు మోసాన్ని తెలుసుకుంటాడా, తెలుసుకుని ఏం చేస్తాడన్నది మిగతా కథ.
తారాగణం[మార్చు]
- శీనుగా ఆర్. పి. పట్నాయక్
- వాసంతిగా ప్రియ
- లక్ష్మిగా నవనీత్ కౌర్
- అప్పలనాయుడుగా ప్రకాష్ రాజ్
- శీను తండ్రిగా నూతన్ ప్రసాద్
పాటలు[మార్చు]
పాట | పాడిన వారు | రాసిన వారు |
---|---|---|
గోదారి నవ్వింది తుమ్మెద | ఆర్. పి. పట్నాయక్ | |
వాన వాన వాన | ఆర్. పి. పట్నాయక్ | |
పాడనా | ఆర్. పి. పట్నాయక్ | |
అమెరికా | ||
కోదండ రాముడు | ||
కుకూ |
మూలాలు[మార్చు]
- ↑ "శీను వాసంతి లక్ష్మి పాటలు". cineradham.com. సినీరధం. Retrieved 17 November 2016.[permanent dead link]
- ↑ "సిఫీ.కాం లో శీను వాసంతి లక్ష్మి సినిమా సమీక్ష". sify.com. సిఫీ. Retrieved 17 November 2016.
బయటి లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with permanently dead external links
- Articles with short description
- Short description is different from Wikidata
- 2004 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- ఆర్. పి. పట్నాయక్ సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన చిత్రాలు
- నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు