శీర్షాసనము
Appearance
శీర్షాసనము (సంస్కృతం: शीर्षसन) యోగాలో ఒక విధమైన ఆసనము. తలక్రిందులుగా అంటే తలను నేలపై ఆనించి కాళ్ళను పైకెత్తి చేసే ఆసనం కాబట్టి దీనికి శీర్షాసనమని పేరు వచ్చింది. ఆసనాలలోకెల్ల ఉత్తమమైనది కనుక 'రాజాసనం' అని కూడా పిలుస్తారు.
పద్ధతి
[మార్చు]- నేలపై పలుచని దూది పరుపును గాని, మెత్తని తువ్వాలును నాలుగు మడతలుగా పరచి రెండు చేతులపై బరువు మోపి తల భాగాన్ని నేలపైన ఆనించాలి.
- రెండు కాళ్లను కలిపి మెల్లగా పైకి ఎత్తాలి. నడుము చక్కగా వచ్చేవరకు కాళ్ళను నేలపైనే ఉంచి చేతులపై బరువుంచి కాళ్ళను పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు చక్కగా ఉండేటట్లు జాగ్రత్తపడాలి.
- కొద్దికాలం తరువాత మెల్లగా కాళ్ళు క్రిందికి దించాలి.
- ఈ ఆసనం తర్వాత పద్మాసనంలో విధిగా విశ్రాంతి తీసుకోవాలి.
ప్రయోజనం
[మార్చు]- తలలో ఉన్న పియూష గ్రంధి, పీనియల్ గ్రంధులను ఉత్తేజపరచి, మిగతా గ్రంధుల సామర్ధ్యాన్ని పెంచడం వల్ల దేహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- తలలోని జ్ఞానేంద్రియా లన్నింటికి రక్తప్రసారం తగిన మోతాదులో లభించడం వలన అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి.
- ఊపిరితిత్తులకు, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరుగడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
హెచ్చరిక
[మార్చు]- మొదట కళ్ళు ముసుకొని శీర్షాసనం అభ్యాసం చేయాలి. కళ్ళకు రక్తప్రసారం అధికంగా ఉండటం వలన అవి ఎర్రబడటానికి అవకాశం ఉంది.
- శరీరము యొక్క బరువు తలమీద తక్కువగా, చేతులమీద ఎక్కువగా పడేటట్లు జాగ్రత్త పడాలి. నేలపై మాడు ఆనకూడదు, నుదురు భాగం ఆనాలి.
- మొదట అర నిముషం మాత్రమే శీర్షాసనం వేయాలి. వారానికి అర నిమిషం చొప్పున పెంచుతూ నాలుగు వారాల తర్వాత రెండు నిముషాలు అభ్యాసం చేయవచ్చును.
- అలవాటు అయ్యేవరకు ఇతరుల సాయంతో గాని, గోడ ఆధారంతో గాని శీర్షాసనం వేయవచ్చును.