శీలా వీర్రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీలా వీర్రాజు కవి, చిత్రకారుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1939-04-22) 1939 ఏప్రిల్ 22 (వయసు 85)
రాజమండ్రి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
మరణం2022 జూన్ 1
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసుభద్రాదేవి
తల్లివీరబద్రమ్మ
తండ్రిశీలా సూర్యనారాయణ

శీలా వీర్రాజు (1939 ఏప్రిల్ 22 - 2022 జూన్ 1) ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త. ఆయన రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికిగాను 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. అలాగే ఆయన రచించిన పలు రచనలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ఆయన శీలావీ గా సుపరిచితుడు.

బాల్యం

[మార్చు]

1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు. డిగ్రీ వరకు విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. కళాశాల విద్య అభ్యసించే సమయంలోనే ఆయన కథలు రాయడం ప్రారంభించాడు.

కెరీర్

[మార్చు]

1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963 జులైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1990 జనవరి 31న స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.[1] యువభారతితో కలసి పనిచేసాడు. శీలా వీర్రాజు చిత్రాల ప్రదర్శనను రాజమహేంద్రవరంలోని దామెర్ల ఆర్ట్‌గ్యాలరీలో ఉంచారు.

రచనలు

[మార్చు]

కవిత్వం

  1. కొడిగట్టిన సూర్యుడు
  2. హృదయం దొరికింది
  3. మళ్ళీ వెలుగు
  4. కిటికీ కన్ను
  5. ఎర్రడబ్బా రైలు
  6. పడుగుపేకల మధ్య జీవితం
  7. శీలా వీర్రాజు కవిత్వం ( పై ఆరు కవితాసంపుటాల బృహద్గ్రంథం)
  8. బతుకు బాట
  9. ఒక అసంబద్ధ నిజం

నవలలు

  1. వెలుగు రేఖలు
  2. కాంతిపూలు
  3. మైనా
  4. కరుణించని దేవత

కథాసంపుటాలు

  1. సమాధి
  2. మబ్బుతెరలు
  3. వీర్రాజు కథలు
  4. హ్లాదిని
  5. రంగుటద్దాలు
  6. పగా మైనస్ ద్వేషం
  7. వాళ్ళ మధ్య వంతెన
  8. మనసులోని కుంచె
  9. ఊరు వీడ్కోలు చెప్పింది
  10. శీలావీర్రాజు కథలు (8 కథాసంపుటాల హార్డ్ బౌండ్)

ఇతరాలు

  1. కలానికి ఇటూ అటూ(వ్యాస సంపుటి)
  2. శిల్పరేఖ (లేపాక్షి రేఖాచిత్రాలు)
  3. శీలావీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్‌)

పురస్కారాలు

[మార్చు]
  1. 1967లో కొడిగట్టిన సూర్యుడు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డు
  2. 1969లో మైనా నవలకు ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం
  3. 1991లో శీలావీర్రాజు కథలు సంపుటానికి తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమ కథల సంపుటి బహుమతి
  4. 1994లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[2]
  5. డా. బోయి భీమన్న వచన కవితా పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)[3].

మరణం

[మార్చు]

83 ఏళ్ళ శీలా వీర్రాజు 2022 జూన్ నెల 1వ తారీకు నాడు(బుధవారం) సాయంత్రం హైదరాబాదు సరూర్‌నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనికి భార్య సుభద్ర, కూతురు పల్లవి ఉన్నారు. శీలా సుభద్రాదేవి కూడా సాహితీవేత్త.[4]

మూలాలు

[మార్చు]
  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు
  2. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  3. "నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం". Archived from the original on 2014-09-20. Retrieved 2014-09-21.
  4. "ప్రముఖ రచయిత శీలా వీర్రాజు కన్నుమూత". EENADU. Retrieved 2022-06-02.