శుక్ల పక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమావాస్య తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను(పక్షం రోజులు) శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం అని అంటారు.

ప్రతీ నెలకు రెండు పక్షాలు ఉంటాయి. అవి శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం. రెండు పక్షాలని కలిపి ఒక నెలగా పరిగణిస్తారు.

చంద్రుడు అమావాస్య తరువాతనుండి రోజుకూ ప్రవర్ధమానం చెందుతూ పౌర్ణమి రోజున పూర్తి స్థాయిగా ప్రకాశిస్తాడు. ఈ సమయాన్ని శుక్ల పక్షం అని అంటారు. ఈ సమయంలో చంద్రుడిని శుక్ల పక్ష చంద్రుడు అని అంటారు. అనగా రోజు రోజుకూ వృద్ధి చెందుతూ ఉంటాడని అర్థం.