Jump to content

శుక ఆలయం

శుక ఆలయం
మతం
అనుబంధంహిందూధర్మం
జిల్లాఖుర్దా జిల్లా
దైవంతెలియదు
ప్రదేశం
రాష్ట్రంఒడిశా
దేశంభారతదేశం
పటం
శుక ఆలయం యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్
నిర్దేశాంకాలు20°14′23.39″N 85°50′3.57″E / 20.2398306°N 85.8343250°E / 20.2398306; 85.8343250
వాస్తుశిల్పం
రకంకళింగ వాస్తు శైలి
Elevation22 m (72 ft)

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న శుక ఆలయం 13 వ శతాబ్దికి చెందిన దేవాలయం. ప్రస్తుతం ఒక పాడుబడిపోయింది. పూజాపునస్కారాలు జరగవు. సప్తరథుడికి, దిక్పాలకుల స్త్రీ ప్రతిరూపాల ఆలయం ఇది. ఒడిశా ఆలయ నిర్మాణ సంప్రదాయం పరిణతి చెందిన దశలో ఇది నిర్మించబడింది.

స్థానం

[మార్చు]
శుక ఆలయంలో రాతిపై చెక్కబడిన దేవి విగ్రహం.

శుక ఆలయం భువనేశ్వర్, ఉత్తరదరాజా బడు సాహి లోని శంకరానంద వీధిలో ఉంది. ఇది బిందుసాగర్ చెరువుకు దక్షిణాన చెరువు నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఆలయం ఉపయోగంలో లేనప్పటికీ ఆలయం బయటి గోడలపై ఉన్న శిల్పకళా అలంకరణలు మొదట్లో ఇది శివాలయమని సూచిస్తున్నాయి. ఆలయం వాస్తుశిల్పం, శిల్పకళ పరంగా బలంగా ఉన్నప్పటికీ, ఇక్కడ పూజాపునస్కారాలేమీ జరగడం లేదు. ఆలయం ప్రస్తుత నేల స్థాయి కంటే 1.80 మీటర్ల దిగువన ఉంది.

వయస్సు

[మార్చు]

ఈ ఆలయం 13వ శతాబ్దంలో, గాంగుల పాలనా కాలానికి చెందినదని అంచనా.

ఆస్తి రకం

[మార్చు]
  1. ఆవరణ/ భవనం/ నిర్మాణం/ ప్రకృతి దృశ్యం/స్థలం/ట్యాంక్: భవనం
  2. ఉప రకం: ఆలయం
  3. టైపోలాజీ: రేఖ డ్యూల్

ప్రాముఖ్యత

[మార్చు]

చారిత్రక ప్రాముఖ్యత: ఒరిస్సా ఆలయ నిర్మాణ సంప్రదాయం యొక్క పరిణతి చెందిన దశ.

భౌతిక వివరణ

[మార్చు]
  1. చుట్టుపక్కల: ఈ ఆలయం చుట్టూ తూర్పున 50 మీటర్ల దూరంలో భవానీశంకర ఆలయం, కాంపౌండ్ గోడకు కుడి వైపున శంకరానంద వీధి, ఉత్తరాన సారి దేవల్, దక్షిణాన నివాస భవనాలు ఉన్నాయి.
  2. దిశ: ఆలయం పశ్చిమం ముఖంగా ఉంది.
  3. వాస్తు లక్షణాలు (ప్లాన్, ఎలివేషన్): ప్లాన్ ప్రకారం ఈ ఆలయంలో ఒక విమానం, ముందు భాగంలో పునరుద్ధరించిన మండపం ఉన్నాయి. విమానం సప్తరథ ఆకృతిలో ఉండి, మధ్యలో ఒక రాహ ఉంటుంది. దానికి ఇరువైపులా జంటలుగా అనురాహ, అనురథ, కనిక పాగాలు అమర్చబడి ఉంటాయి. విమానం విస్తీర్ణం 5.80 చదరపు మీటర్లు, ముందు మండపం పొడవు 0.90 మీటర్లు కాగా, గర్భగృహం విస్తీర్ణం 2.40 చదరపు మీటర్లు. ఎలివేషన్ పరంగా, విమానం రేఖా శైలిలో నిర్మించబడింది. అడుగునుంచి శిఖరం వరకు దీని ఎత్తు 11 మీటర్లు. ఐదు విభాగాలుగా ఉన్న బాడా (ప్రధాన గోడ భాగం) ఎత్తు 3.50 మీటర్లు. అడుగుభాగంలో ఉన్న పాభాగ ఎత్తు 0.87 మీటర్లు ఉండి, అందులో ఖుర, కుంభ, పట, కని, బసంత అనే ఐదు మోల్డింగ్‌లు ఉన్నాయి. తాళ జంఘ, ఉపర జంఘ భాగాలు ఒక్కొక్కటి 0.72 మీటర్లు ఎత్తున ఉండి, వాటి మధ్యలో 0.32 మీటర్లు ఎత్తు కలిగిన మూడు మోల్డింగ్‌ల బంధనం ఉంటుంది. పది మోల్డింగ్‌లతో ఉన్న బరండా ఎత్తు 0.87 మీటర్లు. గండి, మస్తక భాగాల ఎత్తులు 5 మీటర్లు, 2.50 మీటర్లు.

పరిస్థితి

[మార్చు]

X & XI ఫైనాన్స్ కమిషన్ అవార్డు కింద ఒరిస్సా రాష్ట్ర పురావస్తు శాఖ మరమ్మతులు చేసింది.

అలంకార విశేషాలు

[మార్చు]

గండి పాదం వద్ద ఒక పెద్ద రేఖా అంగశిఖరం ఉంది. దాని మస్తకం, రాహ పాగాలో ఉన్న ఉద్యోత సింహాన్ని దాదాపు తాకుతూ ఉంటుంది. గండి, చైత్య ఆకృతులతో, వంపులు తిరిగిన తీగల రూపాలతో అందంగా అలంకరించబడి ఉంటుంది. రాహ పాగా, అనురథ పాగా మధ్య భాగంలో, బరండా నుంచి బేకి వరకు వరుసగా కమలాల రూపాలు ఉంటాయి.

కనిక పాగాలో ఉన్న పది భూమి–అమ్లాలు చూపించినట్లు, ఈ ఆలయం పది అంతస్తుల నిర్మాణం. ప్రతి అంతస్తుకు నాలుగు భూమి బరండాలు ఉన్నాయి. ఖుర భాగం శైలీకృత చైత్య రూపాలతో అలంకరించబడి ఉంది. పాభాగాలోని మిగతా నాలుగు పొరలపై వంపులైన తీగల అలంకరణ చెక్కబడి ఉంది. రాహ నిచ్ కింద ఖఖర శైలిలో చేసిన చిన్న గర్భగృహాల ఆకృతులు కనిపిస్తాయి. వాటికి ఇరువైపులా నాగ–నాగి ఆకారాల స్తంభాలు (పిలాస్టర్లు) ఉండి వాటిని అందంగా అలంకరిస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • భువనేశ్వర్ లోని దేవాలయాల జాబితా

మూలాలు

[మార్చు]
  1. పుస్తకం: డాక్టర్ సదాసిబా ప్రధాన్ రచించిన లెస్సర్ నోన్ మాన్యుమెంట్స్ ఆఫ్ భువనేశ్వర్
"https://te.wikipedia.org/w/index.php?title=శుక_ఆలయం&oldid=4718647" నుండి వెలికితీశారు