Jump to content

శుద్ధ్ దేశీ రొమాన్స్

వికీపీడియా నుండి
శుద్ధ్ దేశీ రొమాన్స్
దర్శకత్వంమనీష్ శర్మ
రచనజైదీప్ సాహ్ని
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంసుశాంత్ సింగ్ రాజ్‌పుత్
పరిణీతి చోప్రా
వాణి కపూర్
రిషి కపూర్
ఛాయాగ్రహణంమను ఆనంద్
కూర్పునమ్రతా రావు
సంగీతంసచిన్-జిగర్
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
6 సెప్టెంబరు 2013 (2013-09-06)
సినిమా నిడివి
127 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్est. ₹22 crore[1][2]
బాక్సాఫీసుest. ₹76 crore[3]

శుద్ధ్ దేశీ రొమాన్స్ 2013 లో విడుదల అయిన హిందీ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పరిణీతి చోప్రా, వాణీ కపూర్ నటించారు. ఈ సినిమా అంతర్జాతీయంగా ఎ ప్యూర్ దేశీ రొమాన్స్‌గా విడుదల చేయబడింది.

నటవర్గం

[మార్చు]

రఘురామ్ జైపూర్‌లో టూరిస్ట్ గైడ్. అతను పెళ్లి ఊరేగింపులలో క్యాటరర్‌గా ఉండే గోయల్ తో స్నేహం చేస్తాడు. రఘురామ్ తారాని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు పెళ్లి వాళ్లతో సహా నగరానికి బయలుదేరుతారు. పెళ్లి వాళ్లలో గాయత్రి అనే అమ్మాయి ఉంటుంది. ఆమె ఓపెన్ మైండెడ్, రఘుని బాగా ప్రభావితం చేస్తుంది. అతను ప్రయాణంలోనే గాయత్రితో ప్రేమలో పడతాడు. నగరానికి రాగానే తారని వదిలి గాయత్రితో 'లివ్ ఇన్ పార్టనర్స్' లాగా జీవించడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల తరువాత, రఘు గాయత్రిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రి అతన్ని వదిలి పారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత, రఘు విచిత్రమైన పరిస్థితుల్లో తారను మరోసారి కలుస్తాడు. ఆ తరువాత ఎం జరుగుతుంది అన్నది మిగతా కథ.

పాటలు

[మార్చు]
సంఖ్య పాట గాయకుడు(లు) నిడివి
1. తేరే మేరే బీచ్ మే[5] సునిధి చౌహాన్, మోహిత్ చౌహాన్ 4:12
2. గులాబి జిగర్ సారయ్య, ప్రియా సారయ్య 3:51
3. చంచల్ మన్ అతి రాండమ్ దివ్య కుమార్ 3:55
4. శుద్ధ్ దేశీ రొమాన్స్ బెన్నీ దయాల్, షల్మాలి ఖోల్గాడే 3:06
5. ముఝే కిస్ కర్ సక్తే హో సచిన్ - జిగర్ 2:21
6. లవ్ ఇన్ జైపూర్ సచిన్ - జిగర్ 2:04
7. తేజ్ వాలా అట్రాక్షన్ సచిన్ - జిగర్ 1:31
8. బాయ్‌ఫ్రెండ్ బనోగీ సచిన్ - జిగర్ 1:40
9. భన్వారా మా భట్కే సచిన్ - జిగర్ 1:16

మూలాలు

[మార్చు]
  1. "Shuddh Desi Romance - Movie - Box Office India". Retrieved 20 November 2016.
  2. "Zanjeer loses out to Shuddh Desi Romance on the opening day". Retrieved 9 September 2013.
  3. "Shuddh Desi Romance - Movie - Box Office India". www.boxofficeindia.com.
  4. "Parineeti Chopra and Sushant Singh Rajput shoot a new song for Shuddh Desi Romance". Bollywood Life. 2013-08-11. Retrieved 2022-05-13.
  5. "Shuddh Desi Romance title song: Sushant Singh Rajput and Parineeti Chopra's colourful chemistry is engaging!". Bollywood Life. 2013-08-19. Retrieved 2022-05-13.