శుభా ముద్గాల్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Shubha Mudgal | |
---|---|
![]() Mudgal playing the tanpura in 2006.
| |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | Shubha Gupta |
ఇతర పేర్లు | Shubha Mudgal |
జననం | 1959 (age 59–60), Allahabad, Uttar Pradesh, India |
సంగీత రీతి | Pop, folk, Indian classical, playback singing |
వృత్తి | Singer |
క్రియాశీలక సంవత్సరాలు | 1986 [1] – present |
శుభా ముద్గాల్ (జననం 1959) హిందూస్థాన్ క్లాసికల్ సంగీతం, ఖాయల్, తుమ్రి, దబ్రా మరియు ప్రముఖ భారతీయ పాప్ సంగీతంలో పేరు గాంచిన భారతీయ గాయని.
ఆమె 'అమృత్ భీజ్'కు 1996 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ నాన్-ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ డైరక్షన్ అవార్డును [2], డ్యాన్స్ ఆఫ్ ది విండ్ చలన చిత్రంలో ఆమె సంగీతానికి 34వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో[2] 1998 గోల్డ్ ప్లేక్యూ అవార్డ్ ఫర్ స్పెషల్ అచీవ్‌మెంట్ ఇన్ మ్యూజిక్ అవార్డును మరియు 2000లో పద్మశ్రీని అందుకుంది. ఆమె ANHAD [3] మరియు SAHMAT వంటి అభ్యుదయకర కార్యక్రమాలకు కూడా సన్నిహితంగా ఉంటుంది[4].
విషయ సూచిక
ప్రారంభ జీవితం[మార్చు]
స్కాంద్ మరియు జయా గుప్తాలకు ఒక పాండిత్య ప్రదర్శక కుటుంబంలో ఉత్తర ప్రదేశ్, అలహాబాద్‌లో జన్మించింది.[5] ఆమె తల్లిదండ్రులు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో క్లాసిక్ హిందూస్థాన్ సంగీతం మరియు కథక్‌ల్లో ఆసక్తి కలిగిన ఆంగ్ల సాహిత్య ప్రొఫెసర్లగా పనిచేస్తున్నారు [6]. ఆమె తండ్రి తరపున తాతయ్య ప్రొఫెసర్ P. C. గుప్తా కూడా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్‌గా పనిచేశారు.
ఆమె సెయింట్ మేరీ కాన్వెంట్ ఇంటర్ కాలేజ్‌కు హాజరైంది. ఒక చిన్న అమ్మాయి వలె, ఆమె తన చెల్లి అడుగు జాడల్లో అలహాబాద్‌లో [5] కథక్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఒకసారి ఆమె ఒక నృత్య పర్యవేక్షకుడి యొక్క సాధారణ ప్రశ్న "ఆప్ కిస్ ఘరానే కా నాట్య హై (ఏ ఘర్ (ఇల్లు/శైలి) నుండి నృత్యం నేర్చుకున్నారా?)" ఈ విధంగా చురక అంటించేది "హమ్ అప్నే ఘరానే కా నాట్య హై (నేను నా స్వంత ఘరాన్ నుండి నాట్యం చేస్తున్నాను)"[5]. తర్వాత ఆమె ఉద్యోగరీత్యా హిందూస్థాన్ క్లాసికల్ మ్యూజిక్‌కు మారింది, అయితే అదే వ్యక్తిగత ధోరణిని కొనసాగించింది. ఆమె మొట్టమొదటి సాంప్రదాయిక గురువు (గురు) అలహాబాద్‌లోని పండిట్ రామశ్రేయ జా.
ముద్గాల్ న్యూఢిల్లీకి చేరుకుంది మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరింది. ఆమె తన మొదటి గురువుతో వాదనపడి, తన సంగీత విద్యను పండిట్ వినయ చంద్ర మద్గాలయ శిక్షణలో కొనసాగించింది. విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, ఆమె శిక్షణ ఢిల్లీలోని పండిట్ వసంత తాకర్ ఆధ్వర్యంలో కొనసాగించింది మరియు అనధికారికంగా ఇతర ప్రముఖ గాయకులు జితేంద్ర అభిషేకీ, నైనా దేవీ మరియు పండిట్ కుమార్ గంధర్వ వంటి వారివద్ద శిక్షణ పొందింది [7].
వృత్తి జీవితం[మార్చు]
శుభా ముద్గాల్ 80ల్లో ఒక క్లాసికల్ గాయని వలె ప్రదర్శనలను ఇవ్వడం ప్రారంభించింది మరియు ఒక ప్రజ్ఞ గల గాయని వలె కొంత ఖ్యాతిని ఆర్జించింది. 90ల్లో, ఆమె పాప్ మరియు ఫ్యూజన్ రకాలతో సహా సంగీతంలో ఇతర రూపాలను ప్రయత్నించడం ప్రారంభించింది. ఆమె ఇలా చెప్పింది, "నేను సంగీతాన్ని విశ్వసిస్తాను. ఖాయల్ మరియు థుమరి నా ఇష్టమైనవి, అంటే ఇతర రకాలను ప్రయత్నించరాదని నా ఉద్దేశ్యం కాదు, నేను ఎందుకు నా సంగీత రకాలను ఎందుకు పరిమితం చేసుకోవాలి?" అని గాయని ప్రశ్నించింది మరియు "నాలో కళాకారిణిని బయటి ప్రపంచంలోకి తీసుకుని రావాలని భావిస్తున్నాను. మీరు ఒక సంగీత కళాకారుడు అయితే, "ఇది ఆధ్యాత్మక కవిత్వం నుండి వచ్చింది, దానిని నేను ఎలా పాడతాను" అని ఎలా ప్రశ్నించగలరు.[8] ఆమె రికార్డింగ్‌లు మరియు సంగీత కచేరీలతో సహా, ఆమె సంప్రదాయక భారతీయ సంగీత ప్రియులు కోసం ఉద్దేశించి raagsangeet.com అనే పేరుతో ఒక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంది.
అంతర్జాతీయ ప్రదర్శనలు[మార్చు]
24 అక్టోబరు 2008న, శ్రావ్యమైన స్వరం గల శుభా ముద్గాల్ చే కిక్‌స్టార్ట్ ఆఫ్ దీపావళి ఉత్సవం. ఆమె తన నూతన ఆల్బమ్ "ప్యార్ కీ గీత్" నుండి ఉత్తమ పాటలను పాడింది. ప్రేక్షకులతో నిండిన సన్నీవేల్ హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్, కమ్యూనిటీ, సందర్శకులు, భక్తులు ప్రదర్శన ఆనందించారు. శ్రావ్యమైన పాటలకు అందరూ నృత్యం చేశారు. కార్యక్రమం గుండెను కరిగించే పాట హునా హునా తో ప్రారంభమైంది.
వ్యక్తిగత జీవితం[మార్చు]
విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, ఆమె పండిట్ ముద్గాలయ కుమారుడు, ఆ సమయంలో ప్రఖ్యాత న్యాయవాది అయిన ముకుల్ ముద్గల్‌ను వివాహం చేసుకుంది. శుభా ముద్గాల్ తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది మరియు అనీష్ ప్రాథన్‌ను పెళ్ళి చేసుకుంది. ఆమె మొదటి వివాహం కారణంగా జన్మించిన ఆమె ఏకైక కుమారుడు ధావల్ ఒక ఢిల్లీ లోని బ్యాండ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.[9]
డిస్కోగ్రఫీ[మార్చు]
- ఆలీ మోర్ అంజానా (1996)
- క్లాసికల్లీ యువర్స్ (1999) ISBN: D4HV2718
- అబ్ కె సావన్
- ప్యార్ కీ గీత్
- మాన్ కీ మంజీరీ
- కిసాన్ కీ చాదర్ (2003) [10]
- శుభ దీపావళి (2005)
- ఆనంద్ మంగళ్
- ది ఏవేకింగ్ (2006) [11]
- జహన్-ఈ-ఖుస్రాయు (2007)
సూచికలు[మార్చు]
- ↑ Interview The Hindu, Nov 26, 2005.
- ↑ 2.0 2.1 మైలుస్టోన్స్ శుభా ముద్గల్ ఆఫీసియల్ వెబ్సైట్.
- ↑ "The Origin , Structure, Constitution of Governing Board of Anhad". ANHAD. 25 September 2007. Cite web requires
|website=
(help) - ↑ http://www.outlookindia.com/article.aspx?204121
- ↑ 5.0 5.1 5.2 యాన్ ఇంటర్వ్యూ విత్ శుభా ముద్గాల్ monsoonmag.com, 2000.
- ↑ ది ఎబౌవ్ ఆల్ ది ట్రిబ్యూన్, ఆగస్టు 15, 1948.
- ↑ ఇండియన్ హీరోస్ శుభా ముద్గాల్ ఎట్ iloveindia.com.
- ↑ శుభా ముద్గాల్స్ టేల్స్ ఫ్రమ్ లైఫ్ south-asian.com, 2003.
- ↑ http://www.thehindu.com/arts/music/article528483.ece?homepage=true
- ↑ ది పాప్ దివా గోస్ క్లాసిక్ the-south-asian.com, సెప్టెంబరు 2003.
- ↑ శుభా ముద్గాల్ స్ట్రాడ్లెస్ ఏ రేజ్ ఆఫ్ మ్యూజికల్ వరల్డ్స్.. ది హిందూ, జూలై 14, 2006.
- మహేశ్వరీ, బెలు (ఫిబ్ర. 4, 2001). శుభా స్ప్రెడ్స్ మ్యాజిక్, ఎగైన్!. స్పెక్ట్రమ్ .
- ఘోష్, రితుజే ( 2006 జూలై 27). శుభా చార్మెడ్ బై సుఫీ మ్యూజిక్. హిందూస్థాన్‌టైమ్స్ .
బాహ్య లింకులు[మార్చు]
- ఆఫీసియల్ వెబ్సైట్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Shubha Mudgal పేజీ
- శుభా ముగ్దల్ ఇన్ డ్యాన్స్ విత్ ది విండ్
- దివాళీ 2008 సన్నీవేల్, US కాన్సెర్ట్ అప్డేట్స్ ఎట్ UPANA
- CS1 errors: missing periodical
- గూగుల్ అనువాద వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1959 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- హిందూస్థానీ గాయనీగాయకులు
- భారతీయ మహిళా గాయకులు
- భారత చలన చిత్ర గాయనీగాయకులు
- అలహాబాద్ నుండి ప్రజలు