Jump to content

శేరి సుభాష్‌రెడ్డి

వికీపీడియా నుండి
శేరి సుభాష్‌రెడ్డి
శేరి సుభాష్‌రెడ్డి


ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 ఏప్రిల్ 16 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 17 ఆగష్టు
కూచన్‌పల్లి గ్రామం, హవేలిఘన్‌పూర్ మండలం, మెదక్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లక్ష్మి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ
2018 ఉగాది పండగ సందర్భంగా ప్రగతిభవన్ లో నిర్వహించబడిన విళంబి నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న శేరి సుభాష్ రెడ్డి (ఎడమ), ఇతర ప్రజాప్రతినిధులు

శేరి సుభాష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 2019 నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1]

జననం

[మార్చు]

శేరి సుభాష్‌రెడ్డి మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ మండలం, కూచన్‌పల్లి గ్రామంలో ఆగష్టు 17న శేరి విఠల్‌రెడ్డి, సుశీల దంపతులకు జన్మించాడు. సుభాష్ రెడ్డిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆయన తండ్రి విఠల్‌రెడ్డి 1964–1971 వరకు మెదక్‌ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో చిన్నతనం నుండి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా సుభాష్‌రెడ్డి గుర్తింపు పొందాడు. ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశాడు. 1989లో మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 1991లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా, 1993లో మెదక్ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, 1997లో మెదక్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా కెసీఆర్ పిలుపునందుకొని 2001, ఏప్రిల్‌ 21న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ పార్టీలో చేరాక మెదక్‌ మండల అధ్యక్షునిగా, మెదక్ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షునిగా పార్టీకి సేవలందించాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేసీఆర్‌కు వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా, తెలంగాణ భవన్‌ కార్యదర్శిగా పనిచేశాడు. శేరి సుభాష్‌రెడ్డి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖమంత్రి కేసీఆర్‌కు రాజకీయ కార్యదర్శిగా కొనసాగాడు. ఆయన సేవలకు గాను 2016లో కేసీఆర్ ఆయనను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించాడు.[3] శేరి సుభాష్‌రెడ్డి 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుని రాజకీయ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[4] 2019 లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో శేరిసుభాష్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, పాలిటిక్స్ (16 April 2019). "ఎమ్మెల్సీగా 'శేరి' ప్రమాణస్వీకారం". Sakshi. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.
  2. Namasthe Telangana (17 August 2021). "శతమానం భవతి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (11 July 2016). "టీఎస్‌ఎండీసీ చైర్మన్‌గా శేరిసుభాష్‌రెడ్డి". www.ntnews.com. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.
  4. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  5. ఆంధ్రప్రభ, మెదక్ (23 February 2019). "సేవ‌కు ప‌ట్టం…". Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.