శైలానా రాజ్యం
| శైలాన సంస్థానం శైలాన సంస్థానం | ||||||
| చిన్న రాజ్యాలు | ||||||
| ||||||
| ||||||
| Capital | శైలాన | |||||
| చరిత్ర | ||||||
| - | Established | 1736 | ||||
| - | Disestablished | 1948 | ||||
| విస్తీర్ణం | ||||||
| - | 1881 | 1,165 km2 (450 sq mi) | ||||
| (Princely State)[usurped] | ||||||


బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించే రోజుల్లో, మధ్య భారత దేశంలోని మాళ్వా ఏజెన్సీలో, ఉన్న రాజ్యాలల్లో శైలానా రాజ్యం ఒక భాగం . అది 11 తుపాకీ సెల్యూట్ లకు అర్హమయిన సంస్థానంగా ఉండేది. ఆ సంస్థాన ఆదాయం షుమారుగా ఆ రోజుల్లో రూ. 5,00,000 ఉండేది[1].
చరిత్ర.
[మార్చు]శైలానా రాజ్యాన్ని రత్లామ్ రాజ్య స్థాపకుడు మహారాజా రతన్ సింగ్ కి ముని మనవడయిన రాజా జై సింగ్ స్థాపించాడు.. ఇది రాథోడ్ వంశానికి చెందినది. [2] 1716లో జై సింగ్ తన తండ్రి హత్యకు ప్రతీకారంగా తన మామ పై యుద్ధం చేసి సాగోడ్ వద్ద జరిగిన యుద్ధంలో అతన్ని చంపాడు. తన అన్న కోసం రత్లాము ను భద్రపరిచాడు. ఆ తర్వాత ఇద్దరు సోదరులు తమ రాజ్యాన్ని పరస్పరం విభజించుకున్నారు. జై సింగ్ మోదట తన రాజధానిని రావతి దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. . అతను 1736లో శైలానాను తన కొత్త రాజధానిగా నిర్మించాడు.
ఈ కాలంలో మధ్య భారతదేశంలో మరాఠా ప్రభావం పెరుగుతూ వచ్చింది, అనేక రాజ్యాలు పేష్వా కు భారీ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. లేకపోతే విలీనం అయ్యేవి. అయితే జై సింగ్ దూరదృష్టి తో మరాఠా అధికారులతో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అతను మాల్వాలో కప్పం వసూలు చేయడంలో పేష్వా ప్రతినిధి అంబాజీ పంత్ త్రింబక్ పురందరేకు సహాయం చేశాడు ఈ పరిస్థితిని వినియోగించుకుని చుట్టుపక్కల భూభాగాలను తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.[3] తన జీవితకాలంలో 22 యుద్ధాలు చేశీ , తన స్థానాన్ని స్థిర పరచుకున్నాడు. [4][5][6] ఆయన వద్ద ఉన్న సైన్యం, చుట్టుపక్కల రాజ్యాలు భయపడేల ఉండేది. ఫలితంగా కొన్ని రాజ్యాలు ఆయనకు వ్యతిరేకంగా హోల్కర్ సహాయం తీసుకోవల్సి వచ్చింది.[7] శైలానా రాజు, రాజపుత్రుల ను , పఠాన్లను అశ్వ దళానికి నియామిచ్చడంలో ప్రాధాన్యం ఇచ్చేవాడు. కానీ పదాతిదళాన్ని స్థానిక ప్రజల తో ఏర్పాటు చేసే వాడు. అయితే అతని వంశజడయిన మొఖం సింగ్ ఈ సైనిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చి అధిక సంఖ్యలో ఏనుగులను సమకూర్చి , రాజ్య ఖజానాను ఖాళీ చేశాడు. దీని వలన మరాఠాలు, పిండారీలు అడ్డు లేకుండా రాజ్యం లోకి చొరబడి దోపిడి చేయ గలిగారు. [1]
జై సింగ్ తరువాత వరుసగా బలహీనమైన పాలకులు శైలానా ను పరిపాలించారు. . రాజా మొఖం సింగ్ పాలనలో శైలానా రాజ్యం లోని విస్తారమయిన భూభాగం సింధియా, హోల్కర్ ల స్వాధీనం అయింది. శైలానా రాజులు గ్వాలియర్ సింధియాలకు మరింత కప్పం చెల్లించవలసి వచ్చింది. శైలానా రాజు లక్ష్మణ్ సింగ్ సింధియాను తన రాజ్యం నుండి సింధియాలను తరిమి కొట్టేందుకు ప్రయత్నించాడు, 1818లో అతను సాధారణ చౌత్ పన్ను చెల్లించడానికి నిరాకరించాడు. దీనికి ప్రతీకారంగా సింధియాలు బుజంగ రావు నాయకత్వంలో సైన్యాన్ని పంపించారు. యూరోపియన్ ఆయుధాలతో, ఫ్రెంచ్ శిక్షణ పొందిన గ్వాలియర్ సైన్యం శైలాన కు వెళ్లే మార్గంలో కొండలపై తమా ఆధిక్యతను కోల్పోయి, లక్ష్మణ్ సింగ్ చేతిలో ఓడిపోయింది. స్వాధీనం చేసుకున్న సైనికులను విడిచిపెట్టడానికి అనుమతించినా ,వారి తుపాకులను, ఫిరంగులన్నీ స్వాధీనం చేసుకున్నారు. 1819లో, శైలానా రాజాను శిక్షించి, కప్పం వసూలు చేయడానికి బాపూ రావు సింధియాను నియమించారు. ఇతను అంతకు ముందు, జైపూర్ మహారాజు , ఉదయపూర్ మహారాణా నుండి కప్పం వసూలు చేయడానికి పంప బడ్డాడు. .[8] 1819 జనవరి 5న, జాన్ మాల్కం గ్వాలియర్, శైలానాలకు , మధ్యవర్తిత్వం వహించాడు . దాని ఫలితంగా రాజా లక్ష్మణ్ సింగ్ బ్రిటిష్ రక్షణను అంగీకరించి, 1860 వరకు గ్వాలియర్ కు నిర్దిష్ట కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ప్రతి ఫలంగా గా దౌలత్ రావు సింథియా శైలానా లో ఎటువంటి జోక్యం చేసుకోకుండా ఉండటానికి అంగీకరించాడు. అయితే ఈ ఒప్పందం ఎక్కువ కాలం కొనసాగ లేదు. దౌలత్ రావు త్వరలోనే శైలానా, రత్లామ్ ల పై తన కప్పం హక్కులను వదులుకున్నాడు. తరువాత ఈ కప్పం నేరుగా బ్రిటిష్ వారికి చెల్లించబడింది.[9] బ్రిటిష్ పాలనలో రెండవ రాజా జశ్వంత్ సింగ్, ఆయన కుమారుడు రాజ దిలీప్ సింగ్ ల సమర్థవంతమైన పాలనలో, శైలానా అభివృద్ధిని సాధించింది. అనేక సంస్కరణలు అమలు చేయ బడ్డాయి. ముఖ్యంగా విద్యాభివృద్ది , స్థానిక భాషలలొ విద్యా సదుపాయాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.1947 నాటికి, విద్య, వైద్య సహాయం ఉచితంగా అందించబదిండి. స్థానిక మునిసిపాలిటీలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేయబడింది. న్యాయవ్యవస్థ , కార్యనిర్వాహక వ్యవస్థ పరస్పరం స్వతంత్రంగా ఉంచారు. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధార పడినప్పటికీ , కొంత పారిశ్రామికీకరణ జరిగింది. ఇందులో నూనె మిల్లులు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. 1948 జూన్ 15న, రాజా దిలీప్ సింగ్ భారత సమాఖ్యలో విలీనానికి అంగీకార పత్రం పై సంతకం చేశారు.
శైలానా అధిపతులు, రాథోడ్ రాజపుత్రులు, వీరిద్దరూ జోధ్పూర్, రత్లాం మహారాజులతో ఉమ్మడి పూర్వీకులను కలిగి ఉన్నారు.[1]
రాజులు
[మార్చు]| పేరు. | సంవత్సరం. |
|---|---|
| రాజా జై సింగ్ | 1736–1757 |
| రాజా జస్వంత్ సింగ్ I | 1757–1772 |
| రాజా అజాబ్ సింగ్ | 1772–1782 |
| రాజా మొఖం సింగ్ | 1782–1797 |
| రాజా లక్ష్మణ్ సింగ్ | 1797–1826 |
| రాజా రతన్ సింగ్ | 1826–1827 |
| రాజా నహర్ సింగ్ | 1827–1841 |
| రాజా తఖత్ సింగ్ | 1841–1850 |
| రాజమాతా నాథ్ కన్వర్జీ (రీజెంట్) | 1850–1859 |
| రాజా దులెహ్ సింగ్ | 1850–1895 |
| మహారాజా సర్ జశ్వంత్ సింగ్ II | 1895–1919 |
| మహారాజా సర్ దిలీప్ సింగ్ | 1919-1948 (1948-1961) |
| మహారాజా దిగ్విజయ్ సింగ్ | 1961–1990 |
| మహారాజా విక్రమ్ సింగ్ | 1990-ప్రస్తుతము |
శైలానా రాజ్యానికి చెందిన జాగీర్దారులు
[మార్చు]శైలానా రాజ్యంలో ఉన్న జాగీర్దార్లందరూ రాజు కు విధేయతతో పాటు సేవలను అందించాల్సి ఉండేది. వారు రాజుకు శిస్తు లు, పన్నులు చెల్లించే వారు. రాజు అనుమతి లేకుండా ఏ జాగీర్దార్ కూ దత్తత తీసుకొనే హక్కు లేదు. ప్రధమ శ్రేణి జాగీర్దారులు బంగారు మువ్వలు (ఏంక్లెట్సు) ధరించడానికి అనుమతి ఉండేది. వారసత్వ సమయంలో,స్వయంగా పాలక రాజు, చేతుల మీదుగా వారి అధికార స్థాపన జరిగేది. జాగీర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర భూములలో సగం వరకు, జాగీర్లకు చెందేది.[6] తరువాత కాలంలో రాజా దిలీప్ సింగ్ ( 1919-1948) అనేక జాగీర్లను రద్దు చేసి , వాటి స్థానంలో గవర్నర్లలను నియమించారు. ఈ చర్య కఠినమైనదైనా, సమర్థవంతమైనది అవడం వల్ల రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి సహాయపడింది. ఆ ఆదాయాన్ని శైలానా లో వైద్య , విద్యా సౌకర్యాలను అందించడానికి ఉపయోగించబడింది.
1908లో శైలానాకు చెందిన ప్రధమ శ్రేణి జాగీర్దార్ లు ఈ క్రింది విధంగా ఉన్నారు.
| పేరు. | ఆదాయం (రూ. | రాజవంశం |
|---|---|---|
| సెమ్లీయా | 30,000 | రాథోడ్ |
| బీర్మవాల్/కనేరి | 26,000 | రాథోడ్ |
| రావతి | 20,000 | రాథోడ్ |
| కరియా | 17,000 | రాథోడ్ |
1908లో శైలానా కు చెందిన ద్వితీయ శ్రేణి జాగీర్దార్ లు ఈ క్రింది విధంగా ఉన్నారు.
| పేరు. | ఆదాయం (రూ. | రాజవంశం |
|---|---|---|
| ఘట్వాలు | 5,00 | రాథోడ్ |
| ఉమ్రాన్ | 4,000 | సోంగరా |
| నయాపురా | 1,100 | రాథోడ్ |
| మేవాసా | 3,000 | సిసోడియా |
| చందోరియా | 2,000 | రాథోడ్ |
| నల్కుయి | 1,700 | సోంగరా |
| కొట్రియా | 1,200 | రాథోడ్ |
| బరోడా | 4,000 | రాథోడ్ |
| అద్వానియా | 6,000 | రాథోడ్ |
| మోర్డా | 4,000 | రాథోడ్ |
తృతీయ శ్రేణి జాగీర్దార్లు రాష్ట్రానికి వంశపారంపర్యంగా కార్యాలయాలు నిర్వహించేవారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- రాజపుత్ర రాజవంశాలు , రాష్ట్రాల జాబితా
- మాల్వా ఏజెన్సీ
బాహ్య లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 Playne, Somerset; Solomon, R. V.; Bond, J. W.; Wright, Arnold (2006). Indian states : a biographical, historical, and administrative survey. New Delhi: Asian Educational Services. pp. 629–634. ISBN 81-206-1965-X. OCLC 76941475. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "SS" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Singh, Raja Vikram (2016-05-29). "Cooking like a maharaja". Deccan Chronicle. the original నుండి 2 June 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-04-20.
- ↑ ప్రదేశ్ గేజేట్, గవర్నమెంట్ ఆఫ్ మధ్య ప్రదేశ్. మధ్య. భోపాల్: గవర్నమెంట్ ఆఫ్ మధ్య ప్రదేశ్. pp. 55–56.
- ↑ Playne, Somerset; Solomon, R. V.; Bond, J. W.; Wright, Arnold (2006). Indian states : a biographical, historical, and administrative survey. New Delhi: Asian Educational Services. p. 632. ISBN 81-206-1965-X. OCLC 76941475.
The Ruler died at the age of 61 years, having, during his reign, fought no fewer than 22 battles.
- ↑ Sinh, Raghubir (1993). Malwa in transition, or, A century of anarchy : the first phase, 1698–1765. New Delhi: Asian Educational Services. pp. 123–125. ISBN 81-206-0750-3. OCLC 76936900.
- 1 2 Imperial Gazetteer of India. Vol. 21. Oxford: Clarendon Press. 1908. pp. 385–7. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "igi" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Sinh, Raghubir (1993). Malwa in transition, or, A century of anarchy : the first phase, 1698–1765. New Delhi: Asian Educational Services. p. 282. ISBN 81-206-0750-3. OCLC 76936900.
The danger of Jai Singh of Sailana to the state of Jhabua forced its well wishers to rely on Maratha help.
- ↑ Chaurasia, Radhey Shyam (2004). History of the Marathas. New Delhi: Atlantic Publishers & Distributors. p. 41. ISBN 81-269-0394-5. OCLC 435374931.
- ↑ Chaurasia, Radhey Shyam (2004). History of the Marathas. New Delhi: Atlantic Publishers & Distributors. p. 226. ISBN 81-269-0394-5. OCLC 435374931.
He relinquished his rights of tribute from Ratlam and Sailana to the British government, perhaps because the states were outside the area that he claimed to be his own.
