శైవ సిద్ధాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శైవ సిద్ధాంతం [1] [2] అనేది శైవమతం యొక్క ఒక రూపం. ఇది ద్వంద్వ తత్వాన్ని ప్రతిపాదిస్తుంది, ఇక్కడ ఒక జీవి యొక్క అంతిమ, ఆదర్శ లక్ష్యం శివుని అనుగ్రహం ద్వారా జ్ఞానోదయమైన ఆత్మగా మారడం. [3] ఇది ప్రధానంగా 5 నుండి 9 వ శతాబ్దం వరకూ చెందిన శైవ సాధువులు వ్రాసిన తమిళ భక్తి శ్లోకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని తిరుమురై అనే సేకరణ రూపంలో పిలుస్తారు. మేకండదేవర్ (13వ శతాబ్దం) దీని మొదటి తత్వవేత్త. [4] శైవ సిద్ధాంతం యొక్క సూత్రప్రాయ ఆచారాలు, విశ్వోద్భవ శాస్త్రం, వేదాంతశాస్త్రం మొదలైనవి ఆగమాలు, వేద గ్రంథాలపై ఆధారపడి ఉంటాయి. [5]

ఈ సంప్రదాయం భారతదేశం అంతటా ఒకప్పుడు ఆచరించబడిందని భావిస్తున్నారు. [6] అయితే, ఉత్తర భారతదేశంలోని ముస్లింల అణచివేత కారణంగా శైవ సిద్ధాంతం దక్షిణాదికే పరిమితమైంది. [7] అక్కడ అది నాయన్మార్ల భక్తి కవిత్వంలో వ్యక్తీకరించబడిన తమిళ శైవ ఉద్యమంతో కలిసిపోయింది. [8] ఈ చారిత్రక సందర్భంలోనే శైవ సిద్ధాంతం సాధారణంగా "దక్షిణ" సంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఇది ఇప్పటికీ సజీవంగా ఉంది. [8] తిరుమురై, శైవ ఆగమాలు, "మేకాండ" లేదా "సిద్ధాంత" శాస్త్రాలు, [9] అని పిలువబడే తమిళ భక్తి పాటల సంకలనం తమిళ శైవ సిద్ధాంతానికి సూత్రాన్ని ఏర్పరుస్తుంది.


నేడు, శైవ సిద్ధాంతానికి ప్రధానంగా దక్షిణ భారతదేశం, శ్రీలంకలో అనుయాయులున్నారు.

చరిత్ర[మార్చు]

శైవ సిద్ధాంతం యొక్క అసలు రూపం అనిశ్చితంగా ఉంది. ఇది కాశ్మీరీ ఉత్తర శైవులు ఆమోదించిన ఒక మోనిస్టిక్ సిద్ధాంతంగా ఉద్భవించిందని భావిస్తారు. అయితే, ప్రారంభ శైవ సిద్ధాంతం భారతదేశంలో ఎక్కడో అభివృద్ధి చెంది ఉండవచ్చు, విముక్తిని అందించే ఆచార దీక్ష అనే భావన చుట్టూ నిర్మించబడిన మతంగా ఇది ఇతరులకు కనిపిస్తుంది. అటువంటి విముక్తి దీక్ష యొక్క భావన పాశుపత సంప్రదాయం నుండి తీసుకోబడినట్లు కనిపిస్తుంది. [10] ఈ శాఖ యొక్క వేదాంతపు ప్రారంభ అభివృద్ధి సమయంలో, మోనిజం లేదా ద్వంద్వవాదం యొక్క ప్రశ్న ఇంకా ముఖ్యమైన సమస్యగా ఉద్భవించలేదు.

తమిళ శైవ కవియైన కుమారగురుపర దేశికర్, శైవ సిద్ధాంతం వేదాంత వృక్షపు మగ్గిన పండు అని చెప్పాడు. ఆంగ్లికన్ తమిళ పండితుడైన GU పోప్, శైవ సిద్ధాంతం ద్రావిడ జ్ఞానం యొక్క ఉత్తమ వ్యక్తీకరణ అని పేర్కొన్నాడు. [11]

ప్రస్తుత స్థితి[మార్చు]

శైవ సిద్ధాంతం దక్షిణ భారతదేశం, శ్రీలంకల లోని శైవులు, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణులు, కొంగు వెల్లలార్, వెల్లలార్, నగరాథర్ సమాజాలు విస్తృతంగా ఆచరిస్తున్నారు. [12] దీనికి తమిళనాడులో 50 లక్షలకు పైగా అనుయాయులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రవాసులలో కూడా ప్రబలంగా ఉంది.  ప్రధానంగా తమిళనాడులో, ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన తమిళ జనాభా ఉన్న ప్రదేశాలలో వేల సంఖ్యలో దేవాలయాలున్నాయి. అనేక సన్యాసుల సంప్రదాయాలను కలిగి ఉంది. దాని పూజారుల సంఘమైన ఆదిశైవులు, ఆగమ ఆధారిత శైవ ఆలయ ఆచారాలను నిర్వహించడానికి అర్హులు.

మూలాలు[మార్చు]

  1. Xavier Irudayaraj,"Saiva Siddanta," in the St. Thomas Christian Encyclopaedia of India, Ed. George Menachery, Vol.III, 2010, pp.10 ff.
  2. Xavier Irudayaraj, "Self Understanding of Saiva Siddanta Scriptures" in the St. Thomas Christian Encyclopaedia of India, Ed. George Menachery, Vol.III, 2010, pp.14 ff.
  3. Flood, Gavin. D. 2006. The Tantric Body. P.122
  4. "Shaiva-siddhanta | Hindu philosophy". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-08-05.
  5. Flood, Gavin. D. 2006. The Tantric Body. P.120
  6. Schomerus, Hilko Wiardo (2000). Śaiva Siddhānta: An Indian School of Mystical Thought : Presented as a System and Documented from the Original Tamil Sources (in ఇంగ్లీష్) (Reprint ed.). Delhi: Motilal Banarsidass Publishe. pp. 5–7. ISBN 978-81-208-1569-8.
  7. Flood, Gavin. D. 2006. The Tantric Body. P.34
  8. 8.0 8.1 Flood, Gavin. D. 1996. An Introduction to Hinduism. P.168
  9. S. Arulsamy, Saivism - A Perspective of Grace, Sterling Publishers Private Limited, New Delhi, 1987, pp.1
  10. See Alexis Sanderson's The Lākulas: New evidence of a system intermediate between Pāñcārthika Pāśupatism and Āgamic Śaivism. Ramalinga Reddy Memorial Lectures, 1997. In: The Indian Philosophical Annual 24 (2006), pp.143-217.
  11. "The Shaiva Siddhanta". shaivam.org. Retrieved 2021-08-05.
  12. "Kongu Vellalar Sangangal Association". www.konguassociation.com. Retrieved 2021-08-03.