శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శొంఠి భద్రాద్రి రామశాస్త్రి
జననం1856
మరణం1915
వృత్తికవి
తల్లిదండ్రులు
  • గంగరామయ్య (తండ్రి)
  • కామాంబ (తల్లి)

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి (1856-1915) తెలుగు కవి.

వీరి జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వీరు వెలనాటి వైదికులు, గౌతమ గోత్రీయులు. వీరి తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యానం అనే ప్రబంధాన్ని రచించిన వారణాసి వేంకటేశ్వరకవి ఇతనికి మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు.

రచించిన గ్రంథాలు[మార్చు]

  • కాళిందీ పరిణయము,
  • శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు).
  • చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము).
  • శంబరాసుర విజయము (సంస్కృత చంపువు).
  • శివరామశతకము (ద్వ్యర్థి.)
  • ముక్తావళి (మదాలసకథగల సంస్కృతాంధ్ర నాటకములు-)
  • మల్లిక (నవల)
  • అహోబల పండితీయ వ్యాఖ్య-
  • లఘుకౌముది (ఆంధ్ర టీక)
  • జగన్నాథక్షేత్ర మహాత్మ్యము,
  • శ్రావణమహోత్సవ తారావళి - ఇత్యాదులు.

మూలాలు[మార్చు]

  • శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950. పేజీలు: 154-7.