శోభా సింగ్ (చిత్రకారుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభా సింగ్
జననం(1901-11-29)1901 నవంబరు 29
మరణం1986 ఆగస్టు 22(1986-08-22) (వయసు 84)
రంగంచిత్రీకరణ

శోభా సింగ్ ( 1901 నవంబరు 29 – 1986 ఆగస్టు 22)[1] భారతదేశంలోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సమకాలీన చిత్రకారుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

సర్దార్ శోభా సింగ్ 1901 నవంబరు 29 న పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలోని హరగోవిందపూర్ లోని రాం గరియా సిక్కు కుటుంబంలోజన్మించాడు. ఆయన తండ్రి దేవ్‌సింగ్ భారతదేశ అశ్విక దళంలో పనిచేసాడు. 1949లో ఆయన చిత్రకారునిగా కెరీర్ ప్రారంభించినపుడు వారి కుటుంబం అండ్రెట్టా (పాలంపూర్ సమీప ంలో) స్థిరపడ్డారు. ఈ గ్రామం హిమాలయాల దిగువన గల కాంగ్రా లోయకు దగ్గరలో చిన్న గ్రామం.

శోభాసింగ్ బీబీ గురుచరణ్ కౌర్ ను కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. గురుచరణ్ కౌర్ కుమారుడు హర్‌దయాల్ సింగ్ ప్రస్తుతం కాంగ్రా లోయలో ముఖ్యమైనదైన శోభాసింగ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.

విద్య, శిక్షణ[మార్చు]

తన 15వ యేట శోభాసింగ్ అమృత్ సర్ లోని ఇండస్ట్రియల్ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు ఆర్ట్, క్రాప్టు కోర్సును చేసాడు. ఆయన బ్రిటిష్ సైనిక దళంలో డ్రాప్ట్స్ మన్ గా చేరాడు. ఆయన బాగ్దాద్, మెసపటోనియా (ప్రస్తుతం ఇరాక్) లలో తన సేవలనందించాడు. 1923 లో ఆయన సైనక దళం నుండి వదిలి అమృత్ సర్కు తిరిగి వెళ్ళాడు. అచ్చట ఒక ఆర్ట్ స్టుడియోను ప్రారంభిమాడు. అదే సంవత్సరం ఆయన బీబీ ఇందెర్ కౌర్ ను వివాహమాడాడు. ఆయన అమృత్ సర్, లాహోర్ 91926), ఢిల్లీ (1931) లలోని తన ఆర్ట్ స్టుడియోలలో పనిచేసాదు.

1946 లో ఆయన లాహోర్ వచ్చి అనార్కలీ వద్ద తన స్టుడియోను ప్రారంభించాడు. అచట ఆర్టు డైరక్టరుగా చిత్రాలలో పనిచేసాడు. ఆయన భారతదేశ విభజన మూలంగా బలవంతంగా నగరాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది.[2] 1949లో ఆయన అండ్రెట్టా (పాలంపూర్ వద్ద) స్థిరపడ్డాడు. ఈ ప్రదేశం కాంగ్రా లోయకు సమీప ంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది.

చిత్రలేఖనం[మార్చు]

తన 38వ యేట ఆయన ఆండ్రెల్లాలో ఉన్నారు. ఆయన అనేక వందల చిత్రాలను సిక్కు గురువులను వారి జీవితం, సేవలనూ ప్రధానంగా చేసుకొని చిత్రించాడు. ఆయన చిత్రించిన సిక్కు గురువులతో కూడిన చిత్రాలు ప్రజలలో మంచి ఆదరణ పొందాయి. ప్రజల దృష్టిలో గురు నానక్, గురు గోబింద్ సింగ్ సంబంధం గురించి తెలియజేసాయి. 1969 లో గురు నానక్ 500వ పుట్టినరోజు సందర్భంగా గీసిన కళాత్మక రూప చిత్రం గురు నానక్. ఇది గురు నానక్ కు ప్రతిరూపం అని, ఇది ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడని ప్రజల నమ్మకం. అదే విధంగా ఆయన గురు అమర్ దాస్, గురు తేజ్ బహాదూర్, గురు హర్ కిషన్ చిత్రాలను కూడా చిత్రించాడు. ఆయన చిత్రించిన సోహ్ని మహివాల్, హీర్ రంజా చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆయన జాతీయ నాయకులైన షహీద్ భగత్ సింగ్, కర్తార్ సింగ్ సరభా, మహాత్మా గాంధీ, లాల్ బహాదూర్ శాస్త్రి మొదలైన చిత్రాలను కూడా చిత్రించాడు.[3]

అతని కుడ్యచిత్రాలు న్యూఢిల్లీలో భారత పార్లమెంట్ హౌస్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించబడ్డాయి. ఆయన చిత్రాలు సిక్కు చరిత్ర పరిణామాన్ని తెలియజేస్తుంది. చిత్రాలలో గురునానక్ బాల, మర్దన ఒకవైపు, గురుగోవింద సింగ్ ధ్యానం చేస్తూ మరొకవైపు ఉన్నట్లు చిత్రించాడు. ఆయన శిల్పకళా రంగంలో కూడా ప్రవేశించాడు. ఆయన ప్రముఖ పంజాబీలూ అయిన ఎం.ఎస్. రంధ్వా, ప్రీత్‌విరాజ్ కపూర్, నిర్మల్ చంద్ర, నిలువెత్తు చిత్రాలను, అసంపూర్తిగా ఉన్న పంజాబీ కవయిత్రి అమృతా ప్రీతం చిత్రాన్ని కూడా గీసాడు. ఆయన గీచిన అసలైన చిత్రాలు ఆండ్రెట్టా లోని తన స్టుడియోలో ప్రదర్శించబడ్డాయి. వాటిని ప్రజలు సందర్శిస్తూంటారు.

ఆయన 1986 ఆగస్టు 21 న చండీగఢ్లో మరణించాడు.

అవార్డులు[మార్చు]

ఆయనకు అనేక మైన అవార్డులు వచ్చాయి. ఆటిలో 1974లో పంజాబ్ ప్రభుత్వం నుండి స్టేట్ ఆర్టిస్టు బిరుదు పొందారు. 1983లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.[4] పాటియాలా లోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని పొందారు.[5] ఆయన చేసిన పనులను గుర్తిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆయన జీవిత విశేషాలతో ఒక డాక్యుమెంటరీని "పెయింటర్ ఆఫ్ ద పీపుల్" శీర్షికతో వెలువరించారు. 1984లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కూడా ఒక డాక్యుమెంటరీని విడుదల చేసారు. భారత ప్రభుత్వం 2001లో శోభాసింగ్ ను గౌరవిస్తూ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.[6]

మూలాలు[మార్చు]

  1. ਰਛਪਾਲ ਸਿੰਘ ਗਿੱਲ (2004). ਪੰਜਾਬ ਕੋਸ਼ ਜਿਲਦ ਪਹਿਲੀ. ਭਾਸ਼ਾ ਵਿਭਾਗ ਪੰਜਾਬ. p. 430.
  2. "S. Sobha Singh Artist". Archived from the original on 2016-03-03. Retrieved 2016-07-31.
  3. "Sardar Shoba Singh |". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-31.
  4. "The Government Museum and Art Gallery Chandigarh, India". Archived from the original on 2006-08-29. Retrieved 2016-07-31.
  5. The Sunday Tribune – Spectrum
  6. The Tribune, Chandigarh, India – Himachal Pradesh

ఇతర లింకులు[మార్చు]