శోభ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభ
జననం
మహాలక్ష్మి మీనన్

(1962-09-23)1962 సెప్టెంబరు 23
మరణం1980 మే 1(1980-05-01) (వయసు 17)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
మరణ కారణంఆత్మహత్య
ఇతర పేర్లుశోబా మహేంద్ర, ఊర్వశి శోబ, బేబీ మహాలక్ష్మి, బేబీ శోబ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1965–1980
జీవిత భాగస్వామి
తల్లిదండ్రులు

మహాలక్ష్మి మీనన్ (1962 సెప్టెంబరు 23 - 1980 మే 1) మలయాళ, తమిళ చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె చిత్రసీమలో శోభ గుర్తింపుపొందింది. 17 సంవత్సరాల వయస్సులో ఆమె 1979 తమిళ చిత్రం పసిలో తన పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

ఆమె ఉత్తమ బాలనటి (1971), ఉత్తమ సహాయ నటి (1977), ఉత్తమ నటి (1978) ఇలా మూడు సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. 1978లో కన్నడ, 1979లో తమిళ చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రెండు అందుకుంది.

భారతీయ చలనచిత్రసీమలో ఉద్భవించిన అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరిగా పరిగణించబడిన ఆమె 1980లో తెలియని కారణాలతో ఆత్మహత్య చేసుకుంది.[2][3][4][5] మలయాళ చిత్రం లేఖయుడే మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్ ఆమె జీవితచరిత్ర ఆధారంగా 1983లో రూపొందించబడింది. ఈ చిత్రానికి కె. జి. జార్జ్ దర్శకత్వం వహించాడు.[6]

జీవితం[మార్చు]

శోభ 1962 సెప్టెంబరు 23న కె. పి. మీనన్, ప్రేమ మీనన్ దంపతులకు జన్మించింది. ప్రేమ మీనన్ 1954 నుండి 1981 వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రేమ అనే మారుపేరుతో గుర్తింపు పొందిన నటి. చెన్నైలో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించిన శోభ తమిళ చిత్ర పరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించింది. తట్టుంగల్ తిరక్కప్పడుమ్ (1966)లో బాలనటిగా అరంగేట్రం చేసింది. ప్రధాన నటిగా ఆమె మొదటి చిత్రం 1978 మలయాళ చిత్రం ఉత్రద రాత్రి.[7] ఆమెకు బాలు మహేంద్రతో వివాహమైంది. శోభ తన 17వ ఏట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కెరీర్[మార్చు]

1966లో నటుడు జె. పి. చంద్రబాబు దర్శకత్వం వహించిన తమిళ థ్రిల్లర్ చిత్రం తట్టుంగల్ తిరక్కప్పడుమ్‌లో శోబా తెరపైకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె బేబీ మహాలక్ష్మిగా గుర్తింపు పొందింది. ఇందులో ఆమె నటి సావిత్రి, కె. ఆర్. విజయ, ఆర్.ఎస్. మనోహర్, చంద్రబాబు సరసన లక్ష్మి పాత్రను పోషించింది. మరుసటి సంవత్సరం ఆమె పి. వేణు ఉద్యోగస్థ తో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టింది, అక్కడ ఆమె బేబీ శోభగా గుర్తింపు పొందింది. సత్యన్, ప్రేమ్ నజీర్, కె. పి. ఉమ్మర్, పద్మిని, శారద, షీలా, రాజశ్రీ వంటి అగ్ర నటులతో ఈ చిత్రం మలయాళ సినిమా మొదటి మల్టీ-స్టారర్ గా నమోదయింది. ఇది అన్ని వయసుల వారిని ఆకట్టుకుని భారీ హిట్ సాధించింది. దీంతో బాలనటిగా శోభకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

1978లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఉత్రాద రాత్రి చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఆమె 1978లో బంధనం, ఎంత నీలాకాశం చిత్రాలకు కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. అదే సంవత్సరం కన్నడ సినిమా అపరిచిత చిత్రానికి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. 1979లో ట్రావెన్‌కోర్ సోదరీమణులలో ఒకరైన లలిత నిర్మించిన తమిళ చిత్రం పసికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆమె పసికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. 1977లో ఓర్మకల్ మరిక్కుమో చిత్రానికి కేరళ ప్రభుత్వం నుండి రెండవ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

పలు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాలలో నటించిమెప్పించిన ఆమె తెలుగులో తరం మారింది (1977), మనవూరి పాండవులు (1978) చిత్రాలు చేసింది.

మూలాలు[మార్చు]

  1. "Top Indian actress found hanged". Montreal Gazette. United Press International. 2 May 1980. p. 10 – via Google News Archive.
  2. Aravind, CV (9 May 2020). "Remembering Shoba, the brilliant actor who left us too soon". The News Minute. Archived from the original on 2021-10-08.
  3. Kumar, S. R. Ashok (3 May 2002). "It's a heavy price to pay". The Hindu. Archived from the original on 4 July 2003. Retrieved 11 January 2012.
  4. "A story on suicides and actresses". Behindwoods.com. 4 January 2007. Retrieved 11 January 2012.
  5. "Why South Indian heroines are embracing death". Mid-Day. 20 April 2002. Retrieved 11 January 2012.
  6. Joy, Prathibha. "Veteran director Balu Mahendra no more - Times of India". The Times of India.
  7. Babu, Subash (2020-05-10). "Actress Shobha and her intriguingly filmy life story still remain endearing". Malayala Manorama. Archived from the original on 2020-05-29. Retrieved 2022-04-12.
"https://te.wikipedia.org/w/index.php?title=శోభ_(నటి)&oldid=3893704" నుండి వెలికితీశారు