శోషణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శోషణము (Absorption) జీర్ణ క్రియ పూర్తయిన తర్వాత జరిగే జీవప్రక్రియ. ఇది జీర్ణాశయము, చిన్న పేగులో జరుగుతుంది.

  • జీర్ణాశయము: మానవుని జీర్ణాశయములో నీరు, ఖనిజ లవణములు, ఆల్కహాలు కొంతవరకు శోషణము చెందుతాయి.
  • చిన్న ప్రేగు: చిన్న ప్రేగు లోపలి కుడ్యములో అనేక సంఖ్యలో వేళ్ళవంటి ఆంత్ర చూషకాలను కలిగియుండి, రక్తకేశ, శోషరస నాళికలతో ఆవృతమై ఉండటం వలన శోషణ తలము (Absorptive surface) బాగా విస్తరించి ఉంటుంది. వీటివలన ఆహారము త్వరగా శోషణము చెందుతుంది. ఎమైనో ఆమ్లాలు, సరళ చక్కెరలు నేరుగా ఆంత్ర చూషకాల చుట్టూ వ్యాపించియున్న రక్తకేశనాళికల లోనికి శోషణం చెంది, రక్తము ద్వారా కాలేయములోనికి చేరతాయి.

పదార్ధాలు[మార్చు]

  • కార్బోహైడ్రేట్స్ శోషణము (Absorption of Carbohydrates) : జీర్ణక్రియ పూర్తయేటప్పటికి కార్బోహైడ్రేట్స్ గ్లూకోసు, ఫ్రక్టోసు, గాలక్టోసు అనే మోనోసేకరైడ్స్ గా మారతాయి. ఇవి నేరుగా రక్తప్రవాహము లోనికి చేరతాయి. ముందుగా మోనోసేకరైడ్స్ ఫాస్ఫారిక్ ఆమ్లముతో కలసి హెక్సోస్ ఫాస్ఫేట్స్ గా మారతాయి. రక్తములోనికి చేరేముందు తిరిగి హెక్సోస్ గా జల విశ్లేషణం చెందుతాయి. ఈ హెక్సోస్ లు గ్లైకోజెన్గా మారి కాలేయములో నిలువ ఉంటుంది.
  • ప్రోటీనుల శోషణము (Absorption of Proteins) : జీర్ణక్రియ పూర్తయేసరికి ప్రోటీనులు ఎమైనో ఆమ్లాలుగా మారతాయి. కొంతభాగం పాలిపెప్టైడుల రూపంలో మిగిలివుంటాయి. పెప్టైడులు స్వల్పంగా రక్తంలోకి చేరగా మిగిలినవి మలంలోనికి చేరతాయి. కొన్ని పెప్టైడులు ఆంత్రకణాలలోనికి చేరి జలవిశ్లేషణ చర్యకు గురై కణాంతర జీర్ణక్రియ ఎందుతాయి. స్వేచ్ఛా ఎమైనో ఆమ్లాలు వ్యాపన, సక్రియా శోషణ విధానాల ద్వారా శోషణం చెందుతాయి.
  • కొవ్వుల శోషణము (Absorption of Fats) : జీర్ణక్రియ పూర్తయేసరికి కొవ్వు పదార్ధాలు గ్లిసరాల్, కొవ్వు ఆమ్లాలుగా మారతాయి.
    • లైపోలైటిక్ సిద్ధాంతం (Lipolytic Theory)
    • పార్టిషన్ సిద్ధాంతం (Partition Theory)
"https://te.wikipedia.org/w/index.php?title=శోషణము&oldid=2885520" నుండి వెలికితీశారు