శ్యామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాధవరావ్ దేశ్ పాండే (శ్యామా)

బాబాను జీవితాంతం సేవించుకున్న భక్తులలో మొట్టమొదటి వాడు శ్యామా అసలు పేరు మాధవరావ్ దేశ్ పాండే బాబా అతనిని "శ్యామా" అని పిలుస్తూ ఉండడం వల్ల అతనికి ఆ పేరే స్ధిరపడి పోయింది శ్యామా శిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ గ్రామంలో జన్మించాడు తర్వాత వారి కుటుంబం శిరిడీకి వచ్చి స్ధిరపడింది బాబా యువకుడుగా శిరిడీలో కనిపించేటప్పటికి శ్యామాకు సుమారు 15 సం:లు అప్పట్లో శ్యామా శిరిడీలోని పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఉండేవాడు అప్పటి నుంచీ దాదాపు 15 సం. రాలపాటు బాబాతో మశీదులో చిలిం త్రాగుతూ ఉండేవాడు అయినప్పటికీ ఆ రోజుల్లో అతనికి బాబా గొప్పతనం తెలియలేదు అతడు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించేవాడు.

ఒకసారి ఒక పెద్ద ప్రభుత్వోద్యోగి అయిన చిదంబర్ కేశవ్ గాడ్గే పూణేలో భీమశంకరాలయంలో ఒక సాధువును దర్శించాడు బాబా ఎంతో గొప్ప మహాత్ములని ఆయనను దర్శించమనీ చెప్పి ఆ సాధువు గాడ్గేను బాబా దర్శనానికి శిరిడీ పంపారు అంత పెద్ద ప్రభుత్వద్యోగి సాయి దర్శనానికి రావడం శ్యామా నెంతో ఆశ్చర్యపరిచింది అంతేకాదు ఒకసారి శ్యామా అక్కల్ కోట మహారాజ్ భక్తుడు గొప్ప మహనీయుడు అయిన ఆనందస్వామి దర్శనానికి వెళ్ళాడు ఆయన అతనితో కలిసి బాబా దర్శనం కోసం శిరిడీ వచ్చి బాబా ఎంతో గొప్ప మహానీయుడని చెప్పారు అలాగే గంగగిర్ బాబా కూడా బాబా ఎంతో గొప్పవారని ప్రశంసించారు ఈ సంఘటనలు జరిగిన తర్వాత శ్యామాకు బాబా పట్ల భక్తి కలిగింది.

శ్యామా రాత్రి పూట పాఠశాల లోనే నిద్రపోయేవాడు పాఠశాలకు ఎదురుగానే ఉన్న మసీదు నుంచి బాబా ఇంగ్లీషులోను, ఉర్దూ లోను, హిందీ లోను, ఇంకా ఎన్నో భాషలలో మాట్లాడడం అతడు గమనించాడు బాబా ఎంతో గొప్ప మహాత్ములని శ్యామాకు అర్ధమైంది అప్పటి నుంచి శ్యామా బాబాను ఎంతో విశ్వాసంతో సుమారు 20 సం:లు సేవించాడు.

ఒకసారి శ్యామాకు తీవ్రంగా కంటి నొప్పి వచ్చింది ఎన్ని మందులు వాడినా బాధ తగ్గలేదు అతడు బాబాను ప్రార్థించాడు అప్పుడు బాబా "శ్యామా ఏడు మిరియాలు నీటిలో గంధంగా అరగదీయి ఆ గంధం తీసి నీ కళ్ళల్లో పెట్టుకో అప్పుడు నీ కంటి నొప్పి తగ్గిపోతుంది" అని ఊదీ యిచ్చి పంపారు అతడు బాబా ఆజ్ఞను పాటించాడు వెంటనే అతని కంటి నొప్పి తగ్గిపోయింది.

బాబాకు శ్యామా అంటే ప్రత్యేకమైన ప్రేమ రోజులో కొన్ని సమయాలలో బాబా భక్తులెవ్వరినీ మసీదు లోపలికి ప్రవేశించ నిచ్చేవారు కాదు కానీ శ్యామాను మాత్రం ఏ సమయంలోనైనా అనుమతించేవారు శ్యామా బాబాను "దేవా" అని ఎంతో ఆప్యాయంగా భక్తితో పిలిచేవాడు బాబా అతనికి ఎంతో ప్రేమగా ఏకనాథ భాగవతము, విష్ణు సహస్రనామము, వెండి పాదుకలు, వెండి విగ్రహాలు.. ఇలా ఎన్నో ప్రసాదంగా యిచ్చారు అతనిని ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు పంపారు రాజులు, మహారాజులు, కోటీశ్వరులు, అతనిని ఎంతో ఆదరించి గౌరవించి ఘనంగా పల్లకీల లోను ఏనుగుల మీదా తీసుకుని వెళ్లి పుణ్యక్షేత్రాలను చూపించేవారు ఇదంతా సాయి కృపేనని అతనికి స్పష్టంగా తెలుసు అతడెంతో కృతజ్ఞతతో ఎక్కడికెళ్ళినా బాబా గురించే చెబుతూ ఎంతో భక్తితో ప్రవర్తించేవాడు.

ఒకసారి శ్యామా బాబాను తనకు బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము చూపించమని బ్రతిమాలాడు. బాబా ఎంతో దయతో అతనికి వాటిని దర్శింప చేశారు ఆ తర్వాత అతనితో "మనం వీటిని కాదు దర్శించవలసినది వీటికి పైనున్న దానిని దర్శించాలి" అన్నారు బాబా అంటే భగవంతుని దర్శనం కోసం శ్యామా ప్రయత్నించాలని బాబా భావం.

మహాసమాధి చెందిన తర్వాత కూడా బాబా శ్యామాను కాపాడుతూనే ఉండేవారు. అతడు గూడా బాబా గురించే అందరితో మాట్లాడుతూ ఆయననే స్మరిస్తూ ఉండేవాడు అతడు నిద్ర పోతున్నప్పుడు కూడా అతడి ప్రతి శ్వాస లోనూ స్పష్టంగా "సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా" అన్న నామం వినిపిస్తూనే ఉండేదని ఖాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు అంతటి భాగ్యశాలి శ్యామా.

"https://te.wikipedia.org/w/index.php?title=శ్యామా&oldid=2007292" నుండి వెలికితీశారు