శ్రావణమాసము

వికీపీడియా నుండి
(శ్రావణ మాసము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.

శ్రావణమాస మహత్యం

[మార్చు]

శ్రావణమాస మహత్యం స్కాంద పురాణంలోనున్నది. దీనిని చల్లా నాగలింగశాస్త్రి వారి పుత్రుడైన చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ద్వారా ఆంధ్రతాత్పర్యసహితంగా అనువదించబడింది. దీనిని బ్రహ్మశ్రీ కావూరి రంగయ్య శాస్త్రులు పరిష్కరించి ఆర్యానంద ముద్రాక్షరశాల, మచిలీపట్నంలో 1932లో ముద్రించబడింది.[1]

పండుగలు

[మార్చు]
శ్రావణ శుద్ధ పాడ్యమి *
శ్రావణ శుద్ధ విదియ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
శ్రావణ శుద్ధ తదియ *
శ్రావణ శుద్ధ చతుర్థి నాగుల చవితి
శ్రావణ శుద్ధ పంచమి *
శ్రావణ శుద్ధ షష్ఠి *
శ్రావణ శుద్ధ సప్తమి *
శ్రావణ శుద్ధ అష్ఠమి *
శ్రావణ శుద్ధ నవమి *
శ్రావణ శుద్ధ దశమి *
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ శుద్ధ ద్వాదశి *
శ్రావణ శుద్ధ త్రయోదశి *
శ్రావణ శుద్ధ చతుర్దశి *
శ్రావణ పూర్ణిమ రాఖీ పౌర్ణమి, హయగ్రీవ స్వామి జయంతి
శ్రావణ బహుళ పాడ్యమి *
శ్రావణ బహుళ విదియ *
శ్రావణ బహుళ తదియ *
శ్రావణ బహుళ చవితి *
శ్రావణ బహుళ పంచమి *
శ్రావణ బహుళ షష్ఠి *
శ్రావణ బహుళ సప్తమి *
శ్రావణ బహుళ అష్ఠమి కృష్ణాష్టమి
శ్రావణ బహుళ నవమి *
శ్రావణ బహుళ దశమి *
శ్రావణ బహుళ ఏకాదశి *
శ్రావణ బహుళ ద్వాదశి *
శ్రావణ బహుళ త్రయోదశి *
శ్రావణ బహుళ చతుర్దశి మాసశివరాత్రి
శ్రావణ బహుళ అమావాస్య *

ఇతర విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. భారత డిజిటల్ లైబ్రరీలో శ్రావణమాస మహాత్మ్యము పుస్తక ప్రతి.
  2. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 9. Retrieved 26 June 2016.[permanent dead link]
  3. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]